AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CUET UG 2026 Postponed: విద్యార్ధులకు అలర్ట్.. సీయూఈటీ యూజీ పరీక్ష వాయిదా! ఎందుకంటే..

మే 28న జరగాల్సిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) 2026 పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు జాతీయ పరీక్షల ఏజెన్సీ (NTA) ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఈద్-ఉల్-జుహా (బక్రీద్) తేదీ మారిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికారిక ప్రకటన ప్రకారం మే 28న జరగాల్సిన పరీక్ష రెండు షిఫ్టులను వాయిదా వేశారు..

CUET UG 2026 Postponed: విద్యార్ధులకు అలర్ట్.. సీయూఈటీ యూజీ పరీక్ష వాయిదా! ఎందుకంటే..
CUET UG exam postponed
Srilakshmi C
|

Updated on: May 25, 2026 | 6:18 AM

Share

హైదరాబాద్‌, మే 25: ‘కామన్‌ యూనివర్సిటీ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ) యూజీ 2026 పరీక్ష వాయిదా పడింది. షెడ్యూల్‌ ప్రకారం మే 28న జరగాల్సిన ఈ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు షనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించింది. ఆ రోజు రెండు షిఫ్ట్‌ల్లో ఈ పరీక్షను నిర్వహించవల్సి ఉంది. ఈద్-ఉల్-జుహా (బక్రీద్) సెలవు తేదీలో మార్పు చేస్తున్నట్లు మే 24వ తేదీన కేంద్రం ప్రకటన జారీ చేసింది. దీంతో బక్రీద్‌ సందర్భంగా సెలవు తేదీలో వచ్చిన మార్పు కారణంగా DoPT జారీ చేసిన నోటిఫికేషన్ దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్‌టీఏ పేర్కొన్నది. పరీక్ష కొత్త తేదీలను ఎన్‌టీఏ, సీయూఈటీ వెబ్‌సైట్‌ల ద్వారా తెలియజేస్తామని ఎన్టీయే పేర్కొంది.

కాగా దేశవ్యాప్తంగా ఉన్న సెంట్రల్‌ యూనివర్సిటీలు సహా ప్రఖ్యాత వర్సిటీల్లో యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. కొత్త షెడ్యూల్, పరీక్షా ప్రకటనలకు సంబంధించిన తాజా సమాచారం కోసం విద్యార్థులు అధికారిక NTA, CUET వెబ్‌సైట్‌లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని సూచించింది. ఇతర సందేహాలకు అభ్యర్థులు 011-40759000 నంబర్‌లో NTA హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చు లేదా cuet-ug@nta.ac.in కు ఈమెయిల్ చేయవచ్చు. ఇతర వివరాలకు ఈ కింది లింక్ పై క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us
పైలట్లకు జీతం ఎంత ఉంటుంది..? వామ్మో.. ఎంతంటే..?
పైలట్లకు జీతం ఎంత ఉంటుంది..? వామ్మో.. ఎంతంటే..?
జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా?తింటే ఏమవుతుంది.. వైద్యుల సూచన
జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా?తింటే ఏమవుతుంది.. వైద్యుల సూచన
సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో..
సోమవారం శివుడితో పాటు చంద్రుడిని ఎందుకు పూజిస్తారు? గంగాజలంతో..
థియేటర్లలో తడబడింది.. ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది.!
థియేటర్లలో తడబడింది.. ఓటీటీలో మాత్రం దూసుకుపోతోంది.!
బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే ఎందుకు ఆగిపోతారు..?
బయటకు వెళ్లేటప్పుడు తుమ్మితే ఎందుకు ఆగిపోతారు..?
బ్యాటింగ్ ఓకే.. కానీ ఈ రెండు విభాగాల్లో టీమిండియా వీక్
బ్యాటింగ్ ఓకే.. కానీ ఈ రెండు విభాగాల్లో టీమిండియా వీక్
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం
హైదరాబాదీలకు బిగ్‌ అలర్ట్.. అమల్లోకి కొత్త మున్సిపల్ చట్టం
మౌనిక పుట్టిన రోజు.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్
మౌనిక పుట్టిన రోజు.. ఇంట్రెస్టింగ్ వీడియో షేర్ చేసిన మంచు మనోజ్
తాబేలు కీరింగ్‌లో తాళం చెవులు పెడుతున్నారా? శుభమా.. అశుభమా?
తాబేలు కీరింగ్‌లో తాళం చెవులు పెడుతున్నారా? శుభమా.. అశుభమా?
రూ.15 లక్షల ఆఫ్ఘన్ నీలి రాతితో భారీ శివలింగం.. భారత్‌లో తొలిసారి!
రూ.15 లక్షల ఆఫ్ఘన్ నీలి రాతితో భారీ శివలింగం.. భారత్‌లో తొలిసారి!