క్షిపణులను బూడిద చేసే S-400.. రష్యా నుంచి భారత్‌కు రానున్న 4వ యూనిట్
భారత్–రష్యా మధ్య 2018లో 5.4 బిలియన్ అమెరికన్ డాలర్ల విలువైన ఒప్పందం కుదిరింది. ఈ అగ్రిమెంట్ ప్రకారం రష్యా మొత్తం ఐదు S-400 స్క్వాడ్రన్లను భారత్‌కు చేరవేయాలి. ఇప్పటికే మూడు యూనిట్లు భారత వైమానిక దళంలో సేవలందిస్తున్నాయి. నాలుగో యూనిట్ మే మాసం ఆఖరు వారంలో భారత్‌కు రానుంది. ఈ యూనిట్‌ను పాకిస్థాన్ వైపు నుంచి వచ్చే క్షిపణులు, డ్రోన్ దాడులను అడ్డుకునేందుకు రాజస్థాన్ సరిహద్దుల్లో మోహరించనున్నారు.
ఈ ఏడాది నవంబర్ నాటికి ఐదో యూనిట్ కూడా భారత్‌కు చేరే అవకాశం ఉంది. దానిని చైనా సరిహద్దు ప్రాంతంలో మోహరించనున్నట్టు సమాచారం. “ఇండియన్ ఐరన్ డోమ్” రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయడమే భారత లక్ష్యంగా కనిపిస్తోంది. అదనంగా మరో ఐదు S-400 యూనిట్ల కొనుగోలుకు కూడా భారత రక్షణ కొనుగోలు మండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎస్-400 క్షిపణి వ్యవస్థ 400 కిలోమీటర్ల పరిధిలోని విమానాలు, బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ మిసైల్స్, మానవరహిత వైమానిక వాహనాలు వంటి అన్ని రకాల వైమానిక లక్ష్యాలను ఛేదించగలదు. రష్యా తయారు చేసిన ఎస్-400 క్షిపణి వ్యవస్థ ప్రపంచంలోని అత్యంత అధునాతనమైన, శక్తివంతమైన మిసైల్ సిస్టమ్. ఇది భూమి నుంచి ఆకాశానికి ప్రయోగించే క్షిపణి వ్యవస్థల్లో ఒకటి. ఈ ఎస్-400ను నాటో.. SA-21 గ్రోలర్ అని కూడా పిలుస్తుంది. 2018లో భారత దళాలకు అందుబాటులో వచ్చిన ఈ మిస్సైల్.. యుద్ధ విమానాలు, బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్‌లు, స్టెల్త్ విమానాలతో సహా అనేక రకాల వైమానిక ముప్పులను అడ్డుకుంటుంది. ఎస్-400 క్షిపణి వ్యవస్థ.. రష్యా, భారత్ మాత్రమే కాకుండా చాలా దేశాలు ఉపయోగిస్తున్నాయి. ఈ మిసైల్ సిస్టమ్ లో అధునాతన రాడార్‌లు, క్షిపణి ప్రయోగ వ్యవస్థలుంటాయి. వీటిని ఒక కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ఎప్పటికప్పుడు సమన్వయం చేస్తుంది. ఇవి 360 డిగ్రీల కోణంలో నిఘా వేస్తాయి. అంతేకాకుండా 600 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను గుర్తించగలవు. ఈ క్షిపణులు గంటకు 17 వేల కిలోమీటర్ల వేగంతో, 10 మీటర్ల నుంచి 30 కిలోమీటర్ల ఎత్తు వరకు.. బాలిస్టిక్ క్షిపణులతో సహా ఇతర లక్ష్యాలను చేధించగలవు.
మరిన్ని వీడియో కోసం :
న్యూ రికార్డ్స్ ను టార్గెట్ చేస్తున్న రామాయణ!
‘ఎబోలా ' కలకలం.. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో హై అలర్ట్
నాడు మనసులు కలిస్తే.. నేడు చాట్‌జీపీటీ ‘ఓకే’ అంటేనే..
రోడ్లపై చావుతో ఆటలు.. పోలీసుల చేతికి చిక్కిన రేసర్!
ఉక్కపోతతో ఇళ్లలోకి నాగుల ఎంట్రీ.. నంద్యాలలో భారీ కోబ్రా కలకలం
భవనంపై చిక్కుకున్న శునకం.. దిక్కుతోచక విలవిల..
వ్యక్తి కడుపులో రాళ్లగుట్ట..స్కానింగ్ రిపోర్ట్ చూసి షాక్!
అంతరిక్ష అద్భుతాన్ని మన గ్రామస్తుడు ఫొటో తీసాడు!

