AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: వాళ్లంతా కండలు తిరిగిన గండరగండరులు.. సింహాన్ని ఇంచు కూడా కదిలియ్యలేకపోయారు..!

అడవికి రాజు సింహం అంటారు. ఎందుకంటే.. దాని ప్రత్యేక లక్షణాల కారణంగా. సింహానికి భయం అంటే ఏంటో తెలియదు. ఎదుట ఉన్న జీవి ఎంత పెద్దదైనా.. భయమెరుగనిది సింహం. టార్గె్ట్ ఫిక్స్ అయితే.. ప్రాణాలు పోతున్నా లెక్క చేయదు.

Watch Video: వాళ్లంతా కండలు తిరిగిన గండరగండరులు.. సింహాన్ని ఇంచు కూడా కదిలియ్యలేకపోయారు..!
Lion Vs Body Builders
Shiva Prajapati
|

Updated on: May 20, 2023 | 7:35 PM

Share

అడవికి రాజు సింహం అంటారు. ఎందుకంటే.. దాని ప్రత్యేక లక్షణాల కారణంగా. సింహానికి భయం అంటే ఏంటో తెలియదు. ఎదుట ఉన్న జీవి ఎంత పెద్దదైనా.. భయమెరుగనిది సింహం. టార్గెట్ ఫిక్స్ అయితే.. ప్రాణాలు పోతున్నా లెక్క చేయదు. పైగా.. అనంతమైన బలం సింహం సొంతం. పంజాతో అటాక్ చేస్తే.. ఏ జీవి అయినా జీవాన్ని వీడవాల్సిందే. అంతటి శక్తి ఉంటుంది. మగ సింహం రాజు అయితే, ఆడ సింహం రాణి. ధైర్యం, బలమే.. సింహాన్ని కింగ్‌గా చేశాయి. సింహం బలమేంటో నిరూపించే ఓ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్లు నోరెళ్లబెడుతున్నారు.

మనం చాలా సందర్భాల్లో చూసే ఉంటాం.. బల నిరూపణకై సరదాగా తాడు లాగే గేమ్ ఆడుతుంటారు. ఓ పెద్ద తాడును అటు కొంత మంది.. ఇటు కొంత మంది నిల్చుని, మధ్యలో ఓ గీత గీసి.. తాడు లాగుతారు. అటువైపు వారు గానీ, ఇటువైపు వారు గానీ.. మధ్యలోని గీత దాటి వస్తే ఓడిపోయినట్లుగా పరిగణిస్తారు. అచ్చం ఇలాంటి గేమ్‌నే కొందరు కండలు తిరిగిన బాడీ బిల్డర్స్‌కి, ఒక సింహానికి మధ్య ఏర్పాటు చేశారు నిర్వాహకులు.

ఇవి కూడా చదవండి

బోను లోపల సింహాన్ని ఉండగా.. ఇవతల ఓ నలుగురు బాడీ బిల్డర్స్ ఉన్నారు. తాడును బలంగా పట్టుకుని సిద్ధంగా ఉన్నారు. అవతలి వైపు సింహం తాడును ఒక పంజాతో అదిమిపట్టి.. నోటితో పట్టుకుని నిల్చుంది. ఇక పోటీ స్టార్ట్ అయ్యింది. ఇటువైపు తాడు నోట్లో పెట్టుకుని కట్టు కదలకుండా నిల్చుంది సింహం. అటువైపు.. తాడు పట్టుకుని బలంగా లాగుతున్నారు బాడీబిల్డర్స్. నలుగురు శక్తి.. ఒక్క సింహం శక్తి.. ఇంచు కూడా కదల్లేదు సింహం. ఆ సీన్ చూసి అంతా అవాక్కయ్యారు. బాబోయ్ సింహం బలం ఈ రేంజ్‌లో ఉంటుందా? అని గుడ్లు తేలేస్తున్నారు. అయితే, ఈ షాకింగ్ కాంపిటిషన్ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ అవుతోంది. మరెందుకు ఆలస్యం.. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేసుకోండి.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్