Actress: యాక్టింగ్‌లోనే కాదు కర్రసాములోనూ అదరగొడతానంటోన్న స్టార్ హీరోయిన్.. ఎవరో గుర్తుపట్టారా మరి?
అందంతో పాటు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి గంటల కొద్దీ జిమ్‌లో చెమటోడుస్తున్నారు. కఠినమైన వర్కవుట్లు సైతం అవలీలగా చేస్తున్నారు. ఇక కొందరైతే మార్షల్ ఆర్ట్స్‌లోనూ సత్తా చాటుకున్నారు. మగవాళ్లకు దీటుగా కర్రసాము వంటి వాటిని ప్రాక్టీస్ చేస్తున్నారు. ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ కూడా ఈ కోవకే చెందుతుంది.

సినిమాల్లో తమ యాక్టింగ్‌తో అదరగొట్టే హీరోయిన్లు జిమ్‌లోనూ అదరగొడుతున్నారు. అందంతో పాటు ఫిట్‌నెస్‌ను కాపాడుకోవడానికి గంటల కొద్దీ జిమ్‌లో చెమటోడుస్తున్నారు. కఠినమైన వర్కవుట్లు సైతం అవలీలగా చేస్తున్నారు. ఇక కొందరైతే మార్షల్ ఆర్ట్స్‌లోనూ సత్తా చాటుకున్నారు. మగవాళ్లకు దీటుగా కర్రసాము వంటి వాటిని ప్రాక్టీస్ చేస్తున్నారు. పై ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ కూడా ఈ కోవకే చెందుతుంది. ఈమె సౌత్ సినిమా ఇండస్ట్రీలో బాగా ఫేమస్. చేసింది కొన్ని సినిమాలైనా తన అందం, అభినయంతో బాగా క్రేజ్ తెచ్చుకుంది. దుల్కర్ సల్మాన్, విజయ్, ధనుష్, రజనీకాంత్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఇక సోషల్ మీడియాలో ఈ సొగసరికి ఓ రేంజ్‌లో ఫాలోయింగ్ ఉంది. తను షేర్ చేసే ఫొటోలు, వీడియోలకు నెటిజన్ల నుంచి ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తుంటుంది. అలా తాజాగా కర్రసాము ప్రాక్టీస్ చేస్తున్న ఫొటోలను కొన్నింటిని షేర్ చేయగా అవి కాస్తా వైరల్‌గా మారాయి. మరి ఈ ఫొటోలో ఉన్న స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా? కనిపెట్టకపోయినా నో ప్రాబ్లమ్.. సమాధానం మేమే చెబుతాం. ఆమె మరెవరో కాదు మలయాళ కుట్టీ మాళవికా మోహనన్.
కేరళకు చెందిన మాళవిక ప్రస్తుతం తమిళంలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్. రజనీకాంత్ పేట సినిమాతో తెలుగు, తమిళ ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ విజయ్ మాస్టర్ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ధనుష్‌తో చేసిన మారన్ తో సినీ ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇటీవల క్రిస్టీ అనే ఓ ఫీల్ గుడ్ లవ్ స్టోరీతో ప్రేక్షకులను పలకరించిన ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం తంగళన్‌తో పాటు ఓ తమిళ సినిమా ఉంది. సినిమాల సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో మాళవిక షేర్ చేసే హాట్ ఫొటోస్, వీడియోలకు మంచి స్పందన వస్తుంది. అందులో భాగంగానే కర్రసాము చేస్తూ తీసిన కొన్ని ఫొటోలు ఇన్‌స్టాలో షేర్ చేయగా అవి కాస్తా వైరలయ్యాయి.




View this post on Instagram
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..