Dimple Hayathi: ‘ఓపికతో వెయిట్ చేయండి.. త్వరలోనే నిజాలు తెలుస్తాయి’.. డింపుల్ హయాతి మరొక ట్వీట్..
తాజాగా మరోసారి ఈ గొడవపై స్పందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనకెంతో అండగా నిలుస్తోన్న అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. "ప్రస్తుతం జరుగుతోన్న వ్యవహారంలో అభిమానులు నాపై చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞురాలిని. నాకు అండగా నిలుస్తోన్న వారికి ధన్యవాదాలు. ఈ వివాదంపై ఇంత వరకు ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదు. ఈ వ్యవహారం మా లీగల్ టీమ్ చూసుకుంటోంది. కొంత ఓపిక పట్టండి పూర్తి వివరాలు వెళ్లడిస్తాము " అంటూ ట్వీట్ చేసింది డింపుల్.
టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయాతిపై జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన సంగతి తెలిసిందే. డీసీపీ రాహుల్ హెగ్డేతో పార్కింగ్ ప్లేస్లో నెలకొన్న వివాదం పై వరసగా ట్వీట్స్ చేస్తున్నారు డింపుల్. తాజాగా మరోసారి ఈ గొడవపై స్పందించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తనకెంతో అండగా నిలుస్తోన్న అభిమానులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. “ప్రస్తుతం జరుగుతోన్న వ్యవహారంలో అభిమానులు నాపై చూపిస్తోన్న ప్రేమకు కృతజ్ఞురాలిని. నాకు అండగా నిలుస్తోన్న వారికి ధన్యవాదాలు. ఈ వివాదంపై ఇంత వరకు ఎలాంటి స్టేట్మెంట్లు ఇవ్వలేదు. ఈ వ్యవహారం మా లీగల్ టీమ్ చూసుకుంటోంది. కొంత ఓపిక పట్టండి పూర్తి వివరాలు వెళ్లడిస్తాము ” అంటూ ట్వీట్ చేసింది డింపుల్.
అయితే డింపుల్ పై తప్పుడు కేసు పెట్టారని.. రోడ్డు మీద ఉండాల్సిన సిమెంట్ బ్రిక్స్ అపార్ట్ మెంట్ లోకి ఎలా వచ్చాయని.. ఇదే విషయాన్ని రెండు నెలలుగా అడుగుతున్నామని.. డింపుల్ తో డీసీపీ చాలాసార్లు అమర్యాదగా మాట్లాడారని.. ఆమె పార్కింగ్ స్థలంలోనే కోన్స్ పెట్టారని అన్నారు డింపుల్ తరపు న్యాయవాది. ఎన్నిసార్లు చెప్పినా వినకపోవడంతో ఆమె అసహనానికి గురయ్యారని.. అందుకే ఆ కోన్స్ ను కాలితో తన్నారని.. ఆ సమయంలో డీసీపీపై కేసు పెడతానని డింపుల్ అన్నారని.. అందుకే ఆమెపై తిరిగి కేసు పెట్టారని.. ఆమెను డీసీపీ వేధించాలనుకుంటున్నారని.. ఆయన తన క్వార్టర్స్ లో ఉండకుండా ఈ అపార్ట్ మెంట్ లో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు డింపుల్ తరఫు న్యాయవాది పాల్ సత్యనారాయణ.
ప్రభుత్వ ఆస్తులను దుర్వినియోగం చేస్తున్నారని.. నిన్న ఆయనపై ఫిర్యాదు చేయడానికి డింపుల్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు వెళ్తే.. అక్కడ ఎవరూ ఫిర్యాదు స్వీకరించలేదని.. మూడు గంటలపాటు అక్కడే కూర్చొబెట్టారని.. దీనిపై న్యాయపరంగా పోరాటం చేస్తామని అన్నారు పాల్ సత్యనారాయణ.
Yours lovingly , pic.twitter.com/JWVc3SBVoP
— Dimple Hayathi (@DimpleHayathi) May 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.