అమెరికాలో ఉన్నత ఉద్యోగం చేస్తున్న యువతిని ప్రేమ, పెళ్లి పేరుతో నటుడు సౌరవ్ గుర్జర్ మోసం చేశాడు. కలిసి వ్యాపారం చేద్దామని నమ్మించి, ఆమె ఉద్యోగం మాన్పించి ఇండియాకు రప్పించాడు. వివాహితుడై ఉండి కూడా పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి ఐదేళ్లు మోసం చేశాడు. గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సౌరవ్ గుర్జర్ అరెస్ట్ అయ్యాడు.