Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Revenge: మరికాసేపట్లో పెళ్లి.. వేదికపైనే వధువు బండారం బయటపెట్టిన వరుడు.. అవి చూసి అంతా షాక్..!

ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది కీలక ఘట్టం. అందుకే ఆ వివాహ వేడుకను బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభగంగా జరుపుకుంటారు. అయితే, జీవితంలో అత్యంత సంతోషకరమైన తన పెళ్లి రోజున ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు ఓ వరుడు. వధువు తనను మోసం చేసిందని గుర్తించిన అతను.. నెక్ట్స్ లెవల్‌లో పగ తీర్చుకున్నాడు. పెళ్లి కూతురు గురించి విషయం తెలిసిన వెంటనే..

Revenge: మరికాసేపట్లో పెళ్లి.. వేదికపైనే వధువు బండారం బయటపెట్టిన వరుడు.. అవి చూసి అంతా షాక్..!
Marriage Celebrations
Follow us
Shiva Prajapati

|

Updated on: May 24, 2023 | 1:22 PM

ప్రతి వ్యక్తి జీవితంలో పెళ్లి అనేది కీలక ఘట్టం. అందుకే ఆ వివాహ వేడుకను బంధుమిత్రుల సమక్షంలో అంగరంగ వైభగంగా జరుపుకుంటారు. అయితే, జీవితంలో అత్యంత సంతోషకరమైన తన పెళ్లి రోజున ఎవరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు ఓ వరుడు. వధువు తనను మోసం చేసిందని గుర్తించిన అతను.. నెక్ట్స్ లెవల్‌లో పగ తీర్చుకున్నాడు. పెళ్లి కూతురు గురించి విషయం తెలిసిన వెంటనే ఆ సంబంధాన్ని క్యాన్సిల్ చేయకుండా.. ఏకంగా పెళ్లి రోజునే బిగ్ షాక్ ఇచ్చాడు. పెళ్లికి వచ్చిన అతిథులను, అందరినీ అవాక్కయ్యేలా చేశాడు.

వధువు తన స్నేహితుడితోనే అఫైర్ నడుపుతున్నట్లు తెలుసుకున్న వరుడు.. ఆ విషయాన్ని పెళ్లి వేదికపై రివీల్ చేశాడు. వారి ఫోటోలను ఓ సీల్డ్ కవర్‌లో పెట్టి.. గిఫ్ట్‌గా తీసుకువచ్చి అందరి ముందు ప్రజెంట్ చేశాడు. దాంతో వధువరుల కుటుంబ సభ్యులు సహా పెళ్లికి వచ్చిన అతిథులు సైతం అవాక్కయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను టిక్‌టాక్‌లో పోస్ట్ చేయగా.. అది ట్రెండ్ అవుతోంది.

ఈ వీడియో ప్రకారం.. వధువు తండ్రి తన కుమార్తెను వేదికపైకి తీసుకువస్తాడు. ఆ సమయంలో వరుడు లేచి నిలబడతాడు. తాను మాట్లాడే ముందు.. మీకు ఇచ్చిన కవర్ తెరవండి అని వధువు తండ్రికి సూచిస్తాడు వరుడు. ఆ సీల్డ్ కవర్ ఓపెన్ చేయగా.. అందులో ఫోటోలు ఉన్నాయి. వాటిని చూసి అవాక్కయ్యాడు వధవు తండ్రి. అమ్మాయి, తన స్నేహితుడు ఇద్దరి మధ్య నడుస్తున్న వ్యవహారం ఇది అంటూ, సాక్ష్యాధారాలు ఇవే అంటూ వరుడు తన చేతిలోని మైక్‌ను కింద పడేసి వేదిక దిగిపోయాడు. ఈ షాకింగ్ స్టేట్‌మెంట్‌ అనంతరం.. వరుడు తన తల్లిదండ్రులతో కలిసి వెళ్లిపోయాడు. బంధుమిత్రులు సైతం ఈ ఘటనతో షాక్ అయ్యారు. ఇక ఎంతో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేసిన వధువు కుటుంబ సభ్యులు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.

ఇవి కూడా చదవండి

కాగా, ఈ వీడియో వైరల్ అవగా.. అది చూసి నెటిజన్లు రకరకాల రిప్లైస్ ఇస్తున్నారు. కామెంట్స్‌తో హోరెత్తించారు. వరుడు స్థానంలో ఉన్న ఎవరైనా ఇలాగే చేస్తారని అంటున్నారు. మరికొందరు వరుడి చర్యను సమర్థిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..