Chiranjeevi: ఆ దేవుడే చిరంజీవి రూపంలో వచ్చి నన్ను బతికించాడు.. మెగాస్టార్‌ సాయంపై పొన్నాంబలం ఎమోషనల్‌

సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ కష్టమొచ్చినా 'నేనున్నా' అంటూ ఆదుకోవడంలో ముందుంటారు మెగాస్టార్‌ చిరంజీవి. ఇప్పటికే ఐ బ్యాంక్‌, బ్లడ్‌ బ్యాంక్‌ అంటూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారాయ. ఇక కరోనా కాలంలో ఆక్సిజన్‌ బ్యాంకును కూడా ఏర్పాటుచేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు.

Chiranjeevi: ఆ దేవుడే చిరంజీవి రూపంలో వచ్చి నన్ను బతికించాడు.. మెగాస్టార్‌ సాయంపై  పొన్నాంబలం ఎమోషనల్‌
Ponnambalam, Chiranjeevi
Follow us

|

Updated on: May 23, 2023 | 5:01 PM

సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ కష్టమొచ్చినా ‘నేనున్నా’ అంటూ ఆదుకోవడంలో ముందుంటారు మెగాస్టార్‌ చిరంజీవి. ఇప్పటికే ఐ బ్యాంక్‌, బ్లడ్‌ బ్యాంక్‌ అంటూ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారాయ. ఇక కరోనా కాలంలో ఆక్సిజన్‌ బ్యాంకును కూడా ఏర్పాటుచేసి తన విశాల హృదయాన్ని చాటుకున్నారు. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. అయితే కుడి చేత్తో చేసిన సాయం ఎడమ చేతికి తెలియకూడదనుకుంటారు చిరంజీవి. అందుకే చేసిన సాయాన్ని బయటకు చెప్పరు. అయితే అప్పుడప్పుడు చిరంజీవి సాయం తీసుకున్న వారు మాత్రం బయటకు చెబుతుంటారు. అలా మెగాస్టార్‌ చిరంజీవి సాయం పొందిన వారిలో ప్రముఖ విలన్ పొన్నాంబలం ఒకరు. 80,90లో తెలుగు, తమిళ్‌ సినిమాల్లో ప్రతినాయకుడిగా ఓ వెలుగు వెలిగారాయన. కన్నడ, మలయాళంలోనూ పలు హిట్ చిత్రాల్లో విలన్ పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక తెలుగులో ఎక్కువగా చిరంజీవి సినిమాల్లో పొన్నాంబలం కనిపించారు. ఘరానామొగుడు, మెకానిక్‌ అల్లుడు, ముగ్గురు మొనగాళ్లు, హిట్లర్‌ తదితర హిట్‌ సినిమాల్లో విలన్‌ వేషాలు వేసిన ఆయన బాలకృష్ణ, రాజశేఖర్‌, పవన్‌ సినిమాల్లోనూ నటించి మెప్పించారు. ఒకకప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్న పొన్నాంబలం ఆ తర్వాత ఎందుకో ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇదే క్రమంలో గతేడాది ఆయన తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారు. ఆయన రెండు కిడ్నీలు పూర్తిగా పాడవ్వడంతో ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.

2 లేదా 3 లక్షలు ఇస్తారనుకున్నా…

చికిత్స తీసుకుంటున్న సమయంలో మెగాస్టార్‌ చిరంజీవి రూ. 40 లక్షల ఆర్థిక సహాయం చేశారంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు పొన్నాంబలం. తాజాగా మరోసారి ఈ విషయంపై మాట్లాడిన ఆయన చిరంజీవి చేసిన సాయాన్ని ఎప్పటికీ మరవలేనన్నారు. ‘నేను ను కిడ్నీ సంబంధిత సమస్యలతో ఆస్పత్రిలో చేరినప్పుడు కోలీవుడ్‌ ఇండస్ట్రీకి చెందిన కొందరు డయాలసిస్‌ ట్రీట్మెంట్‌ కోసం మాత్రమే సాయం చేశారు. అయితే చికిత్సకు డబ్బులు సరిపోకపోవడంతో చాలా ఇబ్బంది పడ్డాను. అలా ఓ రోజు నా అల్లుడు నన్ను అంజనేయ స్వామి ఆలయానికి తీసుకెళ్లాడు. అక్కడ పూజ అనంతరం పూజారి చిరంజీవ, చిరంజీవ అన్నారు. ఆ సమయంలోనే నాకు చిరంజీవి పేరు గుర్తుకు వచ్చింది. ఆయనను అడిగితే ఓ 2 లేదా 3 లక్షల వరకు సాయం చేస్తానుకున్నాను. స్నేహితుడి ద్వారా చిరంజీవి నంబర్‌ తీసుకుని కాల్‌ చేశాను. ఆయన వెంటనే స్పందించారు. 2-3 లక్షలు ఇస్తారనుకుంటే ఏకంగా రూ. 40 లక్షలు సాయం చేశారు. మెగాస్టార్‌ చేసిన సాయాన్ని ఈ జీవితంలో మర్చిపోలేను. ఆ దేవుడే చిరంజీవి రూపంలో వచ్చి నన్ను బతికించాడు ‘ అని చెప్పుకొచ్చారు పొన్నాంబలం. కాగా చిరంజీవి గురించి స్టార్‌ విలన్‌ చేసిన వ్యాఖ్యలు బాగా వైరలవుతున్నాయి. ఈ విషయం గురించి తెలుసుకున్న నెటిజన్లు ‘ దటీజ్‌ మెగాస్టార్‌ ‘అన్నయ్యా.. నువ్వు గ్రేట్‌’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
జగన్ యాత్రకు జనం నీరాజనం.. మూడో రోజు బస్సు యాత్ర దృశ్యాలు
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
తాప్సీ.. ఆఫ్టర్ వెడ్డింగ్ కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతుందా ??
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
ఏప్రిల్‌లో సగం రోజులు బ్యాంకులు క్లోజ్‌.. ఏయే రోజుల్లో అంటే..
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
రెడ్ రైస్ తింటే.. ఊహించనన్ని హెల్త్ బెనిఫిట్స్!
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రగ్యా జైస్వాల్‌..
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
కర్నూలు జిల్లాలో ప్రజాగళం యాత్ర.. వాలంటీర్లకు చంద్రబాబు కీలక హామీ
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్‌కు చెక్ పెట్టాలా.. ఈ పండు తింటే చాలు.
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు