AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajinikanth-Kapil Dev: దిగ్గజాలు కలిసిన వేళ.. ఒకే ఫ్రేమ్‌లో రజనీకాంత్, కపిల్‌ దేవ్‌.. ఆ సినిమాపై పెరిగిన అంచనాలు

ఒకరేమో క్రికెట్‌లో లెజెండ్‌.. మరొకరేమో సినిమాల్లో సూపర్‌ స్టార్‌. ఆయా రంగాల్లో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ఆ లెజెండ్స్‌ ఇప్పుడూ ఒకే స్క్రీన్‌పై కనిపించి అభిమానులను అలరించనున్నారు. వారెవరో కాదు.. లెజెండరీ క్రికెట‌ర్‌ కపిల్‌ దేవ్‌, సూపర్ స్టార్ రజనీకాత్‌. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న లాల్‌ సలాం సినిమాలో కపిల్‌ దేవ్‌, రజనీకాంత్‌ కలిసి నటించనున్నారు.

Rajinikanth-Kapil Dev: దిగ్గజాలు కలిసిన వేళ.. ఒకే ఫ్రేమ్‌లో రజనీకాంత్, కపిల్‌ దేవ్‌.. ఆ సినిమాపై పెరిగిన అంచనాలు
Rajinikanth Kapil Dev
Basha Shek
|

Updated on: May 19, 2023 | 11:44 AM

Share

ఒకరేమో క్రికెట్‌లో లెజెండ్‌.. మరొకరేమో సినిమాల్లో సూపర్‌ స్టార్‌. ఆయా రంగాల్లో అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకున్న ఆ లెజెండ్స్‌ ఇప్పుడూ ఒకే స్క్రీన్‌పై కనిపించి అభిమానులను అలరించనున్నారు. వారెవరో కాదు.. లెజెండరీ క్రికెట‌ర్‌ కపిల్‌ దేవ్‌, సూపర్ స్టార్ రజనీకాత్‌. లైకా ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతోన్న లాల్‌ సలాం సినిమాలో కపిల్‌ దేవ్‌, రజనీకాంత్‌ కలిసి నటించనున్నారు. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టిస్తోన్న ఈ చిత్రాన్ని రజనీకాంత్ కూతురు ఐశ్వ‌ర్య ర‌జనీకాంత్ డైరెక్ట్ చేస్తున్నారు. రజనీకాంత్ ఇందులో కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండం మెయిన్ హైలైట్‌. రీసెంట్‌గా ముంబై డాన్‌ మొయిద్దీన్ భాయ్‌గా న‌టిస్తోన్న త‌లైవ‌ర్ లుక్‌ను చిత్ర యూనిట్ రివీల్ చేయ‌గా ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. సినిమాపై ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఈ ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను త‌న ట్వీట్‌తో నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లిపోయారు ర‌జనీకాంత్‌. తాజాగా ఆయ‌న త‌న ట్విట్ట‌ర్‌లో 1983లో తొలిసారి ఇండియాకు క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్‌ను సాధించిన పెట్టిన నాటి కెప్టెన్ క‌పిల్ దేవ్‌తో క‌లిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు.. ‘లెజెండ్రీ ప‌ర్స‌న్‌, మ‌నం అంద‌రం ఎంతో గౌర‌వించాల్సిన గొప్ప మ‌నిషి క‌పిల్ దేవ్‌జీతో క‌లిసి ప‌ని చేయ‌టాన్ని గౌర‌వంగా భావిస్తున్నాను. క్రికెట్ వ‌రల్డ్‌క‌ప్‌ను సాధించి మ‌న భార‌త‌దేశం గ‌ర్వ‌ప‌డేలా చేశారాయ‌న‌’ అంటూ కపిల్ దేవ్‌తో వ‌ర్కింగ్ ఎక్స్‌పీరియెన్స్‌ను షేర్ చేసుకున్నారు ర‌జనీకాంత్‌.

న‌ట‌న‌లో లెజెండ్రీ ప‌ర్స‌నాలిటీ క్రికెట్ లెజెండ్‌ను ప్ర‌శంసిస్తూ చేసిన స‌ద‌రు ట్వీట్ హాట్ టాపిక్‌గా మార‌ట‌మే కాదు.. నెట్టింట తెగ వైర‌ల్ అవుతోంది. మ‌రో వైపు క‌పిల్ దేవ్ సైతం ర‌జనీకాంత్‌తో ఉన్న ఫొటోను త‌న ఇన్‌స్టా స్టోరీలో షేర్ చేస్తూ ‘ర‌జనీకాంత్‌గారితో క‌లిసి ప‌ని చేయ‌టం గొప్ప గౌర‌వంగా భావిస్తున్నాను’ అని రాసుకొచ్చారు. కాగా లాల్‌సలాం సినిమా షూటింగ్ శరవేగంగా జరగుతోంది. ఈ సినిమాకు ఏఆర్‌ రెహమాన్‌ స్వరాలు సమకూరుస్తున్నారు. సినిమాటోగ్రాఫర్‌గా విష్ణు రంగస్వామి వ్యవహరిస్తున్నారు. ఎడిటర్‌గా ప్రవీణ్‌ భాస్కర్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
ఇలా చేస్తే.. భలే కరకరలాడుతూ వస్తాయ్..
ఇలా చేస్తే.. భలే కరకరలాడుతూ వస్తాయ్..
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా