- Telugu News Photo Gallery Cinema photos Rishab Shetty visits Kukke Subrahmanya temple And Dharmastala, Photos goes viral
Rishab Shetty: ఆధ్యాత్మిక యాత్రలో రిషబ్ శెట్టి ఫ్యామిలీ.. కుక్కే సుబ్రమణ్య స్వామి ఆశీస్సులు తీసుకున్న కాంతారా హీరో
కాంతారా సినిమా చేశాక రిషబ్ శెట్టికి దేవుడిపై మరింత భక్తి పెరిగింది. తాజాగా దక్షిణ కన్నడ జిల్లా కడబా తాలూకాలోని ప్రముఖ కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాన్ని సందర్శించారు రిషబ్ శెట్టి కుటుంబ సభ్యులు.
Updated on: May 20, 2023 | 1:44 PM

రిషబ్ శెట్టికి ఆధ్యాత్మిక చింతన కాస్త ఎక్కువే. అందుకు తగ్గట్టుగానే తరచూ ప్రముఖ దేవాలయాలు, ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శిస్తుంటాడు .

క కాంతారా సినిమా చేశాక రిషబ్ శెట్టికి దేవుడిపై మరింత భక్తి పెరిగింది. తాజాగా దక్షిణ కన్నడ జిల్లా కడబా తాలూకాలోని ప్రముఖ కుక్కే సుబ్రహ్మణ్య ఆలయాన్ని సందర్శించారు రిషబ్ శెట్టి కుటుంబ సభ్యులు.

అలాగే ధర్మస్థలానికి వెళ్లి పూజారి వీరేంద్ర హెగ్గడేను కలుసుకుని ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా వీరేంద్ర హెగ్గడే, రిషబ్ శెట్టి కాసేపు కూర్చుని మాట్లాడుకున్నారు.

రిషబ్‌తో పాటు ఆయన భార్య ప్రగతి, పిల్లలు కూడా ఈ ఆధ్యాత్మిక యాత్రలో ఉన్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు రిషబ్. దీంతో అవి కాస్తా వైరల్‌గా మారాయి.

ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం కాంతారా 2కు సీక్వెల్ తీసే యోచనలో ఉన్నాడు రిషబ్ శెట్టి. దీని కోసం పలు ప్రాంతాలు తిరుగుతూ రీసెర్చ్ చేస్తున్నారు.




