వీడు మనిషేనా..! భార్యతో హనీమూన్ కోసం 10 లక్షలు డిమాండ్.. తక్కువ ఇచ్చారని భార్య అసభ్యకర ఫొటోలతో బెదిరింపు..

తన భార్యను హనీమూన్‌కి తీసుకెళ్లాలంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. 10 లక్షలు ఇస్తేనే హనీమూన్‌ అని తేల్చి చెప్పాడు. దీంతో చేసేది లేక వధువు కుటుంబ సభ్యులు వరుడికి 5 లక్షల రూపాయలు ఇచ్చారు.

వీడు మనిషేనా..! భార్యతో హనీమూన్ కోసం 10 లక్షలు డిమాండ్.. తక్కువ ఇచ్చారని భార్య అసభ్యకర ఫొటోలతో బెదిరింపు..
Dowry For Honeymoon
Follow us
Surya Kala

|

Updated on: May 19, 2023 | 9:51 AM

ఇటీవల పెళ్లిళ్లలో చిత్ర విచిత్రమైన సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. వరుడు నచ్చలేదనో, వధువు డాన్స్‌ చేయలేదనో, అమ్మాయి తరపువారు అడిగిన కట్నం ఇవ్వలేదనో ఏదో ఒక కారణంతో పెళ్లి పీటలమీదే వివాహాన్ని రద్దు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఓ వరుడు కొత్తగా ఆలోచించాడు. తన అత్తింటివారినుంచి అందినంత రాబట్టుకోడానికి ఓ కంత్రీ ప్లాన్‌ ప్లే చేశాడు. ఈ కంత్రి ప్లాన్ చేసినవాడు ఉత్తర్ ప్రదేశ్ కు చెందినవాడు.. వివరాల్లోకి వెళ్తే..

ఉత్తరప్రదేశ్‌ బదయూకు చెందిన యువకుడు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఫిలిబిత్‌కు చెందిన యువతిని వివాహం చేసుకున్నాడు. కానీ వివాహం అనంతరం జరగాల్సిన కార్యక్రమాలేవీ జరగలేదు. మొదటిరాత్రినుంచే భార్యను దూరంగా ఉంచాడు. దాంతో వధువు కుటుంబసభ్యులు అతన్ని నిలదీశారు. అందుకు అతను తన భార్యను హనీమూన్‌కి తీసుకెళ్లాలంటే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. 10 లక్షలు ఇస్తేనే హనీమూన్‌ అని తేల్చి చెప్పాడు.

దీంతో చేసేది లేక వధువు కుటుంబ సభ్యులు వరుడికి 5 లక్షల రూపాయలు ఇచ్చారు. దాంతో హ్యాపీగా భార్యను హనీమూన్‌కి తీసుకెళ్లాడు. మే 7వ తేదీన భార్యను వెంటపెట్టుకుని నైనిటాల్‌కు హనీమూన్‌కి వెళ్లాడు. అక్కడ భార్యతో అభ్యంతరకర ఫోటోలు, వీడియోలు తీసి బెదిరింపులకు పాల్పడ్డాడు. తను డిమాండ్‌ చేసిన 10 లక్షల్లో మిగతా 5 లక్షలు కూడా ఇవ్వాలని, లేదంటే ఈ ఫోటోలు, వీడియోలో సోషల్‌ మీడియాలో పెడతానని బెదిరించాడు. ఓపిక నశించిన వధువు మే 13న పుట్టింటికి వచ్చి, భర్త, అత్తమామలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..