Kid Video Viral: తల్లికి సాయం చేస్తున్న బుడ్డోడు.. వయసుకి మించిన బాధ్యత చూపిస్తున్న బాలుడి వీడియో వైరల్..
ఓ బాలుడు తన షాపును కాపాడుకునేందుకు కనబరిచిన తపన లేటెస్ట్ వీడియోలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. తుఫాన్ తాకిడితో తన షాపును కాపాడుకుంటున్న బాలుడి వీడియోను మంత్రి ట్విట్టర్‌లో షేర్ చేశారు.
నాగాలాండ్ టూరిజం, ఉన్నత విద్యాశాఖ మంత్రి తెంజన్ ఇమ్న ఆలోచన రేకెత్తించే వీడియోలను పోస్ట్ చేయడంలో ఎప్పుడూ ముందుంటారు. అతని చమత్కారమైన పోస్ట్‌లు ప్రజల ముఖాల్లో చిరునవ్వుని తీసుకొస్తాయి. అయితే తెంజన్ ఇమ్న తాజా షేర్ చేసిన వీడియో అందుకు భిన్నంగా ఉంది. ఓ బాలుడు తన షాపును కాపాడుకునేందుకు కనబరిచిన తపన లేటెస్ట్ వీడియోలో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. తుఫాన్ తాకిడితో తన షాపును కాపాడుకుంటున్న బాలుడి వీడియోను మంత్రి ట్విట్టర్‌లో షేర్ చేశారు.
ఈ క్లిప్‌లో ఒక చిన్న పిల్లవాడు తన తల్లికి సహాయం చేస్తున్న దృశ్యాన్ని. తుఫాను సమయంలో తల్లికి షాపును కాపాడటంలో బాలుడు సాయం చేస్తుండటం కనిపిస్తుంది. గాలికి కుర్చీ కొట్టుకుపోవడంతో దాన్ని తీసుకువచ్చేందుకు బాలుడు పరిగెత్తడం చూడొచ్చు. వయసుకు మించిన బాధ్యతను చూపించి, పడిపోయిన కుర్చీని తిరిగి తీసుకొచ్చేందుకు పరుగెత్తాడు. చిన్న వయసులో బాలుడు తన బాధ్యతను గుర్తెరగడం ఇమ్న అలంగ్‌ను ఆకట్టుకుంది.
जिम्मेदारी समझने के लिए उम्र कि जरूरत नहीं, हालात ही सीखा देता हैं! pic.twitter.com/VdGu5saDS8
— Temjen Imna Along (@AlongImna) May 18, 2023
వయసు చిన్నగా ఉన్నా పరిస్ధితులు బాధ్యతలను నేర్పుతాయని పోస్ట్‌కు క్యాప్షన్ ఇచ్చారు. బాలుడిని ట్విట్టర్ యూజర్లు ప్రశంసల్లో ముంచెత్తారు. చిన్న వయసులోనే బాలుడు పరిపక్వతతో వ్యవహరించడం ముచ్చటేస్తోందని ఓ యూజర్ రాసుకొచ్చారు. ఇది స్ఫూర్తిదాయక వీడియో అని మరికొందరు యూజర్లు కామెంట్ చేశారు. ప్రతి దిగువ మధ్యతరగతి వ్యక్తి సంబంధం కలిగి ఉంటాడని కామెంట్ చేశాడు.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..