Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sudha Murthy: హీరో అనుకుంటే పిల్లాడిలా కనిపించిన మూర్తి.. మొదటి పరిచయం అదే అంటున్న సుధామూర్తి

ఈ షోకి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో కపిల్ శర్మ నారాయణ మూర్తిని మొదటిసారి ఎప్పుడు కలిశారని అడిగిన ప్రశ్నకు సుధామూర్తి సమాధానంగా .. ఓ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారని చెప్పారు. తన ఫ్రెండ్ ప్రసన్న రోజూ ఓ పుస్తకం తెచ్చేవాడు. ఆ పుస్తకంలో నారాయణమూర్తి పేరుతో సహా అనేక ప్రాంతాల పేర్లు ఉన్నాయి.

Sudha Murthy: హీరో అనుకుంటే పిల్లాడిలా కనిపించిన మూర్తి.. మొదటి పరిచయం అదే అంటున్న సుధామూర్తి
narayana murthy sudha murthy
Follow us
Surya Kala

|

Updated on: May 11, 2023 | 10:11 AM

చాలా మంది బతికేస్తుంటారు.. కొందరే జీవిస్తుంటారు.. ఎలా జీవించే వ్యక్తుల్లో ఒకరు సుధా మూర్తి. తన ఆదాయాన్ని పేదలచదువుకు, అనాథలకు, ధార్మిక కార్యక్రమాలకు ఖర్చు చేసే మంచి మనసున్న సుధామూర్తి తన భర్తతో తొలి పరిచయాన్ని వెల్లడించారు. ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తిని తాను ఎలా కలిశానో ఆయన భార్య, ప్రముఖ రచయిత్రి సుధా మూర్తి వెల్లడించారు. నారాయణమూర్తి, సుధామూర్తిల పెళ్లి జరిగి 44 ఏళ్లు అయింది. ఈ దంపతులకు అక్షతా మూర్తి, కుమారుడు రోహన్ ఉన్నారు. అయితే తాను పెళ్లికి ముందు తన భర్త  సినిమా హీరోలా ఉంటానని ఊహించుకున్నానని.. అలా జరగలేదని.. ప్రముఖ బాలీవుడ్ టాక్ షో ది కపిల్ శర్మ షోలో సుధామూర్తి వెల్లడించారు. ఈ షోలో సుధామూర్తితో పాటు బాలీవుడ్ నటి రవీనా టాండన్, నిర్మాత గునీత్ మోంగా కూడా పాల్గొన్నారు. ఈ షోలో సుధామూర్తి.. తన వైవాహిక, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ఆసక్తికర విషయాలను చెప్పారు.

ఈ షోకి సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేశారు. ఇందులో కపిల్ శర్మ నారాయణ మూర్తిని మొదటిసారి ఎప్పుడు కలిశారని అడిగిన ప్రశ్నకు సుధామూర్తి సమాధానంగా .. ఓ ఫ్రెండ్ ద్వారా పరిచయం అయ్యారని చెప్పారు. తన ఫ్రెండ్ ప్రసన్న రోజూ ఓ పుస్తకం తెచ్చేవాడు. ఆ పుస్తకంలో నారాయణమూర్తి పేరుతో సహా అనేక ప్రాంతాల పేర్లు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

సుధా మూర్తి పేరు పక్కన పెషావర్, ఇస్తాంబుల్ వంటి అనేక దేశాల పేర్లు చూసి.. తాను నారాయణమూర్తి ఇంటర్నేషనల్ బస్ కండక్టర్ ఏంటి అని అనుకున్నానని చెప్పారు. ఒకరోజు తాను నారాయణ మూర్తిని కలవడానికి వెళ్లానని.. అయితే కలవడానికి ముందుకు అతను సినిమాలో హీరోలా అందంగా ఉంటాడని ఊహించుకున్నానని.. అదే ఊహతో మూర్తి ఇంటికి వెళ్లానని చెప్పారు. అయితే అతని ఇంటికి వెళ్లి తలుపు కొట్టినప్పుడు.. తలుపులు తెరిచిన వ్యక్తిని చూసి షాక్ తిన్నని.. ఎందుకంటే హీరో అని అనుకుంటే.. ఒక చిన్న పిల్లాడు కనిపించారు అంటూ అలనాటి సంఘటనను.. తన భర్త సుధామూర్తితో కలిగిన మొదటి పరిచయాన్ని గుర్తు చేసుకున్నారు సుధామూర్తి..

సుధామూర్తి చెప్పిన విషయాలను విన్న రవీనా టాండన్, కపిల్, గునీత్ అందరూ నవ్వేశారు. ఈ షోకి సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ ఈ వారంలో ప్రసారం కానుంది. తమ అభిమాన సుధా మూర్తిని తెరపై చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రోమోకి తమ కామెంట్స్‌లో తమ హర్షాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..