మహారాష్ట్రలోని కొల్హాపూర్లో జమదార్ ముస్లిం కుటుంబం అనేక సంవత్సరాలుగా వినాయక చవితిని భక్తిశ్రద్ధలతో జరుపుకుంటోంది. ఐదు రోజుల పాటు పూజలు చేసి, నిమజ్జనం చేస్తూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. ఛత్రపతి షాహూ మహారాజ్ సామాజిక ఐక్యత స్ఫూర్తితో ఈ కుటుంబం దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది.