Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adipurush: ‘ఆది పురుష్‌’ను వదులుకున్న స్టార్‌ హీరో! మంచి సినిమా మిస్‌ అయ్యాడుగా.. ఎవరో తెలిస్తే షాక్‌ అవుతారు

గతంలో విడుదలైన టీజర్‌ కన్నా వంద రెట్లు మెరుగ్గా ప్రభాస్‌ మూవీ ట్రైలర్‌ ఉందంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న అది పురుష్‌ జూన్ 16న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఇదిలా ఉంటే. ఆదిపురుష్‌ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.

Adipurush: 'ఆది పురుష్‌'ను వదులుకున్న స్టార్‌ హీరో! మంచి సినిమా మిస్‌ అయ్యాడుగా.. ఎవరో తెలిస్తే షాక్‌ అవుతారు
Adipurush Movie
Follow us
Basha Shek

|

Updated on: May 13, 2023 | 8:48 AM

పాన్ ఇండియా హీరోప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ఆది పురుష్‌. రామయాణం నేపథ్యంలో బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్‌ ఈ మహా కావ్యాన్ని తెరకెక్కించారు. కృతి సనన్‌ సీతగా కనిపించనుంది. మొదట్లో ఆది పురుష్‌ మూవీ నుంచి రిలీజైన పోస్టర్లు, టీజర్‌పై భారీగా ట్రోల్స్‌ వచ్చాయి. ముఖ్యంగా రావణుడి గెటప్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. కొందరు రాజకీయ నాయకులైతే ఏకంగా సినిమాను నిషేధిస్తామని హెచ్చరికలు కూడా జారీ చేశారు. అయితే ఆ విమర్శలన్నింటినీ తిప్పికొడుతూ ఇటీవలే గ్రాండ్‌గా ట్రైలర్‌ రిలీజైంది. ప్రస్తుతం యూట్యూబ్‌లో రికార్డులు కొల్లగొడుతోంది ఆది పురుష్‌ ట్రైలర్‌. గతంలో విడుదలైన టీజర్‌ కన్నా వంద రెట్లు మెరుగ్గా ప్రభాస్‌ మూవీ ట్రైలర్‌ ఉందంటూ అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న అది పురుష్‌ జూన్ 16న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది. ఇదిలా ఉంటే. ఆదిపురుష్‌ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. అదేంటంటే ఈ సినిమాకు ఫస్ట్ ఛాయిస్ ప్రభాస్‌ కాదట. డైరెక్టర్ ఓం రౌత్ ఈ సినిమా కోసం ముందుగా బాలీవుడ్ స్టార్‌ హీరో హృతిక్ రోషన్ ను అనుకున్నారట. రాముడి పాత్రలో హృతిక్‌ కనిపిస్తే బాగుంటుందని భావించారట. అనుకున్నట్లుగానే హృతిక్‌కి కథ మొత్తం వినిపించారట. అయితే సినిమా కథలో మార్పులు చేయాలని డైరెక్టర్‌కు సూచించారట హృతిక్‌. అయితే దీనికి ఓం రౌత్‌ ఇష్టపడలేదట. దీంతో అప్పటికే బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌గా పాపులరైన ప్రభాస్‌ను ఎంచుకున్నారట. అలా ఆది పురుష్ సినిమా ప్రభాస్ దగ్గరకు వచ్చిందట

కాగా ఆదిపురష్‌ సినిమాలో రావణుడిగా సైఫ్‌ అలీఖాన్ కనిపించనున్నారు. అలాగే లక్ష్మణుడిగా సన్నీ సింగ్‌, హనుమంతుడిగా దేవదత్తా నాగే నటించారు. కాగా ఈ సినిమాలో సీత పాత్రకు కృతి సనన్‌ కంటే ముందు పలువురు హీరోలను అనుకున్నారట. ముందుకా దీపికా పదుకొణెను తీసుకుందామని మేకర్స్‌ భావించారట. అయితే అదే సమయంలో ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉందట. ఆ తర్వాత అనుష్క శర్మ, కియారా అద్వానీ, కీర్తి సురేష్ పేర్లు కూడా పరిశీలించారట. అయితే చివరకు కృతిని ఓకే చేశారట.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం..  క్లిక్ చేయండి.

ఎన్నో ఏళ్ల ప్రయాణం ముగిసింది.. ఈ బైక్‌లు ఇకపై భారతదేశంలో ఉండవు!
ఎన్నో ఏళ్ల ప్రయాణం ముగిసింది.. ఈ బైక్‌లు ఇకపై భారతదేశంలో ఉండవు!
కుప్పకూలిన అజిత్ 285 అడుగుల కటౌట్..
కుప్పకూలిన అజిత్ 285 అడుగుల కటౌట్..
అయ్యో భగవంతుడా.. పసివాడి ఉసురు తీసిన ఊర కుక్క..
అయ్యో భగవంతుడా.. పసివాడి ఉసురు తీసిన ఊర కుక్క..
ఉల్లిపాయ రసంలో వీటిని కలిపి రాస్తే జుట్టు సమస్యలకు చెక్ పడినట్టే!
ఉల్లిపాయ రసంలో వీటిని కలిపి రాస్తే జుట్టు సమస్యలకు చెక్ పడినట్టే!
ఒక్క ఏడాదిలోనే 12 సినిమాలు.. అప్పట్లోనే పాన్ ఇండియా క్రేజ్..
ఒక్క ఏడాదిలోనే 12 సినిమాలు.. అప్పట్లోనే పాన్ ఇండియా క్రేజ్..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు..
ఎండిన ఈ పండ్లు రోజూ గుప్పెడు తింటే చాలు.. ఆడ, మగ ఇద్దరికీ లాభామే!
ఎండిన ఈ పండ్లు రోజూ గుప్పెడు తింటే చాలు.. ఆడ, మగ ఇద్దరికీ లాభామే!
అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?
అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?
ఐఫోన్ 17 ప్రో కెమెరా ఎలా ఉంటుందో తెలుసా? మునుపటి కంటే రెండింతలు!
ఐఫోన్ 17 ప్రో కెమెరా ఎలా ఉంటుందో తెలుసా? మునుపటి కంటే రెండింతలు!
రూ. 39.25 కోట్లు ఖర్చు చేస్తే కావ్య పాపను నిండా ముంచేసిన ముగ్గురు
రూ. 39.25 కోట్లు ఖర్చు చేస్తే కావ్య పాపను నిండా ముంచేసిన ముగ్గురు