AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sarath Babu: సీనియర్‌ నటుడు శరత్‌ బాబు కన్నుమూత.. షాక్‌లో సినిమా ఇండస్ట్రీ

టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్‌ నటుడు శరత్‌ బాబు (71) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన సోమవారం తుది శ్వాస విడిచారు. వయసు సంబంధిత సమస్యలకు తోడు శరీరం మొత్తం సెప్సిస్‌ కావడంతో ఊపిరితిత్తులు, కాలెయం, కిడ్నీలు వంటి ప్రధాన అవయావాలు పాడైపోయాయి.

Sarath Babu: సీనియర్‌ నటుడు శరత్‌ బాబు కన్నుమూత.. షాక్‌లో సినిమా ఇండస్ట్రీ
Sarath Babu
Basha Shek
|

Updated on: May 22, 2023 | 2:50 PM

Share

టాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సీనియర్‌ నటుడు శరత్‌ బాబు (71) కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆయన సోమవారం   (మే22) 2 గంటలకు  తుది శ్వాస విడిచారు. వయసు సంబంధిత సమస్యలకు తోడు శరీరం మొత్తం సెప్సిస్‌ కావడంతో ఊపిరితిత్తులు, కాలెయం, కిడ్నీలు వంటి ప్రధాన అవయావాలు పాడైపోయాయి. గత కొన్ని నెలలుగా చెన్నైలోనే ట్రీట్‌మెంట్‌ తీసుకున్న ఆయన వైద్యుల సూచనతో కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ ఏఐజీ ఆస్పత్రికి మార్చారు. వైద్యుల నిరంతర పర్యవేక్షణలో వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తూ వచ్చారు. అయినా ఆయన కోలుకోలేకపోయారు. సుమారు నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆయన సోమవారం మధ్యాహ్నం కన్నుమూశారు. శరత్‌బాబు మరణ వార్తతో టాలీవుడ్‌లో విషాదం నెలకొంది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు.  కాగా శరత్ బాబు పార్థీవ దేహాన్ని చెన్నైకి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు.

250 కు పైగా సినిమాల్లో..

శరత్ కుమార్ శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస లో జన్మించారు. ఆయన అసలు పేరు సత్యం బాబు దీక్షితులు. 1973లో విడుదలైన ‘రామరాజ్యం’ సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు శరత్ బాబు. తమిళ, తెలుగు, కన్నడ భాషల్లో సుమారు 250కి పైగా సినిమాలలో నటించారు. లెజెండరీ డైరెక్టర్ కే బాలచందర్ తెరకెక్కించిన గుప్పెడు మనసు మూవీతో శరత్ బాబు వెలుగులోకి వచ్చారు. హీరోగానే కాకుండా, విలన్‌గా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా పలు పాత్రలతో అలరించారు. చివరిగా పవన్‌ కల్యాణ్‌ వకీల్‌సాబ్‌ సినిమాలో కనిపించారు.  సినిమాల్లో నటిస్తూనే బుల్లితెరపైనా మంచి పాత్రలు పోషించారాయన. ఈటీవీ అంతరంగాలు, జనని, అగ్నిగుండాలు సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నారు.

నిలవని దాంపత్య బంధం..

శరత్ బాబు 1974లో ప్రముఖ లేడీ కమెడియన్ రమాప్రభను వివాహం చేసుకున్నారు.  అయితే ఈ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. 1988లో విబేధాలతో ఆమెతో విడిపోయారు. అనంతరం 1990లో స్నేహ నంబియార్ అనే మహిళను వివాహం చేసుకున్నారు శరత్ బాబు. ఆమెతో కూడా బంధం సవ్యంగా సాగలేదు. 2011లో విడాకులు తీసకొని విడిపోయారు. అప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.