Jr NTR Birthday: దిల్‌, భద్ర, ఆర్యతో సహా… జూనియర్‌ ఎన్టీఆర్‌ మిస్‌ చేసుకున్న బ్లాక్‌ బస్టర్‌ సినిమాలేంటో తెలుసా?

చాలామంది హీరోల్లానే తారక్‌ కూడా కొన్ని సినిమాలు వదిలేసుకున్నాడు. డేట్స్ కుదరకపోవడం వల్లనో, ఇతరత్రా కారణాలతోనో అతను చేయాల్సిన సినిమాలు కాస్తా వేరే హీరోలు దగ్గరికి వెళ్లిపోయాయి. అందులో చాలా వరకు బ్లాక్ బస్టర్‌ హిట్ సినిమాలే కావడం గమనార్హం.

Jr NTR Birthday: దిల్‌, భద్ర, ఆర్యతో సహా... జూనియర్‌ ఎన్టీఆర్‌ మిస్‌ చేసుకున్న బ్లాక్‌ బస్టర్‌ సినిమాలేంటో తెలుసా?
Jr Ntr Birthday
Follow us
Basha Shek

|

Updated on: May 20, 2023 | 12:33 PM

నూనుగు మీసాల వయసులో సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి రికార్డు సృష్టించాడు జూనియర్‌ ఎన్టీఆర్‌. స్టూడెంట్‌ నెంబర్‌ వన్‌, ఆది, సింహాద్రి వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్ సినిమాలు ఖాతాలో వేసుకుని స్టార్‌ హీరోల లిస్టులో చేరిపోయాడు. మధ్యలో వరుసగా అపజయాలు ఎదురైనా మళ్లీ విజయాల బాట పట్టాడు. మాస్‌ సినిమాలతో పాటు నాన్నకు ప్రేమతో వంటి వైవిధ్యమైన సినిమాలు చేశాడు. తన అభినయంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరే హీరోకు సాధ్యం కాని మాస్‌ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నాడు. ఇటీవలే ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాతో గ్లోబల్‌ స్టార్‌గా వరల్డ్‌ వైడ్‌గా క్రేజ్‌ సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. తారక్‌ కెరీర్‌లో ఇది 30వ సినిమా. కాగా ఇవాళ (మే20) జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు యంగ్‌ టైగర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా చాలామంది హీరోల్లానే తారక్‌ కూడా కొన్ని సినిమాలు వదిలేసుకున్నాడు. డేట్స్ కుదరకపోవడం వల్లనో, ఇతరత్రా కారణాలతోనో అతను చేయాల్సిన సినిమాలు కాస్తా వేరే హీరోలు దగ్గరికి వెళ్లిపోయాయి. అందులో చాలా వరకు బ్లాక్ బస్టర్‌ హిట్ సినిమాలే కావడం గమనార్హం. మరి జూనియర్‌ ఎన్టీఆర్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆయన వదులుకున్న హిట్‌ సినిమాలేంటో తెలుసుకుందాం రండి.

1. నితిన్ హీరోగా మాస్‌ డైరెక్టర్‌ వినాయక్ తెరకెక్కించిన దిల్‌ ఎలాంటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ కథను ముందుగా ఎన్టీఆర్‌కు చెప్పాడట వినాయక్‌. అయితే అప్పటికే వీరి కాంబినేషన్‌లో ఆది వంటి బ్లాక్ బస్టర్‌ సినిమా రావడం, తారక్ కూడా స్టూడెంట్ నెంబర్‌ వన్‌ సినిమా చేయడంతో మరోసారి స్టూడెంట్‌ డ్రామా ఎందుకు? అని వదిలేశాడు.

2. అల్లు అర్జున్‌ ‘ఆర్య’ కథను ముందుగా ఎన్టీఆర్‌కు చెప్పాడట సుకుమార్‌. అయితే తనకు ఈ ప్రేమకథ సరిపోదంటూ ఎన్టీఆర్ నో చెప్పాడట. 3. మాస్‌ డైరెక్టర్‌ బోయపాటి శ్రీను భద్ర కథను ముందు అల్లు అర్జున్, ఆ తర్వాత తారక్‌కు చెప్పాడట. కానీ ఎందుకో నో చెప్పారట. దీంతో వెంటనే అదే కథను రవితేజకు చెప్పి బ్లాక్ బస్టర్‌ హిట్ కొట్టాడు బోయపాటి.

ఇవి కూడా చదవండి

4. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్ హీరోగా చేసిన అతనొక్కడే కథ కూడా ముందుగా ఎన్టీఆర్‌ దగ్గరికే వెళ్లిందట.

5. రవితేజ- వినాయక్‌ కాంబినేషన్‌లో వచ్చిన కృష్ణ కూడా ఎన్టీఆర్‌ చేయాల్సిందేనట. అయితే ఎందుకో కానీ కుదర్లేదట.

6. సురేందర్ రెడ్డి కిక్ కథను ఎన్టీఆర్‌కు వినిపించాడట. అయితే ఎందుకో గానీ ఆయన ఇంట్రెస్ట్‌ చూపలేదట. ఆ తర్వాత అదే కథతో రవితేజతో బ్లాక్‌ బస్టర్‌ హిట్ అయ్యింది.

7. రవితేజ రాజా ది గ్రేట్‌, నాగార్జున- కార్తీల ఊపిరి, మహేశ్‌ శ్రీమంతుడు, బ్రహ్మోత్సవం, అల్లు అర్జున నాపేరు సూర్య సినిమాలు కూడా ముందుగా ఎన్టీఆర్‌ దగ్గరికే వెళ్లాయట. అయితే కొన్ని కారణాలతో ఎన్టీఆర్‌ వీటిని వదులుకున్నారట.

అలా మొత్తానికి చాలా బ్లాక్‌ బస్టర్‌ హిట్ సినిమాలను మిస్‌ చేసుకున్నాడట ఎన్టీఆర్‌. అదే సమయంలో ఇవే సినిమాలు వేరే హీరోల ఫేట్‌ను కూడా మార్చేశాయని చెప్పవచ్చు.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
టమాటా మసాలా కర్రీ.. ఎందులోకైనా అదుర్స్ అంతే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఉపేంద్ర UI బ్యూటీని శ్రీలీలతో పోలుస్తున్న నెటిజన్స్.. ఎందుకంటే..
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ఇంట్లో పనిచేసే వారితో రామ్ చరణ్- ఉపాసన క్రిస్మస్ వేడుకలు.. ఫొటోస్
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
ప్రఖ్యాత రచయిత వాసుదేవన్ నాయర్ కన్నుమూత
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
నితీష్, నవీన్ పట్నాయక్‌కు భారతరత్న.. తెరమీదకు కొత్త డిమాండ్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
శివన్న ఆరోగ్యంపై అప్డేట్ ఇచ్చిన కూతురు.. ఎమోషనల్ పోస్ట్
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
మల్లారెడ్డా మజాకా.. జిమ్‌లో అదరగొట్టిన మాజీ మంత్రి
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
స్మార్ట్ వాచ్‌లు పెట్టుకుంటున్నారా.. ఈ వ్యాధులు రావడం ఖాయం!
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?