Telugu Indian Idol 2: పండగ.. పండగంతే.. పుష్పరాజ్ ఎంట్రీతో అద్దిరిపోయిన ఆహా ‘తెలుగు ఇండియన్ ఐడల్-2’ గ్రాండ్ ఫినాలే
సీజన్ 1 మెగా ఫినాలేకి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వచ్చి అలరించిన సంగతి తెలిసిందే. ఇక రెండో సీజన్ గ్రాండ్ ఫినాలేకు... పుష్పతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నాడు. ఇటీవలే పుష్ప టీజర్ ద్వారా హింట్ ఇచ్చిన ఆహా యూనిట్.. అల్లు అర్జున్ గెస్ట్ గా వస్తున్నాడని చెప్పకనే చెప్పేసింది.
సంగీత ప్రియులను ఎంతగానో అలరిస్తోన్న ఆహా ‘ తెలుగు ఇండియన్ ఐడల్ 2’ ఆఖరి అంకానికి చేరుకుంది. రెండో సీజన్‌లో మొత్తం 25 ఎపిసోడ్లకు గానూ 10,000 మంది యువ సింగర్స్ తమ అదృష్టం పరీక్షించుకోగా టాప్ 5 లిస్టును తాజాగా ప్రకటించారు. న్యూజెర్సీకి చెందిన శ్రుతి, హైదరాబాద్‌కు చెందిన జయరామ్, సిద్దిపేటకు చెందిన లాస్య ప్రియ, హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ, విశాఖపట్నంకు చెందిన సౌజన్య టాప్-5 లిస్టులో ఉన్నారు. ఇక సీజన్ 1 మెగా ఫినాలేకి మెగాస్టార్ చిరంజీవి చీఫ్ గెస్ట్‌గా వచ్చి అలరించిన సంగతి తెలిసిందే. ఇక రెండో సీజన్ గ్రాండ్ ఫినాలేకు… పుష్పతో పాన్ ఇండియా హీరోగా మారిపోయిన అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా రానున్నాడు. ఇటీవలే పుష్ప టీజర్ ద్వారా హింట్ ఇచ్చిన ఆహా యూనిట్.. అల్లు అర్జున్ గెస్ట్ గా వస్తున్నాడని చెప్పకనే చెప్పేసింది. ఇదిలా ఉంటే తెలుగు ఇండియన్ ఐడల్ 2 గ్రాండ్ ఫినాలేకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉంది ఆహా మేనేజ్‌మెంట్. ఈ ఐకానిక్ ఫినాలేలో భాగంగా ఫైనలిస్ట్‌లను పరిచయం చేశారు షో జడ్జీలు తమన్, కార్తీక్, గీతా మాధురి. ఈ సందర్భంగా ఫైనలిస్టులుగా ఎంపికైన కార్తికేయ, శృతి, జయరాం, లాస్య, సౌజన్యలు అద్భుతంగా పాటలు పాడి అలరించారు. తాజాగా ఫినాలే ఎపిసోడ్‌లో అల్లు అర్జున్ ఎంట్రీకి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేశారు.
కాగా మునుపెన్నడూ చూడని విధంగా స్టైలిష్ లుక్‌లో ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోకు హాజరయ్యారు అల్లు అర్జున్. ఈ సందర్భంగా కంటెస్టెంట్లు, షో జడ్జీలు పుష్పరాజ్‌కు ఘన స్వాగతం పలికారు. దీనికి సంబంధించిన ఫొటోలను, వీడియోలను ట్విట్టర్ లో షేర్ చేసుకుంది ఆహా.. ‘ మీరు మునుపెన్నడూ చూడని స్టైలిష్ లుక్‌లో మన ఐకాన్ స్టార్. ఇంతకు ముందెన్నడూ వినని ఇంట్రెస్టింగ్ థింగ్స్. గ్రాండ్ ఫినాలేలో ఇక పండగే.. పండగంతే’ అని షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
An ICONIC finale with the ICON star @alluarjunonline for an Iconic Show! Blockbuster entertainment is loading…#TeluguIndianIdol2 ?#AAforTeluguIndianIdol2 #Teluguindianidol2 @alluarjun @MusicThaman @singer_karthik @GeethaArts pic.twitter.com/2kmb6mD7ky
— ahavideoin (@ahavideoIN) May 22, 2023
munupennadu chudani vidhamga mana ‘ICON’ star..! Inthaku mundeppudu vinani interesting things..!#AAforTeluguIndianIdol2, Grand finAAle- Pandaga, pandaga anthe..? Coming soon..#IconicFinAAle #AlluArjun #AAforTeluguIndianIdol2 @alluarjun pic.twitter.com/1Gzdfaf8G8
— ahavideoin (@ahavideoIN) May 23, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..