Rana Daggubati: రానాకు కల్లు దావత్‌ ఇచ్చిన గంగవ్వ.. తాగి ‘పరేషాన్‌’ చేసిన దగ్గుబాటి హీరో.. వీడియో వైరల్‌

తెలంగాణ యాస, భాషలో మాట్లాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంది గంగవ్వ. మై విలేజ్‌ షో అనే యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా అందరికీ పరిచయమైన ఆమె బిగ్‌ బాస్‌ 4లోనూ సందడి చేశారు. హౌస్‌లో ఉన్నది కొన్ని రోజులే అయినా తన మాట తీరుతో బుల్లితెర ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. ఇదే క్రేజ్‌తో సినిమాల్లో వరుసగా అవకాశాలు సొంతం చేసుకున్నారు.

Rana Daggubati: రానాకు కల్లు దావత్‌ ఇచ్చిన గంగవ్వ.. తాగి 'పరేషాన్‌' చేసిన దగ్గుబాటి హీరో.. వీడియో వైరల్‌
Daggubati Rana
Follow us
Basha Shek

|

Updated on: May 21, 2023 | 1:47 PM

తెలంగాణ యాస, భాషలో మాట్లాడుతూ మంచి గుర్తింపు తెచ్చుకుంది గంగవ్వ. మై విలేజ్‌ షో అనే యూట్యూబ్‌ ఛానెల్‌ ద్వారా అందరికీ పరిచయమైన ఆమె బిగ్‌ బాస్‌ 4లోనూ సందడి చేశారు. హౌస్‌లో ఉన్నది కొన్ని రోజులే అయినా తన మాట తీరుతో బుల్లితెర ప్రేక్షకుల అభిమానం చూరగొన్నారు. ఇదే క్రేజ్‌తో సినిమాల్లో వరుసగా అవకాశాలు సొంతం చేసుకున్నారు. మల్లేశం, ఇస్మార్ట్‌ శంకర్‌, ఎస్‌ ఆర్‌ కల్యాణ మండపం, రాజ రాజ చోర, లవ్‌ స్టోరీ, గాడ్‌ ఫాదర్‌ వంటి సినిమాల్లో నటించి మెప్పించారు గంగవ్వ. మరోవైపు బుల్లితెర టీవీ షోల్లోనూ పాల్గొంటున్నారు. అయితే ఎన్ని సినిమాలు, టీవీ షోలున్నా తనకు బోలెడు క్రేజ్‌ తెచ్చి పెట్టిన మై విలేజ్‌ షోలోనూ తెగ సందడి చేస్తున్నారు గంగవ్వ. పలువురు సినీ ప్రముఖులు కూడా ఈ షోలో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఓ సినిమా ప్రమోషన్స్‌ కోసం గంగవ్వ విలేజ్‌కు వెళ్లాడు దగ్గుబాటి రానా. తాను నిర్మాతగా వ్యవహరిస్తోన్న పరేషాన్‌ ప్రమోషన్స్‌లో భాగంగా గంగవ్వను కలిశాడీ హీరో. ఈ సందర్భంగా తన టీమ్‌తో కలిసి గంగవ్వ ఉండే ఊరికి వెళ్లాడు. అక్కడ పల్లెటూరు వాతావరణంలోకి అడుగుపెట్టిన రానాకు తాటికల్లు ఇచ్చారు గంగవ్వ. ఈ సందర్భంగా తాటి కల్లు తాగి రానా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరలవుతున్నాయి.

దీనికి సంబంధించిన వీడియోను ‘రానా తో కల్లు దావత్‌ ‘ అనే క్యాప్షన్‌తో మై విలేజ్‌ షో యూట్యూబ్‌ ఛానెల్‌లో షేర్‌ చేయగా అది కాస్తా వైరలవుతోంది. కాగా పరేషాన్‌ సినిమా జూన్‌ 2 విడుదల కానుంది. పలాస, టక్‌ జగదీష్‌, మసూద సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్‌ ఇందులో హీరోగా నటిస్తున్నాడు. సంపూర్ణేష్‌ బాబుతో కొబ్బరి మట్ట వంటి కామెడీ చిత్రాన్ని తీసి కడుపుబ్బా నవ్వించిన రూపక్‌ రోనాల్డ్‌సన్‌ పరేషాన్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. పావని హీరోయిన్‌గా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..