Viral Video: ఒకరిది ఆకలి తీర్చుకోవాలని ఆరాటం.. మరొకరిది ప్రాణం కోసం పోరాటం.. పులికి జింక పిల్ల ఊహించని షాక్‌..

అటవీ ప్రాంతంలో కొన్ని జింకలు మేత మేస్తూ ఉన్నాయి. పక్కనే ఉన్న గడ్డి పొదల మధ్య ఓ పులి నక్కి ఉంది. వాటిలో ఏదో ఒక జింకను ఎలాగైనా తన ఆహారంగా చేసుకోవాలని అదనుకోసం ఎదురు చూస్తూ ఉంది. జింకలు కాస్త ఆదమరిచి ఉండగా వాటిపై ఎటాక్‌ చేసింది.

Viral Video: ఒకరిది ఆకలి తీర్చుకోవాలని ఆరాటం.. మరొకరిది ప్రాణం కోసం పోరాటం.. పులికి జింక పిల్ల ఊహించని షాక్‌..
Viral Video
Follow us
Surya Kala

|

Updated on: May 20, 2023 | 11:06 AM

ఎంతటి బలవంతులైనా ఒక్కోసారి బలహీనుల చేతిలో ఓడిపోక తప్పని పరిస్థితులు వస్తాయి. బుద్ధిబలం ముందు దేహబలం ఎప్పటికీ గెలవదు.. అందుకు ఉదాహరణే ఈ వీడియో..ఇది కేవలం మనుషులకే కాదు జంతువులకూ వర్తిస్తుంది. ఇక్కడ ఓ జింకపిల్ల తనను వేటాడటానికి వచ్చిన పెద్దపులినే బోల్తాకొట్టించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

ఓ అటవీ ప్రాంతంలో కొన్ని జింకలు మేత మేస్తూ ఉన్నాయి. పక్కనే ఉన్న గడ్డి పొదల మధ్య ఓ పులి నక్కి ఉంది. వాటిలో ఏదో ఒక జింకను ఎలాగైనా తన ఆహారంగా చేసుకోవాలని అదనుకోసం ఎదురు చూస్తూ ఉంది. జింకలు కాస్త ఆదమరిచి ఉండగా వాటిపై ఎటాక్‌ చేసింది. అలర్టయిన జింకలు చెరోదిక్కు పరుగెత్తాయి. ఓ జింక పులినుంచి తప్పించుకునే క్రమంలో పక్కనే ఉన్న చెరువులో దూకింది. పులికూడా జింకకోసం నీటిలో దూకింది. జింకపై దాడి చేయాలని చూసింది. అయితే జింక చాలా తెలివిగా పులికి కనిపించకుండా నీటిలోకి మునిగిపోయి దూరంగా వెళ్లి పైకి తేలింది. అంతే…వాయువేగంతో నీటిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకుని అడవిలోకి పారిపోయింది.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by SaamTvNews (@saamtvnews)

ఇంక ఈతలో జింక వేగాన్ని అందుకోలేకపోయిన పులి నెమ్మదిగా ఈదుతూ అటూ ఇటూ చూసుకుంటూ ఉంటుంది. ఒడ్డుకు వచ్చే లోపు జింకలు కనిపించకపోవడంతో నిరాశతో వెళ్లిపోయింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. దీనిపై నెటిజన్లు కామెంట్లు వర్షం కురిపిస్తున్నారు. ‘‘ఈ జింక తెలివి మామూలుగా లేదుగా’’.. అని కొందరు, ‘‘బెటర్ లక్ నెక్ట్స్ టైమ్’’.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
వేసిన తాళాలు వేసినట్టుగానే ఉన్నాయి..కానీ బంగారం మాయం
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
'అల్లు అర్జున్‌ను టార్గెట్ చేయడం మానేయండి': టాలీవుడ్ హీరోయిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
విరాట్ ఫ్యాన్స్‌కి శుభవార్త.. లెజెండ్‌కే సూటి పెట్టిన రన్ మెషిన్
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలే.. వర్షాలు..
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
తిరుపతి, తిరుమలలో వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం ఉచిత టోకెన్ల జారీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
ఓటీటీలోకి వచ్చేసిన శివన్న లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
చెన్నై వద్దంది.. ఢిల్లీ రమ్మంది.. కట్ చేస్తే..
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
అందమైన యువతి తలపై అద్భుతమై క్రిస్మస్‌ ట్రీ..!అదిరే మేకోవర్ చూస్తే
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
బాక్సింగ్ డే టెస్ట్: డ్రామా గ్యారంటీ! డ్రా కాకుంటే చాలు..!
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..
గోల్కొండ హైస్కూల్‌ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్..