OTT Movies: ఓటీటీ లవర్స్‌కు పండగే.. ఈ వారం స్ట్రీమింగ్‌కు రానున్న సూపర్‌ హిట్ మూవీస్‌.. ఫుల్‌ లిస్ట్‌ ఇదుగో

ఈ వారం కూడా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో బోలెడన్నీ సినిమాలు/సిరీస్‌లు రిలీజ్‌ కానున్నాయి. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఈ వీక్‌ ఏకంగా 26 సినిమాలు/వెబ్ సిరీసులు ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయనున్నాయి. అందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం వరుణ్‌ ధావన్‌ నటించిన తోడేలు.

OTT Movies: ఓటీటీ లవర్స్‌కు పండగే.. ఈ వారం స్ట్రీమింగ్‌కు రానున్న సూపర్‌ హిట్ మూవీస్‌.. ఫుల్‌ లిస్ట్‌ ఇదుగో
Ott Movies
Follow us
Basha Shek

|

Updated on: May 22, 2023 | 11:48 AM

ఎప్పటిలాగే ఈవారంలో కూడా చాలా సినిమాలు థియేటర్లలో అడుగుపెడుతున్నాయి. నరేష్‌- పవిత్రల మళ్లీ పెళ్లి, మేమే ఫేమస్‌, 2018 తెలుగు వెర్షన్‌, #మెన్‌టూ వంటి ఆసక్తికర సినిమాలు ఈ వీక్‌ థియేటర్లలో సందడి చేస్తున్నాయి. అయితే చాలామంది ఆసక్తి మాత్రం ఓటీటీ రిలీజులపైనే ఉంది. ఆఫీసు పనులు, ఇతరత్రా కారణాలతో థియేటర్లకు వెళ్లలేని వారు ఇంట్లోనే కూర్చుని సినిమాలు చూసే ప్లాన్స్ వేస్తుంటారు. అందుకు తగ్గట్టే పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు ప్రతివారం ఆసక్తికర సినిమాలు, వెబ్‌ సిరీస్‌లకు స్ట్రీమింగ్‌ కు తీసుకొస్తున్నాయి. అలా ఈ వారం కూడా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌లో బోలెడన్నీ సినిమాలు/సిరీస్‌లు రిలీజ్‌ కానున్నాయి. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఈ వీక్‌ ఏకంగా 26 సినిమాలు/వెబ్ సిరీసులు ఓటీటీ ప్రేక్షకులను ఎంటర్‌ టైన్‌ చేయనున్నాయి. అందులో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న చిత్రం వరుణ్‌ ధావన్‌ నటించిన తోడేలు. థియేటర్లలో భారీ వసూళ్లు కురిపించిన ఈ చిత్రం ఓటీటీలో ఏ మేర హిట్‌ అవుతుందో చూడాలి. అలాగే ఆహాలో ‘సత్తిగాని రెండెకరాలు’ కూడా స్ట్రీమింగ్ కానుంది. వీటితో పాటు బోలెడన్నీ హిందీ, ఇంగ్లిష్‌ సినిమాలు/ వెబ్‌ సిరీస్‌లు ఓటీటీల్లో అందుబాటులోకి రానున్నాయి. మరి అవేంటో ఓ లుక్కేద్దాం రండి.

ఆహా

  • గీతా సుబ్రహ్మణ్యం 3 ( తమిళ వెబ్ సిరీస్) – మే 23
  • సత్తిగాని రెండెకరాలు (తెలుగు సినిమా) – మే 26

జియో సినిమా

ఇవి కూడా చదవండి
  • బేవఫా సనమ్ (భోజ్ పురి మూవీ) – మే 24
  • క్రాక్ డౌన్ సీజన్ 2 (హిందీ సిరీస్) – మే 25
  • బేడియా (తెలుగు డబ్బింగ్ సినిమా) – మే 26

నెట్‌ఫ్లిక్స్

  • విక్టిమ్/ సస్పెక్ట్ (ఇంగ్లిష్‌ సినిమా) – మే 23
  • హార్డ్ ఫీలింగ్స్ (జర్మన్ సినిమా) – మే 24
  • ఫ్యూబర్ (ఇంగ్లిష్‌ సిరీస్) – మే 25
  • దసరా (హిందీ వెర్షన్) – మే 25
  • బ్లడ్ & గోల్డ్ (ఇంగ్లిష్‌ సినిమా) – మే 26
  • ద ఇయర్ ఐ స్టార్టెడ్ మాస్ట్రబేటింగ్ (డానిష్ మూవీ) – మే 26
  • టిన్ & టీనా (స్పానిష్ సినిమా) – మే 26
  • ద క్రియేచర్ కేసెస్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) – మే 22

డిస్నీ ప్లస్ హాట్ స్టార్

  • అమెరికల్ బార్న్ చైనీస్ (ఇంగ్లిష్‌ సిరీస్) – మే 24
  • సిటీ ఆఫ్ డ్రీమ్స్ సీజన్ 3 (హిందీ సిరీస్) – మే 26

అమెజాన్ ప్రైమ్

  • మిస్సింగ్ (ఇంగ్లిష్‌ సినిమా) – మే 24
  • సిటాడెల్‌ ఫైనల్‌ ఎపిసోడ్‌- మే 26

జీ5

  • సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై (హిందీ సినిమా) – మే 23
  • కిసీ కా బాయ్ కిసీ కీ జాన్ (హిందీ మూవీ) – మే 26

డిస్కవరీ ప్లస్

  • ప్రిజనర్ ఆఫ్ ది ప్రొఫెట్ (ఇంగ్లిష్‌ సిరీస్) – మే 25
  • కేండ్రా సెల్స్ హలీవుడ్ సీజన్ 2 (ఇంగ్లిష్‌ సిరీస్) – మే 26

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..