Sowmya Rao: ‘అమ్మా.. నా కోసం మళ్లీ పుట్టవా’.. కన్నీళ్లు పెట్టిస్తోన్న’జబర్దస్త్’ యాంకర్ సౌమ్య ఎమోషనల్ వీడియో

స్మాల్‌ స్క్రీన్‌పై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సౌమ్య జీవితంలో ఎన్నో కన్నీటి కష్టాలున్నాయి. మరి ముఖ్యంగా ఆమె తల్లి ఎంతటి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు. సౌమ్య తల్లి క్యాన్సర్‌తో పోరాడి మృతి చెందింది. తాజాగా మదర్స్‌ డే సందర్భంగా తల్లిని తల్చుకుని ఎమోషనలైంది సౌమ్య.

Sowmya Rao: 'అమ్మా.. నా కోసం మళ్లీ పుట్టవా'.. కన్నీళ్లు పెట్టిస్తోన్న'జబర్దస్త్' యాంకర్ సౌమ్య ఎమోషనల్ వీడియో
Anchor Sowmya Rao
Follow us
Basha Shek

|

Updated on: May 21, 2023 | 12:12 PM

సౌమ్యారావు.. కర్ణాటకకు చెందిన ఈ అందాల తార శ్రీమంతుడు సినిమాతో టాలీవుడ్‌ బుల్లితెరకు పరిచయమైంది. తన అందం, అభినయంతో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. అయితే సడెన్‌గా అనుకోకుండా జబర్దస్త్‌ యాంకర్‌గా కామెడీ షోలోకి అడుగుపెట్టింది. షోలో చలాకీగా ఉంటే సౌమ్య కంటెస్టెంట్ల మీద అదిరిపోయే పంచులు వేస్తూ అందరినీ ఆకట్టుకుంది. అయితే స్మాల్‌ స్క్రీన్‌పై ఎప్పుడూ నవ్వుతూ కనిపించే సౌమ్య జీవితంలో ఎన్నో కన్నీటి కష్టాలున్నాయి. మరి ముఖ్యంగా ఆమె తల్లి ఎంతటి తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొందో తెలిస్తే కన్నీళ్లు ఆగవు. సౌమ్య తల్లి క్యాన్సర్‌తో పోరాడి మృతి చెందింది. తాజాగా మదర్స్‌ డే సందర్భంగా తల్లిని తల్చుకుని ఎమోషనలైంది సౌమ్య. చివరి రోజుల్లో తన తల్లి ఎదుర్కొ‍న్న నరకం గురించి వర్ణిస్తూ.. అలాంటి పరిస్థితి మరే తల్లికి రాకూడంటూ కన్నీటి పర్యంతమైంది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు జబర్దస్త్ యాంకర్‌కు ధైర్యం చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

దేవుడు నాపై దయ చూపలేదు..

‘అమ్మ, అంబులెన్స్, డాక్టర్లు, ట్రీట్‌మెంట్, మందులు, బాధ. అమ్మంటే ఒక బాధాకరమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. అమ్మ కోసం దేవుడి గుడికి వెళ్లి ఎన్నో పూజలు చేశాను. ఉపవాసాలు ఉన్నాను. అయినా దేవుడు నీ మీద, నా మీద దయ చూపలేదు. దేవుడు ఎందుకు ఇలా చేశాడు అని చాలా బాధపడుతున్నాను. అందరూ అమ్మ ఫొటో షేర్ చేస్తూ మదర్స్ డే శుభాకాంక్షలు చెప్తుంటే, నాకు మాత్రం ఆఖరి రోజుల్లో నువ్వు పడిన బాధలే జ్ఞాపకం వస్తున్నాయి. రాత్రి పగలు నీకు సేవ చేసినా, దేవుడికి పూజలు చేసినా, అన్నీ వృథాగా మిగిలిపోయాయి. నువ్వు లేకుండా నా జీవితం అసంపూర్ణంగానే మిగిలింది. ప్రతి రోజు, ప్రతి క్షణం నిన్ను మిస్ అవుతున్నాను. అమ్మా, నువ్వు నా కోసం మళ్లీ పుడతానని వేయికళ్లతో ఎదురు చూస్తున్నాను. దేవుడా! మళ్లీ మా అమ్మానాన్నలను నాకు ఇవ్వు. హ్యాపీ మదర్స్ డే అమ్మా! నిన్ను ఎప్పుడూ మిస్‌ అవుతుంటారు. లవ్యూ సో…మచ్‌’ అంటూ అమ్మపై తనకున్న ప్రేమకు అక్షర రూపమిచ్చింది సౌమ్య.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by Sowmya Rao (@sowmya.sharada)

View this post on Instagram

A post shared by Sowmya Rao (@sowmya.sharada)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.