Virupaksha: ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన సాయి ధరమ్‌ తేజ్‌ వంద కోట్ల సినిమా.. విరూపాక్షను ఎక్కడ చూడొచ్చంటే?

తేజ్‌ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం శనివారం (మే 20) అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది విరూపాక్ష. దీంతో చాలామంది ఫ్యాన్స్‌ ఈ సినిమాను చూస్తూ తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో..

Virupaksha: ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేసిన సాయి ధరమ్‌ తేజ్‌ వంద కోట్ల సినిమా.. విరూపాక్షను ఎక్కడ చూడొచ్చంటే?
థియేటర్లలో రిలీజై ఏకంగా 100 కోట్లకు పైగా కొల్లగొట్టిన ఈ ఇంటెన్స్‌ న్యాచురల్ థ్రిల్లర్‌ ఇప్పుడు ఓటీటీలోనూ దుమ్ము దులుపుతోంది. రికార్డు స్థాయిలో వ్యూస్‌ సొంతం చేసుకుంటోంది.
Follow us
Basha Shek

|

Updated on: May 21, 2023 | 7:24 AM

సుప్రీం హీరో సాయి ధరమ్‌ తేజ్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ మూవీ విరూపాక్ష. రోడ్డు ప్రమాదంలో గాయపడి కోలుకున్న తర్వాత తేజ్‌ చేసిన మొదటి సినిమా ఇదే. సుకుమార్‌ శిష్యుడు కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో లేటెస్ట్ సెన్సేషన్‌ సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించింది. ఇంటెన్స్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ఏప్రిల్‌ 21న థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుంచే పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుంది. బాక్సాఫీస్‌ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. ఇటీవలే రూ.100 కోట్ల క్లబ్‌ లిస్టులో కూడా చేరింది. ఇప్పటికీ కొన్ని చోట్ల థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపిస్తోన్న విరూపాక్ష సినిమా ఓటీటీ రిలీజ్‌ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడీ నిరీక్షణకు తెరపడింది. తేజ్‌ సినిమా డిజిటల్‌ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌ ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం శనివారం (మే 20) అర్ధరాత్రి నుంచే స్ట్రీమింగ్‌కు వచ్చేసింది విరూపాక్ష. దీంతో చాలామంది ఫ్యాన్స్‌ ఈ సినిమాను చూస్తూ తమ అభిప్రాయాలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసుకుంటున్నారు.

విరూపాక్ష సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై బాపినీడు బి.సమర్పణలో ప్రముఖ నిర్మాత బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మించారు. కాంతారా ఫేం అజనీశ్‌ లోక్‌నాథ్‌ స్వరాలు సమకూర్చారు. కాగా విరూపాక్ష సినిమాను హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లోనూ రిలీజ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సునీల్‌, రాజీవ్‌ కనకాల, బ్రహ్మాజీ, రవి కృష్ణ, సోనియా, అభినవ్‌ గోమఠం, కమల్ కామరాజు, సాయి చంద్, అజయ్‌, చత్రఫతి శేఖర్, యాంకర్‌ శ్యామల తదితరలు ప్రధాన పాత్రల్లో నటించారు. మరి థియేటర్లలో విరూపాక్షను మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
ప్రాణం మీదకు తెచ్చిన ఫ్లెక్సీ.. ముగ్గురు మృతి!
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
పొట్టకొవ్వును కరిగించే 3 సాధారణ చిట్కాలు.. బెస్ట్ రిజల్ట్ మీసొంతం
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
మ్యాచ్ ఉందని పిలిస్తే.. ఆడటానికి వెళ్లాడు.. పాపం గ్రౌండ్‌లోనే
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
ఓర్నీ.. నోరూరించే మ్యాంగో.. ఇప్పుడు కూడా అందుబాటులో..
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
చేదు జ్ఞాపకాల సునామీకి 20 ఏళ్లు..!
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
బాక్సింగ్ డే టెస్ట్: కోహ్లీ కమ్ బ్యాక్ ఇన్నింగ్స్ కోసం వెయిటింగ్
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
మెల్‌బోర్న్ టెస్ట్ మ్యాచ్‌లో మారిన టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్?
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
కుంభమేళాకి భారీ ఏర్పాట్లు ఫస్ట్ టైం అండర్‌వాటర్‌ డ్రోన్ల వినియోగం
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
ఈ సీజన్‌లో పండ్లు, కూరగాయలు చేర్చుకోండి శరీరంలో నీటి కొరత ఉండదు
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!
నిత్య పెళ్లి కూతురు ఖతర్నాక్ స్కెచ్.. ఏడో పెళ్లిలో గుట్టురట్టు..!