Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mangal Shukra Yuti: కర్కాటక రాశిలోకి శుక్రుడు ప్రవేశం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మే 30వ తేదీన శుక్రుడు.. చంద్రుని రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశిస్తుంది. మే 30వ తేదీ రాత్రి 7.39 గంటలకు శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. జూలై 7 వరకు శుక్రుడు ఈ రాశిలోనే ఉండనుంది. కర్కాటక రాశిలో కుజుడు ఇప్పటికే ఉన్నందున.. కర్కాటకంలో కుజుడు, శుక్రుడు కలయిక జరుగుతుంది.

Mangal Shukra Yuti: కర్కాటక రాశిలోకి శుక్రుడు ప్రవేశం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..
HoroscopeImage Credit source: TV9 Telugu
Follow us
Shiva Prajapati

|

Updated on: May 22, 2023 | 9:28 AM

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మే 30వ తేదీన శుక్రుడు.. చంద్రుని రాశి అయిన కర్కాటకంలోకి ప్రవేశిస్తుంది. మే 30వ తేదీ రాత్రి 7.39 గంటలకు శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తుంది. జూలై 7 వరకు శుక్రుడు ఈ రాశిలోనే ఉండనుంది. కర్కాటక రాశిలో కుజుడు ఇప్పటికే ఉన్నందున.. కర్కాటకంలో కుజుడు, శుక్రుడు కలయిక జరుగుతుంది. దీని ద్వారా మంగళ-శుక్ర యుతి ఏర్పడుతుంది. అంగారకుడు, శుక్ర గ్రహాల కలయిక ప్రజల జీవితాలపై ప్రభావాన్ని చూపుతుంది. శుక్రగ్రహ సంచారం వలన ఏర్పడిన శుక్ర-అంగారకుల కలయిక.. కొన్ని రాశుల వారికి అదృష్టం వరించనుంది. ఆకస్మిక ధన లాభం, ఉద్యోగులకు ప్రమోషన్ వంటి ప్రయోజనాలు కలుగుతాయి. మరి ఏ రాశుల వారికి ప్రయోజనం జరుగనుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

మేషం..

శుక్ర సంచారం ద్వారా ఏర్పడిన కుజుడు-శుక్ర కలయిక.. ఈ రాశి వారి కుటుంబంలో చాలా సంతోషాన్ని, శాంతిని ఇస్తుంది. వినోదాలలో గడుపుతారు. కెరీర్‌లో పురోగతి ఉంటుంది. మీ జీవిత భాగస్వామి కూడా ఉద్యోగంలో కొత్త అవకాశాలను పొందే అవకాశం ఉంది. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది.

మిథునం..

మిథున రాశి వారికి ధనలాభం లభిస్తుంది. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. వ్యాపారంలో అధిక లాభం ఉంటుంది. ఈ సమయంలో ఏదైనా కొత్త పనిని ప్రారంభించవచ్చు. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. ఆస్తి ద్వారా లాభం ఉంటుంది. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది.

ఇవి కూడా చదవండి

కర్కాటకం..

శుక్రుని సంచారం వల్ల ఏర్పడిన కుజుడు-శుక్రుడు సంయోగం కర్కాటక రాశివారి వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తుంది. వారి భాగస్వామితో అనుబంధం బలంగా ఉంటుంది. వివాహం కుదిరే అవకాశం ఉంది. పని చేసే చోట ప్రజలు మీ మాటలకు ప్రాధాన్యత ఇస్తారు. గౌరవం పెరుగుతుంది. పని మెరుగ్గా ఉంటుంది.

కన్యారాశి..

పెద్ద కోరికలు ఏవైనా నెరవేరుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఒంటరి వ్యక్తులు భాగస్వామిని పొందవచ్చు. కెరీర్‌లో పురోగతి ఉంటుంది. సీనియర్ అధికారులు మిమ్మల్ని ప్రశంసిస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. శృంగారంలో మునిగితేలుతారు.

మకర రాశి..

ఇతరులతో మెరుగైన సంబంధాలు ఉంటాయి. జీవిత భాగస్వామి, ప్రేయసితో బంధం మరింత బలపడుతుంది. శృంగారం జీవితం మరింత మెరుగ్గా ఉంటుంది. వృత్తి జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. కొత్త జాబ్ ఆఫర్ పొందవచ్చు. వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..