Mobile Hack: పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి.. మీ మొబైల్ హ్యాక్ అవుతుంది..!
మొబైల్.. ఇప్పుడు ఇది వ్యక్తి జీవితం కంటే కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది. చేతిలో ఫోన్ లేనిదే అడుగు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. చిన్న పిల్లలు మొదలు.. ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఫోన్‌ను ఏదో రకంగా వినియోగిస్తూనే ఉంటారు. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఆపరేట్ చేయడమే కాకుండా.. పడుకున్న తరువాత కూడా తలగడ పక్కనే మొబైల్
మొబైల్.. ఇప్పుడు ఇది వ్యక్తి జీవితం కంటే కూడా ఇంపార్టెంట్ అయిపోతుంది. చేతిలో ఫోన్ లేనిదే అడుగు ముందుకు కదలని పరిస్థితి నెలకొంది. చిన్న పిల్లలు మొదలు.. ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరూ ఫోన్‌ను ఏదో రకంగా వినియోగిస్తూనే ఉంటారు. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు ఆపరేట్ చేయడమే కాకుండా.. పడుకున్న తరువాత కూడా తలగడ పక్కనే మొబైల్ పెట్టుకుని పడకుంటారు. కాల్స్ చేస్తారు.. ఫోన్స్ మాట్లాడుతారు.. మ్యూజిక్ వింటారు.. వీడియోస్ చూస్తారు.. వ్యక్తిగత పనులను సైతం చేస్తారు.. బ్యాంకింగ్, టెక్నికల్ వర్క్స్, ప్రభుత్వ పనులు.. ఇలా ఒకటేమిటి.. సమస్తం ఫోన్ ద్వారానే చేసుకునే వెసులుబాటు ఇప్పుడు ఉంది.
అయితే, ప్రజలు అవసరాలు, వినయోగాలను ఆసరాగా చేసుకుని అడ్డదారుల్లో డబ్బు సంపాదించే కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. వారే హ్యాకర్స్. అవును, ఫోన్ వినియోగదారులు ఏమాత్రం పొరపాటు చేసినా.. హ్యాకర్ల చేతిలో అడ్డంగా బుక్కైపోతారు. అందుకే ఫోన్ వినియోగదారులు కొన్ని పొరపాట్లు అస్సలు చేయొద్దు. మరి చేయకూడని పొరపాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ఈ తప్పులు చేస్తే మీ మొబైల్ హ్యాక్ అవ్వడం ఖాయం..
1. తెలియని లింక్ మీ మొబైల్‌కి వస్తే.. అస్సలు క్లిక్ చేయొద్దు. ఇలా చేస్తే మీ మొబైల్ హ్యాక్ అయ్యే ప్రమాదం ఉంది. అందుకే ముందుగా ఈ లింక్ నిజమైనదో, కాదో వేరిఫై చేసుకోవాలి.
2. ఈ-మెయిల్ ద్వారా గానీ, టెక్ట్స్ మెసేజ్ ద్వారా గానీ, ఇతర ఏ మార్గం ద్వారానైనా కేవైసీ చేయాలంటూ మెసేజ్ వచ్చినట్లయితే.. దానిపై క్లిక్ చేయొద్దు. ధృవీకరణ లేకుండా ఏ సమాచారాన్ని ఇవ్వొద్దు. గుడ్డిగా నమ్మి మీ సమాచారం అంతా ఇచ్చే్స్తే.. అడ్డంగా బుక్కైపోతారు. మీ అకౌంట్‌లో డబ్బు అంతా ఖాళీ అయిపోతుంది.
3. లాటరీ అని, లోన్ అని, క్రెడిట్ కార్డ్ ఆఫర్ అని మెసేజ్‌లు వచ్చినా వాటిని పట్టించుకోవద్దు. పొరపాటున కూడా వాటిని క్లిక్ చేయొద్దు. లేదంటే మీ మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంది.
4. మీరు గూగుల్‌లో చెక్ చేసినప్పుడు.. అనేక వెబ్‌సైట్‌లు మీ అనుమతి అడుగుతాయి. అయితే, ఏ వెబ్‌సైట్‌కు అనుమతి ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదో అవగాహన కలిగి ఉండాలి. అన్నింటికీ అనుమతి ఇవ్వడం వలన మీ సమాచారం చోరీ అయ్యే అవకాశం ఉంది. కొన్ని నకిలీ వెబ్‌సైట్స్ కూడా ఉంటాయి. వాటిని మీరు నిజమని నమ్మి.. అన్నింటికీ అనుమతి ఇస్తే.. మీ అకౌంట్‌లో డబ్బు సహా, మీ పర్సన్ ఇన్ఫర్మేషన్ మొత్తం హ్యాకర్ల చేతికి చిక్కుతుంది.
మరిన్ని టెక్నాలజీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..