- Telugu News Photo Gallery Cinema photos The Kerala Story Fame Adah Sharma to play cop in Shreyas Talpade's 'The Game of Girgit'
Adah Sharma: ది కేరళ స్టోరీ సినిమాతో ఫుల్ క్రేజ్.. మరో క్రేజీ ప్రాజెక్టులో ఛాన్స్ కొట్టేసిన అదా శర్మ
ఇప్పటివరకు కేవలం గ్లామరస్ రోల్స్‌లోనే ఎక్కువగా కనిపించింది అదా. అయితే ది కేరళ స్టోరీ సినిమాలో అభినయం పరంగా మంచి మార్కులు దక్కాయి. ఈనేపథ్యంలో ఆమెకు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.
Updated on: May 12, 2023 | 9:34 AM

The Kerala Story Movie

'ది కేరళ స్టోరీ’ సినిమా తర్వాత హీరోయిన్ అదా శర్మ ఓ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ‘హేట్ స్టోరీ 2’ ఫేమ్ విశాల్ పాండ్య దర్శకత్వంలో శ్రేయాస్ తల్పాడే హీరోగా నటిస్తున్న చిత్రం ‘ది గేమ్ ఆఫ్ గిర్జిట్’. ఈ చిత్రంలో అదా శర్మ హీరోయిన్‌గా ఎంపికైంది.

‘బ్లూ వేల్ గేమ్’ (బ్లూ వేల్ ఛాలెంజ్) నేపథ్యంలో థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఇందులో అదా శర్మ పోలీస్ పాత్రలో కనిపించనుంది. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టును షేర్ చేసిందీ అందాల తార.

గతంలో ‘కమాండో’ సినిమాలో భావనా రెడ్డి అనే పోలీస్ పాత్ర చేశాను. ఆ పాత్రకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు ‘ది గేమ్ ఆఫ్ గిర్జిట్’లో గాయత్రీ భార్గవ్ అనే పోలీస్ పాత్ర చేస్తున్నాను. ఇది ఎంతో సరదాగా ఉంటుంది' అని చెప్పుకొచ్చింది అదా.

కాగా ఇప్పటివరకు కేవలం గ్లామరస్ రోల్స్‌లోనే ఎక్కువగా కనిపించింది అదా. అయితే ది కేరళ స్టోరీ సినిమాలో అభినయం పరంగా మంచి మార్కులు దక్కాయి. ఈనేపథ్యంలో ఆమెకు వరుస ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి.




