AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RRR Movie : జపనీస్‌ మ్యాగజైన్ పై తారక్ , చరణ్.. ఫుల్ ఖుష్ అవుతోన్న ఫ్యాన్స్

ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో చిత్రయూనిట్ పై ప్రపంచం మొత్తం ప్రశంసలు కురిపించింది. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయి ఇప్పటికీ సంవత్సరం కావొస్తున్నా..

RRR Movie : జపనీస్‌ మ్యాగజైన్ పై తారక్ , చరణ్.. ఫుల్ ఖుష్ అవుతోన్న ఫ్యాన్స్
Ram Charan & Ntr Cover Photo On Japan Magazine Video
Rajeev Rayala
|

Updated on: May 19, 2023 | 12:47 PM

Share

ఆర్ఆర్ఆర్ సినిమా ఎంతటి సంచలాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏకంగా ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది ఈ సినిమా. ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు సాంగ్ కు ఆస్కార్ అవార్డు వచ్చిన విషయం తెలిసిందే. దాంతో చిత్రయూనిట్ పై ప్రపంచం మొత్తం ప్రశంసలు కురిపించింది. ట్రిపుల్ ఆర్ రిలీజ్ అయి ఇప్పటికీ సంవత్సరం కావొస్తున్నా.. ఈ మూవీ బజ్‌ ఇంకా ఆగడం లేదు. అందులోనూ.. జపాన్లో తుఫాన్ క్రియేట్ చేయడం మానుకోవడం లేదు. ఇక ఇప్పటికే అక్కడ సూపర్ డూపర్ కలెక్షన్స్‌తో.. హౌస్‌ ఫుల్ షోలతో దూసుకుపోతున్న మన స్టార్ హీరోలు.. ఇప్పుడు మరో ఘనత సాధించారు.

ట్రిపుల్ ఆర్ సినిమాతో.. అందులోని వారి సూపర్ డూపర్ యాక్టింగ్‌తో.. మాంచి ఫ్యాన్స్ బేస్ పెంచుకున్న మన హీరోలు.. ఇప్పుడు జపాన్ ఫేస్‌గా మారిపోయారు. అక్కడి ఫేమస్‌ అండ్ ప్రెస్టీజియన్‌ లైఫ్ స్టైల్ మ్యాగజైన్‌ అయిన అనన్ మ్యాగజైన్‌లో స్థానం సంపాదించుకున్నారు. వారి లేటెస్ట్ ఎడిషెన్లో కఫర్ ఫోటోలుగా అచ్చయ్యారు.

అయితే మన హీరోలు ఇలా ఓ ఫేమస్‌ జపనీస్‌ మ్యాగజైన్ కెక్కడం ఇప్పుడు జపాన్‌లోనే కాదు.. ఇండియాలోనూ అందర్నీ వావ్ అనేలా చేస్తోంది. చప్పట్లు కొట్టేలా చేస్తోంది.