Vidudala Movie: ఓటీటీలోకి వచ్చేసిన విడుదల పార్ట్-1 తెలుగు వెర్షన్.. విజయ్ సేతుపతి మూవీని ఎక్కడ చూడొచ్చంటే?
ఏప్రిల్ 28 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5 ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది కేవలం తమిళ్ వెర్షన్ మాత్రమే. ఇటీవలే కన్నడ, మలయాళ వెర్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే తాజాగా తెలుగు వెర్షన్ విడుదల పార్ట్ 1కూడా ఓటీటీలోకి వచ్చేసింది.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ వెట్రిమారన్ తెరకెక్కించిన లేటెస్ట్ సినిమా విడుతలై. ఇప్పటివరకు కమెడియన్‌గానే పరిచయమైన సూరీ ఈ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పవర్ ఫుల్ క్యామియో రోల్‌లో కనిపించాడు. మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ మూవీ ఫస్ట్ పార్ట్ మార్చి 31న విడుదలైంది. సూపర్ హిట్ టాక్ రావడంతో తెలుగులో విడుదల పార్ట్ 1 గా ఏప్రిల్ 15న రిలీజ్ చేశారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల చేసిన ఈ మూవీకి ఇక్కడ కూడా కలెక్షన్లు భారీగా వచ్చాయి. థియేటర్లలో అందరినీ ఆకట్టుకున్న విడుతలై పార్ట్-1కు ఓటీటీలోనూ మంచి వ్యూస్ వచ్చాయి. ఏప్రిల్ 28 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5 ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ఇది కేవలం తమిళ్ వెర్షన్ మాత్రమే. ఇటీవలే కన్నడ, మలయాళ వెర్షన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అయితే ఎలాంటి అధికారిక ప్రకటన లేకుండానే తాజాగా తెలుగు వెర్షన్ విడుదల పార్ట్ 1కూడా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం జీ 5 లోఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
ఇంటెన్స్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన విడుదల సినిమాలో భవాని శ్రీ, చేతన్, గౌతం వాసుదేవ్ మీనన్, ఇళవరసు, బాలాజీ శక్తివేల్, ఇతరులు కీలక పాత్రలు పోషిమంచారు. మ్యాస్ట్రో ఇళయరాజా స్వరాలు సమకూర్చారు. కాగా విడుదల సినిమాకు కొనసాగింపుగా విడుదల 2 షూటింగ్ కూడా శరవేగంగా జరగుతతోంది. త్వరలోనే సీక్వెల్‌కు సంబంధించిన అప్డేట్ రానుంది. మరి థియేటర్లలో ఈ పోలీస్ యాక్షన్ డ్రామాను మిస్ అయిన వారు ఎంచెక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.
#Vidudala #VidudalaPart1 pic.twitter.com/NbXYZsdFKp
— Aakashavaani (@TheAakashavaani) May 23, 2023
A little revolution now and then it is a complete freedom. So gather your friends & family together for movie night #VidudhalaPart1 is streaming now on #Zee5 pic.twitter.com/2VcvQYeYVm
— TeluguOTTInfo (@TeluguOTTInfo) May 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..