AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sr NTR Idol: ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటాం.. సినీనటి కరాటే కళ్యాణి ఆధ్వర్యంలో ఆందోళన

ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు వ్యతిరేకం కాదని.. అయితే కృష్ణుడు రూపంలో పెట్టడం సరికాదని అంటున్నారు. దీని వెనుక రాజకీయ ప్రయోజనం ఉందని..యాదవ, కమ్మ సామాజిక వర్గాల ఓట్లు కోసమే ఈ రూపంలో ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రారంభిస్తే ఊరుకోమని, దీన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు .

Sr NTR Idol: ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును అడ్డుకుంటాం.. సినీనటి కరాటే కళ్యాణి ఆధ్వర్యంలో ఆందోళన
Actress Karate Kalyani
Basha Shek
|

Updated on: May 12, 2023 | 7:00 AM

Share

ఖమ్మంలో ఏర్పాటు చేయబోయే ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం నెలకొంది. శ్రీ కృష్ణుడు రూపంలో ఉన్న విగ్రహ ఏర్పాటుపై హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి..ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు వ్యతిరేకం కాదని.. అయితే కృష్ణుడు రూపంలో పెట్టడం సరికాదని అంటున్నారు. దీని వెనుక రాజకీయ ప్రయోజనం ఉందని..యాదవ, కమ్మ సామాజిక వర్గాల ఓట్లు కోసమే ఈ రూపంలో ఏర్పాటు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. జూనియర్ ఎన్టీఆర్ ప్రారంభిస్తే ఊరుకోమని, దీన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు . మరోవైపు మే 28న నందముూరి తారకరామారావు వందో జయంతిని రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఘనంగా వేడుకలు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఖమ్మంలోనూ మంత్రి పువ్వాడ ఆధ్వర్యంలో వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అన్న గారి ఖ్యాతిని ప్రతిబింబించేలా 54 అడుగులు విగ్రహాన్ని లకారం చెరువులో ఏర్పాటు చేస్తున్నారు. మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుండగా.. తానా సభ్యులు, కొందరు ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలు ఇందులో తమవంతు సాయం అందిస్తున్నారు. ఇందుకోసం సుమారు నాలుగు కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ విగ్రహం రూపు దిద్దుకుంటోంది. ఈ విగ్రహావిష్కరణలో ముఖ్య అతిథిగా జూనియర్ ఎన్టీఆర్ పాల్గొననున్నారు. ఓవైపు ఏర్పాట్లు వేగంగా జరుగుతుంటే.. మరోవైపు వివాదాలు చుట్టుముడుతున్నాయి. శ్రీ కృష్ణుడు రూపంలో ఉన్న విగ్రహం ఏర్పాటు పై హిందూ, యాదవ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.

తాజాగా సినీనటి కరాటే కళ్యాణి ఆధ్వర్యంలో ఖమ్మం నగర పాలక సంస్థ కార్యాలయం ముందు ఆధ్వర్యంలో హిందూ, యాదవ సంఘాల సభ్యులు ఆందోళన నిర్వహించారు. ఎన్టీఆర్‌కి విగ్రహం పెడితే అందరికీ సంతోషమే.. కానీ కానీ కృష్ణుడు రూపంలో పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. భవిష్యత్ తరాల పిల్లలు ఎన్టీఆర్‌ని శ్రీకృష్ణుడు అనుకునే పరిస్థితి వస్తుందంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీని వెనక రాజకీయ ప్రయోజనం ఉందనే వాదన కూడా తెరపైకి వచ్చింది. యాదవ, కమ్మ సామాజిక వర్గం ఓట్లు కొల్లగొట్టేందుకే ఈ విగ్రహాన్ని పెడుతున్నారని ఆరోపిస్తున్నారు. భగవంతుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ప్రారంభాన్ని మంత్రి పువ్వాడ నిలిపివేయాలనీ.. లేకపోతే అడ్డుకుంటామని హెచ్చరించారు. జూనియర్ ఎన్టీఆర్ ఎలా వస్తాడని..ఆయన కూడా ఆలోచించు కోవాలని కోరారు. మరి ఎన్టీఆర్ విగ్రహంపై వివాదం నెలకొన్న నేపథ్యంలో.. విగ్రహం ఏర్పాటు చేస్తారా..వెనక్కి తగ్గుతారా.. లేదంటే ఆకారంలో మార్పుల చేస్తారా.. చూడాలి మరి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

ఇవి కూడా చదవండి
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
చిన్న పురుగే కానీ.. ప్రాణాలు తీస్తుంది! ఈ లక్షణాలు యమడేంజర్..
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
వైభవ్ సూర్యవంశీ బీభత్సం.! 7 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్
డ్రైవర్‌పై కోపంతో బస్సుకు నిప్పంటించిన క్లీనర్