KSRTC Bus: బస్సులో గర్భిణీకి పురుడు పోసిన లేడీ కండెక్టర్.. తల్లీపిల్లా క్షేమం..
ఫాతిమా నిండుగర్భిణీ.. దీంతో బస్సు కుదుపులకు ఇబ్బంది కలగకుండా.. ఆమెను బస్సులోని ముందు సీట్లో కూర్చోబెట్టారు. అయితే ఫాతిమాకు ప్రసవ వేదన మొదలైంది. ఈ విషయాన్నీ గర్భిణీ అత్తగారు ఎవరికీ చెప్పలేదు. అయితే ఈ విషయాన్నీ మరో ప్రయాణికుడు గమనించి కండెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళాడు.
పరిస్థితులకు అనుగుణంగా స్పందించే గుణం.. ఆపదలో ఉన్న వ్యక్తికి చేతనైనంత సాయం చేయాలనే తలంపు ఉండాలే కానీ.. ఎంత కష్టమైనా ఇష్టంగా చేయవచ్చు అని నిరూపించిందో మహిళ. తన బస్సులో ప్రయిస్తున్న ప్రయాణీకురాలికి పురుటి నొప్పులు వస్తుంటే.. అంబులెన్స్ వచ్చే లోపు సాయం చేసింది. అమ్మ.. మరొక మహిళ అమ్మతనానికి సాయం చేసిన ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కెఎస్‌ఆర్‌టిసి) కండక్టర్‌గా పనిచేస్తున్న ఎస్ వసంతమ్మ బెంగళూరు నుండి చిక్కమగళూరుకు వెళ్తున్న బస్సులో విధులు నిర్వహిస్తున్నారు. 20 ఏళ్లకు పైగా సర్వీస్ ఉన్న మహిళా కండక్టర్.. బస్సులో ప్రయాణిస్తున్న మహిళ ఆపదలో పడితే.. సాయం చేసేందుకు కండక్టర్ వసంతమ్మ సిద్ధమైంది.
బెంగళూరు-చిక్కమగళూరు రూట్‌లో వెళుతున్న KA 18 F 0865 రిజిస్ట్రేషన్ నంబర్ గల బస్సులో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. 45 మందితో పాటు ఓ గర్భిణి కూడా ఉంది. హాసన్‌లోని చన్నరాయపట్నం సమీపంలో మధ్యాహ్నం 1.25 గంటలకు.. అస్సాంకు చెందిన 23 ఏళ్ల ఫాతిమాకు ప్రసవ నొప్పులు రావడం ప్రారంభించాయి.
ఫాతిమా తన అత్తగారితో కలిసి బేలూర్‌కు వెళ్ళే మార్గంలో ప్రయాణిస్తుంది. అయితే ఫాతిమా నిండుగర్భిణీ.. దీంతో బస్సు కుదుపులకు ఇబ్బంది కలగకుండా.. ఆమెను బస్సులోని ముందు సీట్లో కూర్చోబెట్టారు. అయితే ఫాతిమాకు ప్రసవ వేదన మొదలైంది. ఈ విషయాన్నీ గర్భిణీ అత్తగారు ఎవరికీ చెప్పలేదు. అయితే ఈ విషయాన్నీ మరో ప్రయాణికుడు గమనించి కండెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్ళాడు. అప్పుడు గర్భిణీ తనకు విపరీతమైన నొప్పిగా ఉందని చెప్పింది. వెంటనే డ్రైవర్‌కు బస్సు నెమ్మదిగా నడపమని చెప్పి.. ఫాతిమాను పడుకోబెట్టినట్లు కండెక్టర్ వసంతమ్మ న్యూస్9తో చెప్పారు.
సమీపంలో ఆసుపత్రులు లేవు. బస్సు ఆపిన ప్రదేశానికి దాదాపు 10 కిలోమీటర్ల దూరంలో శాంతిగ్రామలో ఆస్పత్రి ఉంది. దీంతో “ప్రయాణికులు బస్సు దిగారు. అప్పుడు కండక్టర్ వసంతమ్మ, గర్భిణీ అత్తగారితో కలిసి బస్సులోనే ప్రసవించేలా ఫాతిమాకు సహకరించారు. అప్పటికే అంబులెన్స్‌కి ఫోన్ చేశారు.. ఇంట్లో ఫాతిమాకు పండంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. డెలివరీ జరిగిన 15 నిమిషాలకు అంబులెన్స్ సంఘటన స్థలానికి చేరుకుంది. తర్వాత తల్లీపిల్లను అంబులెన్స్‌లో ఎక్కించి ఆస్పత్రికి తరలించినట్లు చెప్పింది వసంతమ్మ. తర్వాత ఇతర ప్రయాణీకుల సాయంలో బస్సును శుభ్రంచేసి.. శాంతిగ్రామ ఆసుపత్రికి చేరుకున్నారు.
గర్భిణీకి ఏదైనా సాయం చేయాలనీ.. ప్రయాణీకులు ఇచ్చిన మొత్తం రూ. 1,500లు ఫాతిమాకు అందజేసి.. మళ్ళీ బస్సు తన గమ్యస్థానికి చేరుకోవడానికి బయలు దేరినట్లు చెప్పారు వసంతమ్మ.
గత శిక్షణ వసంతమ్మకు సహాయపడింది 52 ఏళ్ల వసంతమ్మ కెఎస్‌ఆర్‌టిసిలో కండక్టర్‌గా చేరడానికి ముందు, ఆమె తన స్వగ్రామమైన చిక్కమగళూరులోని అన్నపూర్ణ నర్సింగ్‌హోమ్‌లో ఒక వైద్యుడి వద్ద సహాయకురాలిగా నెల రోజుల పాటు శిక్షణ పొందారు. అది ఇప్పుడు పనికి వచ్చిందని చెప్పారు.
గర్భిణీకి సాయం చేసి తల్లీపిల్ల ప్రాణాలను కాపాడిన వసంతమ్మను త్వరలో సన్మానించనున్నామని KSRTC అధికారి చెప్పారు. వసంతమ్మని మేనేజింగ్ డైరెక్టర్ జి సత్యవతి ప్రశంసించారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..