మేనరికపు పెళ్లిళ్లు చేసుకోవద్దా..!?

×

మేనరికపు పెళ్లిళ్లు చేసుకోవద్దా..!?

గతంలో థలసేమియా వంటి జన్యుపరమైన వ్యాధులకు మేనరికపు వివాహాలు ఒక కారణమని చర్చ జరిగింది. ప్రస్తుత సమాజంలో ఈ రకమైన పెళ్లిళ్లు తగ్గుముఖం పట్టినా, ఇంకా అక్కడక్కడ జరుగుతున్నాయి. ఈ అంశంపై తాజాగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బెంగళూరుకు చెందిన ఒక లా స్టూడెంట్ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. మేనరికపు వివాహాల వల్ల జన్యుపరమైన, ఇతర లోపాలతో కూడిన పిల్లలు పుడుతున్నారని, ఈ వివాహాలను అడ్డుకోవాలని ఆ పిటిషన్‌లో కోరారు. దీనిపై స్పందించిన ముగ్గురు సభ్యుల ధర్మాసనం, ముఖ్యంగా భారత ప్రధాన న్యాయమూర్తి సైతం, ఈ మేనరికపు వివాహాలను అరికట్టాల్సిన ఆవశ్యకత ఉందని అంగీకరించింది. అయితే, ఈ ఆచారాన్ని సంఘ సంస్కరణల చట్టాల ద్వారానే అడ్డుకోవాలని, శాసనాధికారం చట్టసభలకే ఉంటుందని, తాము నేరుగా వివాహాలను నిలిపివేయమని ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. మేనరికపు పెళ్లిళ్లను ఆపాలని కోర్టు ఆదేశించలేకపోయినా, దానిపై ఒక సూచన మాత్రం చేయగలమని పేర్కొంది. కాబట్టి, ఈ విషయంలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంది. ప్రభుత్వాలు ప్రజారోగ్యంపై దృష్టి సారించి, జన్యుపరమైన లోపాల గురించి, మేనరికపు వివాహాల వల్ల కలిగే నష్టాల గురించి అవగాహన పెంచాల్సిన అవసరం ఉందని కోర్టు అభిప్రాయపడింది. ప్రజలు స్వతహాగా ఈ విషయాలపై అవగాహన తెచ్చుకుని, మేనరికపు పెళ్లిళ్లను నివారించాలని సూచించింది.

Phani CH