AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fuel Price: దేశంలో మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్‌పై ఎంతంటే?

Petrol and diesel price Hike :అక్కడెక్కడో పశ్చిమాసియాలో భగ్గుమన్న అగ్నిజ్వాలల సెగ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తోంది. యుద్ధం కారణంగా నిలిచిన చమురు సరఫరాతో అంతర్జాతీయ మార్కెట్‌లో భారీగా చమురు ధరలు పెరిగిపోయాయి. దీంతో ప్రపంచ దేశాల్లో సైతం పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటున్నాయి.

Fuel Price: దేశంలో మరోసారి భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. లీటర్‌పై ఎంతంటే?
Petrol And Diesel Price Hike Today
Anand T
|

Updated on: May 25, 2026 | 6:34 AM

Share

గత నెల రోజులుగా వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం వరుస షాక్‌లు ఇస్తోంది. వారం రోజులకోసారి దేశంలో ఇంధన ధరలను పెంచేస్తోంది. ఇప్పటికే మూడు సార్లు ధరలను పెంచిన కేంద్ర ప్రభుత్వం తాజాగా మరోసారి ఇంధన ధరలను పెంచుతున్నట్టు ప్రకటించింది. తాజాగా లీటర్ పెట్రోల్‌పై రూ.2.84పైసలు, డీజిల్‌పై రూ.2.86పైసలను పెంచేసింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్ర సర్కార్ పేర్కొంది.

ఇదిలా ఉండగా దేశంలో ఇంధన ధరలు పెరగడం ఇది నాలుగో సారి.. తొలిసారి పెట్రోల్‌రూ.3 పెంచిన ప్రభుత్వం ఆ తర్వాత రూ. తర్వాత రూ.87 పైసలు పెంచింది ఇక తాజాగా మరోసారి రూ.2.84 పైసలు పెంచుతూ దేశవ్యాప్తంగా ఉన్న వాహన దారులకు షాక్ ఇచ్చింది. అంటే కేవలం నెల రోజుల్లో పెట్రోల్‌పై  దాదాపు రూ.8 వరకు పెరిగింది. ఇది సామాన్య ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.

ప్రస్తుతం పశ్చిమాసియాలో నడుస్తున్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 20% చమురు రవాణా జరిగే స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ మార్గం గుండా రవాణా నిలిచిపోవడంతో చమురు సరఫరా ఆగిపోయింది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధరలు భారీగా పెరిగాయి. బ్యారెల్ ధర $100 మార్కును దాటిపోవడంతో భారత్‌లో ఇంధన ధరలను పెంచక తప్పలేదు.అ

అయితే అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినప్పటికీ, దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు గత కొన్ని వారాలుగా సామాన్యులపై భారం పడకుండా ధరలను స్థిరంగా ఉంచాయి. దీనివల్ల ఆ కంపెనీలు దాదాపు రూ.1000 కోట్ల భారం పడుతుందని ప్రభుత్వం చెప్పుకొచ్చింది.  ఈ నష్టాలను భర్తీ చేసుకునేందుకే ఇప్పుడు ధరలను పెంచుతున్నట్టు కేంద్రం పేర్కొంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us