Ramabanam OTT: అప్పుడే ఓటీటీలోకి గోపీచంద్‌ రామబాణం.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?

మే 5న విడుదలైన రామబాణం సినిమాకు నెగెటివ్‌ టాక్‌ వచ్చింది. పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా గోపిచంద్‌ అభిమానులను అలరించినప్పటికీ, సగటు సినిమా ప్రేక్షకుడిని మాత్రం నిరాశపరిచింది. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్‌, గోపీచంద్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, డింపుల్‌ అందాలు సినిమాను ఓ మోస్తరుగా నడిపించాయి.

Ramabanam OTT: అప్పుడే ఓటీటీలోకి గోపీచంద్‌ రామబాణం.. స్ట్రీమింగ్‌ ఎప్పుడు, ఎక్కడంటే?
Ramabanam Movie
Follow us
Basha Shek

|

Updated on: May 23, 2023 | 3:20 PM

మ్యాచో స్టార్‌ గోపీచంద్‌ హీరోగా నటించిన లేటెస్ట్‌ చిత్రం రామబాణం. శ్రీవాస్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో డింపుల్ హయతీ హీరోయిన్‌గా నటించింది. జగపతి బాబు, ఖుష్బు, నాసర్‌, తరుణ్‌ అరోరా, వెన్నెల కిశోర్‌ ప్రధాన పాత్రల్లో కనిపించారు. మే 5న విడుదలైన రామబాణం సినిమాకు నెగెటివ్‌ టాక్‌ వచ్చింది. పూర్తి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ సినిమా గోపిచంద్‌ అభిమానులను అలరించినప్పటికీ, సగటు సినిమా ప్రేక్షకుడిని మాత్రం నిరాశపరిచింది. అయితే ఫ్యామిలీ ఎమోషన్స్‌, గోపీచంద్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌, డింపుల్‌ అందాలు సినిమాను ఓ మోస్తరుగా నడిపించాయి. బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. అయితే చాలామంది ఓటీటీలో చూద్దామనే ఫిక్స్ అయ్యారు. ఇప్పుడీ వాళ్లకోసం రామబాణం ఓటీట రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ అయ్యింది. కాగా థియేట్రిక‌ల్ రిలీజ్‌కు ముందే దాదాపు రూ.8 కోట్ల‌కు గోపీచంద్‌ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ సోనిలివ్ ద‌క్కించుకున్నట్లు సమాచారం. గోపీచంద్‌, శ్రీవాస్ కాంబినేషన్లో గతంలో వచ్చిన లక్ష్యం, లౌక్యం సినిమాలు సూపర్‌ హిట్‌ కావడంతో భారీ మొత్తానికి రామబాణం ఓటీటీ హక్కులను సోనిలివ్‌ సొంతం చేసుకుందట.

థియేటర్లలో ఓ మోస్తరుగా ఆడిన రామబాణం జూన్ 1 లేదా 3వ తేదీ నుంచి సోనిలివ్‌ లో స్ట్రీమింగ్‌ కానుందట. అంటే థియేటర్లలో విడుదలైన నాలుగు వారాల్లోనే రామబాణం కూడా ఓటీటీలోకి వచ్చేస్తుందనమాట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సమాచారం. రామబాణం సినిమాలో గోపీచంద్‌, జగ్గూభాయ్‌ అన్నదమ్ములుగా నటించారు. అలాగే విక్కీభాయ్‌ అనే మాఫియా డాన్‌ పాత్రలో గోపీచంద్‌ నటించాడు. మరి థియేటర్లలో రామబాణం సినిమాను మిస్‌ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్‌ చేయండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి.

గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
తెల్ల జుట్టు నల్లగా మారేందుకు అద్భుతమైన చిట్కా..10రోజుల్లోనే..
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా
ఐసీసీ బౌలర్ల ర్యాంకింగ్స్‌ విడుదల.. బుమ్రా ప్లేస్ ఎక్కడో తెలుసా