AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Actress: ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్‌ హీరోయిన్‌.. మంచి సింగర్‌ కూడా..

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా, సింగర్‌గా కెరీర్ కొనసాగిస్తున్న అందాల తారలు చాలామందే ఉన్నారు. మమతా మోహన్‌ దాస్‌, ఛార్మీ, శ్రుతిహాసన్, నిత్యమేనన్‌, ఆండ్రియా, రాశీఖన్నా.. ఇలా ఎంతో మంది హీరోయిన్లు పలు సినిమాల్లో తమ గొంతును అరువిచ్చారు. తమ సింగింగ్‌ ట్యాలెంట్‌తో అభిమానులను మెప్పించారు. పై ఫొటోలోని అమ్మాయి కూడా ఈ కోవకే చెందుతుంది.

Actress: ఈ ఫొటోలోని అమ్మాయిని గుర్తుపట్టారా? ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఫేమస్‌ హీరోయిన్‌.. మంచి సింగర్‌ కూడా..
Actress
Basha Shek
|

Updated on: May 19, 2023 | 11:08 AM

Share

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా, సింగర్‌గా కెరీర్ కొనసాగిస్తున్న అందాల తారలు చాలామందే ఉన్నారు. మమతా మోహన్‌ దాస్‌, ఛార్మీ, శ్రుతిహాసన్, నిత్యమేనన్‌, ఆండ్రియా, రాశీఖన్నా.. ఇలా ఎంతో మంది హీరోయిన్లు పలు సినిమాల్లో తమ గొంతును అరువిచ్చారు. తమ సింగింగ్‌ ట్యాలెంట్‌తో అభిమానులను మెప్పించారు. పై ఫొటోలోని అమ్మాయి కూడా ఈ కోవకే చెందుతుంది. మొదట మ్యూజిక్‌ కంపోజర్‌గా కెరీర్‌ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత హీరోయిన్‌గా స్థిరపడింది. తన అందం, అభినయంతో దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. విజయ్‌ సేతుపతి, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, తెలుగులో నాని తదితర స్టార్‌ హీరోలతో సినిమాలు చేసి మెప్పించింది. ప్రస్తుతం మలయాళ ఇండస్ట్రీలోనే ఎక్కువగా సినిమాలు చేస్తోంది. మరి సింగర్‌ అండ్‌ యాక్టింగ్‌లోఅదరగొడుతోన్న ఈ అందాల తారను గుర్తుపట్టారా? కనిపెట్టకపోయినా నో ప్రాబ్లమ్‌.. సమాధానం మేమే చెబుతాం. ఈమె మరెవరో కాదు మలయాళ ముద్దుగుమ్మ ప్రముఖ హీరోయిన్‌ మడోన్నా సెబాస్టియన్‌. మల్టీ ట్యాలెంటెడ్‌గా బ్యూటీగా పేరు తెచ్చుకున్నమడోన్నా పుట్టిన రోజు నేడు (మే 19) . దీంతో సోషల్‌ మీడియా వేదికగా పలువురు ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు బర్త్‌ డే విషెస్‌ చెబుతున్నారు.

కాగా ప్రేమమ్‌ సినిమాతో అటు మలయాళంలోనూ, ఇటు తెలుగులోనూ మంచి గుర్తింపు తెచ్చుకుంది మడోన్నా. గతేడాది నాని హీరోగా నటించిన శ్యామ్‌ సింగరాయ్ సినిమాలో లాయర్‌గా తనదైన అభినయాన్ని ప్రదర్శించింది. ఇక కొన్ని రోజుల క్రితమే స్ట్రీమింగ్‌కు వచ్చిన యాంగర్‌ టేల్స్‌లోనూ ఓ కీలక పాత్ర పోషించింది. ప్రస్తుతం మలయాళంలో పద్మిని, ఐడెంటిఫై అనే సినిమాల్లో నటిస్తోందీ అందాల తార. అన్నట్లు మడోన్నా మంచి సింగర్‌ కూడా. చిన్నప్పటి నుంచి కర్నాటిక్‌, వెస్ట్రన్‌ సంగీతంపై ఆసక్తి పెంచుకున్న ఆమె ప్లే బ్యాక్‌ సింగర్‌గానూ రాణిస్తోంది. పలు సినిమాల్లోనూ గొంతు సవరించుకున్న ఈ క్రేజీ బ్యూటీ సొంతంగా పలు మ్యూజిక వీడియోలు, ఆల్బమ్‌లు కూడా చేస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
నోట్లో వేస్తే కరిగిపోయేలా డబల్ కా మీఠా.. పక్కా కొలతలతో ఇలా చేయండి
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఒక వ్యక్తి పేరుపై రెండు గ్యాస్ కనెక్షన్లు తీసుకోవచ్చా..?
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
ఈ యాప్స్‌ ఉంటే గూగుల్ మ్యాప్స్ అక్కర్లేదు
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
జబర్దస్త్‌లోకి ఆ స్టార్ కమెడియన్ల రీఎంట్రీ.. రష్మీ ఎమోషనల్
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
రోడ్ సైడ్ బండి మీద అమ్మే చల్ల పునుగులు.. ఇంట్లోనే ఇలా చేసి చూడండి
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
ఆవుతో స్నేహం చేస్తే ఇట్టా ఉంటుందా.. మాంసం మానేసిన కుక్క..
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
సంజూ ఎంట్రీతో బీసీసీఐ పై వచ్చిన వార్తలన్నీ అబద్ధాలేనా
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
కేవలం రూ.50 వేల బడ్జెట్‌తో 7 దేశాల టూర్‌కు వెళ్లొచ్చు! లిస్ట్ ఇదే
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
ఆండ్రాయిడ్ యాప్స్‌ కోసం కొత్త రూల్స్‌ తెచ్చేసిన గూగుల్‌
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?
రాత్రి పండ్లు తింటే నిజంగానే బరువు పెరుగుతారా?