Samantha: ‘అరె.. అచ్చం సమంతలా ఉందే’.. నెట్టింట వైరలవుతోన్న టాలీవుడ్ యంగ్‌ హీరోయిన్‌ ఫొటోస్‌

ఇప్పటికే ఐశ్వర్యారాయ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, కత్రినా కైఫ్‌, దీపికా పదుకొణె, అలియా భట్‌, ఇషా గుప్తా, దిశా పటానీ, ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ వంటి స్టార్‌ హీరోయిన్ల డోపెల్‌ గ్యాంగర్లను వెతికి మరీ పట్టుకున్నారు నెటిజన్స్‌. ఇక టాలీవుడ్‌ విషయానికొస్తే.. కోలీవుడ్‌ హీరోయిన్‌ ఆత్మిక చూడడానికి అచ్చం సమంతలా ఉంటుంది.

Samantha: 'అరె.. అచ్చం సమంతలా ఉందే'.. నెట్టింట వైరలవుతోన్న టాలీవుడ్ యంగ్‌ హీరోయిన్‌ ఫొటోస్‌
Actress Gouri Priya Reddy
Follow us
Basha Shek

|

Updated on: May 21, 2023 | 1:15 PM

ఈ ప్రపంచంలో మనుషులను పోలిన మనుషులు ఏడుగురు ఉంటారని పెద్దలు చెబుతుంటారు. వాళ్లు చెప్పినట్లు ఏడుగురు కాకపోయినా ఒకరు లేదా ఇద్దరైనా ఉంటారు. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో హీరోలు, హీరోయిన్లను పోలిన నటీనటులు తరచూ కనిపిస్తుంటారు. వీరిని డోపెల్‌ గ్యాంగర్స్‌ అని కూడా పిలుస్తుంటారు. అలా ఇప్పటికే ఐశ్వర్యారాయ్‌, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌, కత్రినా కైఫ్‌, దీపికా పదుకొణె, అలియా భట్‌, ఇషా గుప్తా, దిశా పటానీ, ప్రియాంకా చోప్రా, అనుష్కా శర్మ వంటి స్టార్‌ హీరోయిన్ల డోపెల్‌ గ్యాంగర్లను వెతికి మరీ పట్టుకున్నారు నెటిజన్స్‌. ఇక టాలీవుడ్‌ విషయానికొస్తే.. కోలీవుడ్‌ హీరోయిన్‌ ఆత్మిక చూడడానికి అచ్చం సమంతలా ఉంటుంది. అలాగే బిగ్‌ బాస్‌ బ్యూటీ అషూరెడ్డికి కూడా జూనియర్‌ సమంత అని పేరుంది. ఇప్పుడు ఈ జాబితాలో మరో యవ నటి చేరింది. ఆమె ఫొటోలను చూసిన నెటిజన్లు ‘అరె.. అచ్చం సమంతలా ఉందే’ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ఆ హీరోయిన్‌ ఎవరంటే.. ప్రియ దర్శి ‘మెయిల్‌’ సినిమా ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న గౌరి ప్రియా రెడ్డి.

లవ్‌ స్టోరీ, శ్రీకారం సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించిన గౌరి ప్రియ ఇటీవలే సుహాస్‌ ‘రైటర్‌ పద్మ భూషణ్‌’ సినిమాలోనూ నటించి మెప్పించింది. ప్రస్తుతం తెలుగుతో పాటు తమిళంలోనూ సినిమా ఛాన్స్‌లు దక్కించుకుంటోందీ అందాల తార. ఇందులో భాగంగా గౌరి ప్రియకు సంబంధించిన కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు ‘అరె.. అచ్చం మన సమంతలా ఉందే’అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఫ్యామిలీ మ్యాన్‌ వెబ్‌ సిరీస్‌లో రాజీలా ఉందే అంటున్నారు. కాగా, గౌరి ప్రియ నటించిన ‘మోడ్రన్‌ లవ్‌ చెన్నై’ ఇటీవలే అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలైంది. మే 18నుంచి స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సిరీస్‌కు మంచి స్పందన వస్తోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..