AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గ్రాట్యుటీ కోసం ఐదేళ్లు ఒకే కంపెనీలో ఉండాలా? బెటర్‌ ప్యాకేజీ కోసం రిస్క్‌ తీసుకోవాలా?

మెరుగైన జీతం కోసం ఉద్యోగం మారాలా లేక ఐదేళ్ల గ్రాట్యుటీ కోసం ప్రస్తుతం ఉన్న సంస్థలోనే కొనసాగాలా అనే సందిగ్ధత చాలామంది ఉద్యోగుల్లో కనిపిస్తోంది. కొందరు గ్రాట్యుటీని ఆర్థిక భరోసాగా భావిస్తుండగా, మరికొందరు దీర్ఘకాలిక కెరీర్‌ వృద్ధి కే ప్రాధాన్యం ఇస్తున్నారు.

గ్రాట్యుటీ కోసం ఐదేళ్లు ఒకే కంపెనీలో ఉండాలా? బెటర్‌ ప్యాకేజీ కోసం రిస్క్‌ తీసుకోవాలా?
Gratuity
SN Pasha
|

Updated on: May 24, 2026 | 8:22 PM

Share

ఉద్యోగ జీవితంలో ఒక దశకు వచ్చిన తర్వాత చాలామంది ఎదుర్కొనే పెద్ద సందిగ్ధత ఇదే. ప్రస్తుతం మెరుగైన జీతం, ఉన్నత పదవి, మంచి అవకాశాలతో కొత్త ఉద్యోగ ఆఫర్లు వస్తున్నా.. మరోవైపు కొన్ని నెలలు ఆగితే గ్రాట్యుటీ లభించే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు ‘సేఫ్‌’ నిర్ణయం తీసుకోవాలా? లేక ‘గ్రోత్‌’ కోసం రిస్క్‌ చేయాలా? అనే ప్రశ్నపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. భారతీయ ఉద్యోగుల్లో చాలామంది గ్రాట్యుటీని కేవలం ఒక అదనపు బెనిఫిట్‌గా కాకుండా, సంస్థకు ఇచ్చిన సంవత్సరాల సేవకు గుర్తింపుగా భావిస్తున్నారు. ముఖ్యంగా ఐదేళ్ల సేవ పూర్తికావడానికి కొద్ది నెలలే మిగిలి ఉంటే, చాలా మంది ఉద్యోగులు అక్కడే కొనసాగడానికే మొగ్గు చూపుతున్నారు.

న్యూఢిల్లీకి చెందిన ఉద్యోగి కుష్‌ శర్మ అభిప్రాయం ప్రకారం మెరుగైన కెరీర్‌ అవకాశాలు ముఖ్యమైనవే అయినప్పటికీ, ఐదేళ్లకు చాలా దగ్గరగా ఉంటే గ్రాట్యుటీ కోల్పోవడం సరైన నిర్ణయం కాదని భావిస్తున్నారు. సుమారు రూ.15 లక్షల వార్షిక ప్యాకేజీ ఉన్న ఉద్యోగికి ఐదేళ్ల తర్వాత దాదాపు రూ.1.8 లక్షల వరకు గ్రాట్యుటీ లభించే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు. కొత్త ఉద్యోగంలో వచ్చే జీతం పెంపు ఆ నష్టాన్ని మించేలా ఉండాలి అని అభిప్రాయపడ్డారు. మరోవైపు యువ ఉద్యోగులు మాత్రం దీర్ఘకాలిక కెరీర్‌ ఎదుగుదలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. కొత్త అవకాశాల్లో నేర్చుకునే అవకాశాలు, మంచి వర్క్‌ కల్చర్‌, భవిష్యత్‌ సంపాదన సామర్థ్యం ముఖ్యమని భావిస్తున్నారు.

వృత్తిపరమైన చికిత్స నిపుణురాలు నిని శర్మ ప్రకారం.. ఒకేసారి వచ్చే గ్రాట్యుటీ కంటే, దీర్ఘకాలంలో కెరీర్‌ గ్రోత్‌ ఎక్కువ విలువైనది అంటున్నారు. సామాజిక రంగంలో పనిచేసే అల్కా శర్మ వంటి ఉద్యోగులకు మాత్రం గ్రాట్యుటీ ఆర్థిక భరోసాగా కనిపిస్తోంది. తక్కువ జీతాలు ఉన్న రంగాల్లో పనిచేసేవారికి ఈ మొత్తం అత్యవసర నిధిలా ఉపయోగపడుతుందని చెబుతున్నారు. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ నిర్ణయం పూర్తిగా వ్యక్తిగత ఆర్థిక పరిస్థితులు, కెరీర్‌ లక్ష్యాలు, కొత్త ఉద్యోగ అవకాశాలపై ఆధారపడి ఉంటుంది. ఐదేళ్ల మైలురాయికి చాలా దగ్గరగా ఉంటే వేచి ఉండటం మంచిదని, లేదంటే దీర్ఘకాలిక వృద్ధి కలిగించే అవకాశాలను వదులుకోవద్దని సూచిస్తున్నారు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us