జగిత్యాల జిల్లా కోరుట్ల బస్టాండ్లో మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సును దొంగలించి కలకలం సృష్టించాడు. డ్రైవర్ టీ తాగుతుండగా బస్సును ఎత్తుకెళ్లిన నిందితుడిని పోలీసులు మూడు వాహనాల్లో సినిమా తరహాలో వెంబడించారు. దారిలో బైక్, లారీని ఢీకొట్టిన తర్వాత మెట్పల్లి వద్ద బస్సు ఆగింది. పారిపోతున్న దొంగను పోలీసులు చుట్టుముట్టి అరెస్ట్ చేశారు.