Kriti Sanon: సీతమ్మ సింప్లిసిటీ.. థియేటర్‌లో నేలపైనే కూర్చొని’ ఆదిపురుష్’ ట్రైలర్ చూసిన కృతి సనన్.. వైరల్‌ వీడియో

ముంబైలోని ఓ థియేటర్‌లో ఆదిపురుష్  ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ప్రభాస్, కృతి సనన్, డైరెక్టర ఓం రౌత్‌తో పాటు మూవీ యూనిట్‌తో పాటు అభిమానులు భారీగా హాజరయ్యారు. అయితే వారు వచ్చేసరికే థియేటర్ పూర్తిగా కిక్కిరిసిపోయింది. కృతిసనన్‌ కూర్చోడానికి..

Kriti Sanon: సీతమ్మ సింప్లిసిటీ.. థియేటర్‌లో నేలపైనే కూర్చొని' ఆదిపురుష్' ట్రైలర్ చూసిన కృతి సనన్.. వైరల్‌ వీడియో
Kriti Sanon
Follow us
Basha Shek

|

Updated on: May 11, 2023 | 6:20 AM

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆది పురుష్‌ ట్రైలర్‌ గ్రాండ్‌గా రిలీజైంది. మంగళవారం (మే9)న అధికారికంగా సోషల్‌ మీడియాతో పాటు పలు నగరాల్లోని థియేటర్లలో గ్రాండ్‌గా ప్రభాస్‌ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. దీనికి సూపర్ రెస్పాన్స్‌ వస్తోంది. ప్రస్తుతం ఆది పురుష్‌ ట్రైలర్‌ యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది. కాగా ముంబైలోని ఓ థియేటర్‌లో ఆదిపురుష్  ట్రైలర్‌ లాంఛ్‌ ఈవెంట్‌ ఘనంగా జరిగింది. ప్రభాస్, కృతి సనన్, డైరెక్టర ఓం రౌత్‌తో పాటు మూవీ యూనిట్‌తో పాటు అభిమానులు భారీగా హాజరయ్యారు. అయితే వారు వచ్చేసరికే థియేటర్ పూర్తిగా కిక్కిరిసిపోయింది. కృతిసనన్‌ కూర్చోడానికి సీటు కూడా దొరకలేదు. దీంతో వెంటనే ఆమె నేలపై కూర్చొంది. ఇది గమనించిన దర్శక నిర్మాతలు వెంటనే పైకి లేచి ఆమెను కూర్చీలో కూర్చోవాలని కోరారు. అయితే అప్పటికే ట్రైలర్ స్క్రీనింగ్‌కి సమయం కావడంతో నేలపైనే కూర్చొని ట్రైలర్‌ను వీక్షించింది. దీనికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పటికే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. కృతిసనన్‌ సింప్లిసిటీ చూసి అభిమానులు, నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. కాగా ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఆదిపురుష్‌ సినిమా జూన్‌ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

ఆది పురుష్‌లో శ్రీరాముడిగా ప్రభాస్, సీత పాత్రలో కృతి నటించారు. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్, లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమంతుడిగా దేవదత్తా నాగే నటించారు. కాగా ఈ సినిమాకు సంబంధించి మొదట విడుదలైన టీజర్‌పై భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. రావణుడి గెటప్‌పై విమర్శలు వచ్చాయి. సినిమాను నిషేధిస్తామన్న హెచ్చరికలు వచ్చాయి. అయితే ఈ విమర్శలను తిప్పి కొడుతూ ఆదిపురుష్‌ ట్రైలర్‌ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. ప్రభాస్ లుక్, కృతి సనన్ అందం, అభినయం, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ అప్పియరెన్స్ అభిమానులను బాగా ఆకట్టుకుంటున్నాయి.

కృతి సనన్ వీడియో

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..