AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bro Movie: పవన్ కళ్యాణ్ ‘బ్రో’ మూవీ నుంచి సాయి తేజ్ లుక్ రిలీజ్..

'బ్రో' చిత్రంలో మార్క్ అలియాస్ మార్కండేయులు అనే పాత్రలో కనువిందు చేయనున్నారు సాయి ధరమ్ తేజ్. ఈరోజు సాయంత్రం మార్క్ పాత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. తెల్ల దుస్తులు ధరించి ఫస్ట్ లుక్ లో ఎంతో అందంగా కనిపిస్తున్నారు సాయి తేజ్.

Bro Movie: పవన్ కళ్యాణ్ 'బ్రో' మూవీ నుంచి సాయి తేజ్ లుక్ రిలీజ్..
Bro Movie
Rajitha Chanti
|

Updated on: May 23, 2023 | 5:45 PM

Share

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మొదటిసారి కలిసి నటిస్తున్న చిత్రం ‘బ్రో’. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్ తో కలిసి టి.జి. విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. అభిమానులతో పాటు ప్రేక్షకుల్లోనూ ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ఆ అంచనాలను రెట్టింపు చేశాయి. ఇక తాజాగా ఈ చిత్రం నుంచి సాయి ధరమ్ తేజ్ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని విడుదల చేసింది చిత్ర బృందం.

‘బ్రో’ చిత్రంలో మార్క్ అలియాస్ మార్కండేయులు అనే పాత్రలో కనువిందు చేయనున్నారు సాయి ధరమ్ తేజ్. ఈరోజు సాయంత్రం మార్క్ పాత్ర ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేశారు. తెల్ల దుస్తులు ధరించి ఫస్ట్ లుక్ లో ఎంతో అందంగా కనిపిస్తున్నారు సాయి తేజ్. మోషన్ పోస్టర్ లో గడియారాన్ని చూపిస్తూ మార్కండేయులుగా సాయి తేజ్ పాత్రను పరిచయం చేసిన తీరు ఆకట్టుకుంటోంది. బ్యాక్ గ్రౌండ్ లో “బ్రోదిన జన్మలేషం.. బ్రోవగ ధర్మశేషం.. బ్రోచిన కర్మహాసం.. బ్రోదర చిద్విలాసం” అనే శ్లోకం వినిపిస్తుండగా శాంతికి చిహ్నంలా తెల్ల దుస్తుల్లో సాయి తేజ పాత్రను పరిచయం చేయడం మెప్పిస్తోంది.

ఇవి కూడా చదవండి

మే 18న ‘బ్రో’ టైటిల్ ని ప్రకటిస్తూ పవన్ కళ్యాణ్ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేయగా అద్భుతమైన స్పందన లభించింది. “కాలః త్రిగుణ సంశ్లేశం.. కాలః గమన సంకాశం.. కాలః వర్జయేత్ చారణం.. కాలః జన్మనాజాయతే జయం స్వయం శ్రియం ద్వయం.. బ్రో బ్రోదిన జన్మలేషం.. బ్రో బ్రోవగ ధర్మశేషం.. బ్రో బ్రోచిన కర్మహాసం.. బ్రో బ్రోదర చిద్విలాసం” అనే శ్లోకంతో పవన్ కళ్యాణ్ పాత్రను పరిచయం చేసిన తీరు కట్టిపడేసింది. విడుదలైన కొద్ది గంటల్లోనే ఈ మోషన్ పోస్టర్ అత్యధిక వీక్షణలతో సోషల్ మీడియాలో సంచలన రికార్డులు సృష్టించింది. ‘బ్రో’ సినిమా 2023, జులై 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలన్నీ త్వరగా పూర్తి చేసి.. ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచే అద్భుతమైన చిత్రాన్ని అందించాలని చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
బిగ్ బాస్ హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి
బిగ్ బాస్ హౌస్ గురించి షాకింగ్ విషయాలు బయటపెట్టిన యాంకర్ రవి
ప్రధాన గ్రహాల అనుకూలత..ఇక ఆ రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్టే..!
ప్రధాన గ్రహాల అనుకూలత..ఇక ఆ రాశులకు గోల్డెన్ టైమ్ మొదలైనట్టే..!
సబ్బు ముక్కలను చెత్తలో వేస్తున్నారా?.. వీటి బెనిఫిట్స్ తెలుసా?
సబ్బు ముక్కలను చెత్తలో వేస్తున్నారా?.. వీటి బెనిఫిట్స్ తెలుసా?
ఈ తేదీల్లో పుట్టినవారి ఇగో చాలా ఎక్కువ… మీరు కూడా వీరిలో ఉన్నారా?
ఈ తేదీల్లో పుట్టినవారి ఇగో చాలా ఎక్కువ… మీరు కూడా వీరిలో ఉన్నారా?
జిమ్ అక్కర్లేదు..ఇంట్లోనే ఈ 5 వ్యాయామాలు చేయండి! ఆర్మ్ ఫ్యాట్
జిమ్ అక్కర్లేదు..ఇంట్లోనే ఈ 5 వ్యాయామాలు చేయండి! ఆర్మ్ ఫ్యాట్
త్రివిక్రమ్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ సినిమాలు చేయరా
త్రివిక్రమ్ సంచలన నిర్ణయం.. ఇకపై ఆ సినిమాలు చేయరా
సరికొత్త గజకేసరి యోగం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి..!
సరికొత్త గజకేసరి యోగం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధన ప్రాప్తి..!
ఆధార్ కార్డు ఉంటే అకౌంట్లోకి రూ.50 వేలు.. అందరికీ..
ఆధార్ కార్డు ఉంటే అకౌంట్లోకి రూ.50 వేలు.. అందరికీ..
పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??
పార్ట్ 3 పై కన్‌ఫ్యూజన్‌.. ఎందుకు ఆగుతున్నట్టు ??
అరటి తొక్కతో ఈ రెసిపీలు చేస్తే నోట్లో నీళ్లూరడం ఖాయం.. !
అరటి తొక్కతో ఈ రెసిపీలు చేస్తే నోట్లో నీళ్లూరడం ఖాయం.. !