AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆపరేషన్ ‘నీలీ’.. వెతికి,వేటాడి మట్టుబెడుతున్న ఇజ్రాయెల్!

ఆపరేషన్ ‘నీలీ’.. వెతికి,వేటాడి మట్టుబెడుతున్న ఇజ్రాయెల్!

Samatha J
|

Updated on: May 25, 2026 | 12:00 PM

Share

మీకు తెలుసా? 1972 మ్యూనిచ్‌ ఒలింపిక్స్‌లో పాల్గొన్న 11 మంది ఇజ్రాయెల్‌ అథ్లెట్లను పాలస్తీనా ‘బ్లాక్‌ సెప్టెంబర్‌’ గ్రూప్‌ చంపేసింది. ఈ దారుణానికి సూత్రధారులు, పాత్రధారులను మట్టుబెట్టేందుకు అప్పట్లో ఆపరేషన్‌ ‘రాత్‌ ఆఫ్‌ గాడ్‌’ను ఇజ్రాయెల్‌ చేపట్టింది. దాదాపు ఇరవై ఏళ్ల పాటు శ్రమించి తమ అథ్లెట్లను చంపిన వారిలో 12 నుంచి 20 మంది హంతకులను వేటాడి మరీ మట్టుబెట్టింది. ఇప్పుడు అదే తరహాలో ఇజ్రాయెల్‌ మరో ‘రాత్‌ ఆఫ్‌ గాడ్‌’ ఆపరేషన్‌ను చేపట్టినట్లు తెలుస్తోంది.

2023 ‘అక్టోబర్‌ 7’ నరమేధంలో పాల్గొని ఇజ్రాయెలీల ప్రాణాలు తీసి.. మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన వారిని వెతికి.. వేటాడి మరీ మట్టుబెడుతోంది. ఇజ్రాయెల్‌ టార్గెట్‌ లిస్ట్‌ వేలల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఏకంగా ఓ స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌నే ఏర్పాటు చేసి.. అత్యాధునిక టెక్నాలజీని ఇజ్రాయెల్‌ వాడుతోంది. ఫేషియల్ రికగ్నిషన్, సెల్ ఫోన్ ట్రాకింగ్, డ్రోన్ సర్వైలెన్స్, సోషల్ మీడియా విశ్లేషణ ద్వారా ఈ నీలీ టాస్క్‌ఫోర్స్‌ హంతకుల డేటా సేకరిస్తోంది. ఇజ్రాయెల్‌ చేపట్టిన ఈ ఆపరేషన్‌ను చాలా మంది అప్పట్లో ఇజ్రాయెల్ అథ్లెట్లను చంపిన మిలిటెంట్లపై మొసాద్ జరిపిన దశాబ్దాల వేటతో పోలుస్తున్నారు. మొసాద్ చీఫ్ డేవిడ్ బర్నియా కూడా “మ్యూనిచ్ ఘటన అనంతర ఆపరేషన్ లాగే దీనికీ సమయం పడుతుంది. కానీ వారు ఎక్కడున్నా మేం వారిని పట్టుకొని శిక్షించి తీరతాం” అని వ్యాఖ్యానించడం గమనార్హం.అక్టోబర్‌ 7 ఒక్కరోజే హమాస్‌ మిలిటెంట్లు చేసిన దాడిలో ఇజ్రాయెల్‌లోని వివిధ ప్రాంతాల్లో 1200 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 250 మందిని బందీలుగా గాజాకు తరలించారు. ఆ సమయంలో ఇజ్రాయెల్‌ ఓ కీలక నిర్ణయం తీసుకొంది. దాడిలో ప్రత్యక్షంగా పాల్గొన్న వారిని ఏమాత్రం క్షమించకూడదని భావించింది. దీనికోసం ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి దానికి ‘నీలీ’ అని పేరు పెట్టింది. NILI (ఎన్‌ఐఎల్‌ఐ) అంటే హిబ్రూ భాషలో ‘ఇజ్రాయెల్‌లో శాశ్వతమైన వ్యక్తి అబద్ధం చెప్పడు’ అని అర్థం. తొలి ప్రపంచ యుద్ధంలో ఈ పేరును యూదు గూఢచారులు వాడేవారు.

మరిన్ని వీడియో కోసం : 

న్యూ రికార్డ్స్ ను టార్గెట్ చేస్తున్న రామాయణ!

జాన్వీ కపూర్ కోలీవుడ్ డెబ్యూ

చాలా ఏళ్లుగా బిగ్ హిట్ కోసం ఎదురుచూస్తున్న ఆమిర్‌ఖాన్

దృశ్యం 3 హిట్టా..? ఫట్టా..?

Published on: May 24, 2026 04:19 PM
Follow Us