Vishwak Sen: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ సేన్, రకుల్ సినిమా.. అక్కడ ఫ్రీగానే చూడొచ్చు..

తాజాగా ఆ జాబితాలోకి చేరింది బూ చిత్రం. విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాశ్, మంజిమా మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి రాబోతుంది. తమిళ్ డైరెక్టర్ విజయ్ తెరకెక్కించిన ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల థియేటర్లలో విడుదల కాలేదు.

Vishwak Sen: నేరుగా ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ సేన్, రకుల్ సినిమా.. అక్కడ ఫ్రీగానే చూడొచ్చు..
Boo Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: May 23, 2023 | 6:49 PM

ప్రస్తుతం థియేటర్లలో చిన్నా, పెద్ద సినిమాలు భారీ విజయాన్ని ఖాతాలో వేసుకుంటున్నాయి. అయినప్పటికీ ఓటీటీల జోరు మాత్రం తగ్గడం లేదు. బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చిత్రాలు నెల తిరిగే సరికి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికీ పలు చిత్రాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతున్నాయి. తాజాగా ఆ జాబితాలోకి చేరింది బూ చిత్రం. విశ్వక్ సేన్, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాశ్, మంజిమా మోహన్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా ఇప్పుడు నేరుగా ఓటీటీలోకి రాబోతుంది. తమిళ్ డైరెక్టర్ విజయ్ తెరకెక్కించిన ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అయితే అనివార్య కారణాల వల్ల థియేటర్లలో విడుదల కాలేదు.

ఇప్పుడు ఈ సినిమా నేరుగా ఓటీటీలో రిలీజ్ కాబోతుంది. ఈ హారర్ అండ్ థ్రిల్లర్ మూవీని జియో సినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ లో తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఈ నెల 27న స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ.. జియో సినిమా టీజర్ ను విడుదల చేశారు మేకర్స్.

ఇవి కూడా చదవండి

ఈసారి మీకు ఎక్కిళ్లు వస్తే నీళ్ల కోసం చూడకండి.. ఒకసారి చుట్టూ చూడండి.. మీ పరిసరాల్లో దెయ్యం ఉండే అవకాశం ఉంది అని జియో స్టూడియోస్ పేర్కొంది. శర్వంత్ రామ్ క్రియేషన్స్, షిరిడి సాయి మూవీస్ బ్యానర్స్ మీద జవ్వాజి రామాంజనేయులు, యం. రాజశేఖర్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. బూ చిత్రం ఆద్యంతం సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా ఉంటుందని, విజయ్ దీనిని చాలా బాగా హ్యాండిల్ చేశాడని వారు చెబుతున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ ఈ మూవీకి సంగీతాన్ని అందించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.