Viral Video: ప్లైట్‌లో విండో సీట్‌లో కూర్చున్న వ్యక్తి అద్భుతమైన అనుభవం.. నువ్వు లక్కీ పర్సన్ అంటున్న నెటిజన్లు..

ప్లైట్ లో విండో సీట్ వద్ద కూర్చున్న ఓ వ్యక్తి ఆకాశంలో అద్భుతాన్ని చూశాడు. అంతేకాదు తాను చూసినదానిని వెంటనే సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆకాశంలో చుసిన అద్భుతం వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అద్భుతం ఏమిటో తెలుసా.. రాకెట్ లాంఛింగ్..

Viral Video: ప్లైట్‌లో విండో సీట్‌లో కూర్చున్న వ్యక్తి అద్భుతమైన అనుభవం.. నువ్వు లక్కీ పర్సన్ అంటున్న నెటిజన్లు..
Video Viral
Follow us

|

Updated on: May 21, 2023 | 9:35 AM

ఎక్కడికైనా ప్రయాణం అంటే చాలు.. పిల్లలు నుంచి పెద్దవారి వరకూ ముందుగా చూసేది విండో సీట్ కోసమే. బస్సు, ట్రైన్ లో విండో సీటు దగ్గర కూర్చుని.. ప్రకృతి ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే విమానంలో కూడా చాలామంది విండో సీటు కావాలని కోరుకుంటారు. వాస్తవానికి విమానంలోని విండో నుంచి బయట ఉన్నవి ఏమీ కనిపించవు. అయినా సరే ప్లైట్ లో విండో సీటులోనే కూర్చోవాలని తెగ తాపత్రాయపడతారు. అయితే ప్లైట్ లో విండో సీట్ వద్ద కూర్చున్న ఓ వ్యక్తి ఆకాశంలో అద్భుతాన్ని చూశాడు. అంతేకాదు తాను చూసినదానిని వెంటనే సెల్ ఫోన్ లో చిత్రీకరించాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆకాశంలో చుసిన అద్భుతం వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఇంతకీ అద్భుతం ఏమిటో తెలుసా.. రాకెట్ లాంఛింగ్..

ఇన్‌స్టాగ్రామ్ లో plane.focus  అనే ఖాతాలో ఈ వీడియో షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి ప్లైట్ లో విండో పక్కన కూర్చుని.. తన సెల్ ఫోన్ కు పని చెప్పాడు.. తనకు కనిపిస్తున్న స్పేస్ సెంటర్‌ను వీడియో తీస్తున్నాడు. అయితే అప్పుడే.. ఆ స్పేస్ సెంటర్ ఓ రాకెట్‌ను లాంఛ్ చేస్తోంది. వీడియో తీసుకున్న సమయంలో రాకెట్ ఆకాశంలోకి వెళ్తుండడంతో.. అది రికార్డ్ అయింది. రాకెట్ మెల్లగా ఆకాశంవైపు పయనించడం మొదలు పెట్టి… ఆకాశంలోకి పూర్తిగా వెళ్లి..  రాకెట్ కనుమరుగు అయ్యే వరకూ ఈ వీడియోను చిత్రీకరించాడు. ఈ సన్నివేశం చూపరులను ఆకట్టుకుంది.

ఇవి కూడా చదవండి

రాకెట్ అంతరిక్షములోకి వెళ్తూ చేసిన ప్రయాణం వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంది. 6.7 లక్షల మంది చూశారు. రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి అరుదైన అవకాశం జీవితంలో బహు అరుదుగా లభిస్తుంది. చాలా అందంగా ఉంది.. ప్రత్యక్షంగా చూసావంటే మీరు చాలా అదృష్టవంతులు అంటూ భిన్నమైన ఫీలింగ్స్ ను వ్యక్తం చేశారు.

మరిన్ని ట్రేండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles