AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అయ్యో అయ్యో అయ్యయ్యో.. పాపం అమ్మాయి.. అడ్డంగా బుక్కైంది.. వీడియో చూస్తే నవ్వాగదు..!

సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని మనల్ని కళ్లు తిప్పుకోనివ్వవు. మరికొన్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తాయి. తాజాగా అంతకు మించి అన్నట్లుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది. కొన్ని కొన్నిసార్లు మనం చేసే పనులు ప్రపంచాన్ని మనవైపు చూసేలా చేస్తాయి. అలాంటి సీన్ ఓ అమ్మాయి విషయంలో చోటు చేసుకుంది.

Watch Video: అయ్యో అయ్యో అయ్యయ్యో.. పాపం అమ్మాయి.. అడ్డంగా బుక్కైంది.. వీడియో చూస్తే నవ్వాగదు..!
Funny Girl
Shiva Prajapati
|

Updated on: May 21, 2023 | 5:50 PM

Share

సోషల్ మీడియాలో నిత్యం వేలాది వీడియోలు వైరల్ అవుతుంటాయి. అందులో కొన్ని మనల్ని కళ్లు తిప్పుకోనివ్వవు. మరికొన్ని పొట్ట చెక్కలయ్యేలా నవ్వు తెప్పిస్తాయి. తాజాగా అంతకు మించి అన్నట్లుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాను ఊపేస్తోంది. కొన్ని కొన్నిసార్లు మనం చేసే పనులు ప్రపంచాన్ని మనవైపు చూసేలా చేస్తాయి. అలాంటి సీన్ ఓ అమ్మాయి విషయంలో చోటు చేసుకుంది. అయితే, ఇది చాలా ఫన్నీగా ఉంది. చూసేందుకు పాపం అనిపించినా.. ఆ అమ్మాయి చేసిన పని నవ్వు తెప్పిస్తోంది. ఇంతకీ ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో.. ఓ అమ్మాయి రోడ్డును దాటేందుకు ప్రయత్నించింది. అయితే, రోడ్డుపై డివైడర్స్ ఉంటాయనే విషయం తెలిసిందే. కొన్నిచోట్ల తక్కువ ఎత్తులో సిమెంట్ దిమ్మెలు ఉంటే.. మరికొన్ని చోట్ల ఎత్తైన ఐరన్ గ్రిల్స్ ఉంటాయి. అయితే, వైరల్ అవుతున్న ఈ వీడియోలోనూ రోడ్డు మధ్యలో ఐరన్ గ్రిల్స్ ఉన్నాయి. ఈ గ్రిల్స్ మద్య కొద్దిపాటి గ్యాప్ మాత్రమే ఉంటుంది. అందులో సన్నగా ఉండే వారు పట్టే అవకాశం ఉంది. ఇంతలో ఓ అమ్మాయి రోడ్డు దాటేందుకు ప్రయత్నించింది. ఎత్తైన గ్రిల్స్ దాటడం సాధ్యం కాదు కాబట్టి.. ఆ అమ్మాయి గ్రిల్స్ మధ్యలోంచి దాటేందుకు ప్రయత్నించింది. మొదట కాళ్లు బయటకు పెట్టి.. శరీరం మొత్తం ఇవతలి వైపు వచ్చేసింది. చివరకు.. తల బయటకు తీసేందుకు ప్రయత్నించింది. అయితే, అప్పుడే పెద్ద సమస్య వచ్చిపడింది. తల ఆ గ్రిల్స్ మధ్యలో ఇరుక్కుపోయింది.

ఇవి కూడా చదవండి

తలను బయటకు తీసేందుకు అమ్మాయి తీవ్ర అవస్థలు పడింది. శరీరం ఇవతల.. తల అవతల.. కాసేపు ఆగమాగం అయ్యింది. మొత్తానికి ఆ అమ్మాయి తల సేఫ్‌గా బయటకు తీసింది. అయితే, పక్కనే ఉన్న ఆమె స్నేహితులు.. ఈ సీన్‌ను వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో ఆ వీడియో కాస్తా నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు నవ్వుకుంటున్నారు. మరెందుకు ఆలస్యం ఈ వీడియోపై ఓ లుక్కేసుకోండి.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
తెలంగాణ ప్రవేశ పరీక్షల తేదీలు 2026 విడుదల.. పూర్తి షెడ్యూల్ ఇదే
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
చర్చలు సఫలం.. శనివారం నుంచి యధావిధిగా ఆర్టీసీ బస్సులు
విజయం సాధించిన ఆర్సీబీ
విజయం సాధించిన ఆర్సీబీ
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
చీమకు ఎన్ని పళ్ళు ఉంటాయో మీకు తెలుసా? 99 శాతం మందికి తెలియని నిజా
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
మీ బంధం దృఢంగా ఉండాలంటే.. పెళ్లికి ముందే ఈ 4 విషయాలపై క్లారిటీ త
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
బూట్లు ఉతికే ఓపిక లేదా? ఈ 5 చిట్కాలు పాటించండి.. నీరు లేకుండానే మ
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొబ్బరి పాల చికెన్ చేశారంటే.. తిన్నవాళ్ళు మైమరచిపోవాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
కొత్తిమీరతో వెరైటీగా ఉప్మా.. ఇలా చేశారో నోరూరాల్సిందే
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
అధిక రక్తపోటుకు కారణాలు ఏంటి..? అతిగా ఆలోచిస్తే బీపీ పెరుగుతుందా?
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే
స్పృహ తప్పిన వ్యక్తికి నీళ్లు తాగిస్తున్నారా.. అయితే డేంజరే