ACB Raids: రైతు నుంచి లంచం తీసుకున్న సబ్ రిజిస్ట్రార్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు

రైతు నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు అధికారులు. ప్రకాశం జిల్లా కంభం సబ్ రిజిస్టర్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు మెరుపుదాడులు చేశారు.

ACB Raids: రైతు నుంచి లంచం తీసుకున్న సబ్ రిజిస్ట్రార్.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
Acb Raids
Follow us

|

Updated on: May 11, 2023 | 6:41 AM

బల్లకింద చేయిపెట్టడం.. ఇష్టానుసారంగా దోచుకోవడం.. ఇదే కొంత మంది అధికారుల తీరు. కోట్ల రూపాయలు తినేసిన.. అవినీతి అనకొండలుగా మారుతున్న వారందరిపై నిఘా పెడుతోంది ఏసీబీ. ఏపీలో కొన్ని రోజులుగా జరుగుతున్న ఏసీబీ దాడులు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. నోట్ల కట్టలు.. అక్రమ ఆస్తుల చిట్టా బయటకు తెస్తుంది ఏసీబీ. ప్రకాశం జిల్లాలో ఏసీబీ అధికారులు మెరుపుదాడులు చేశారు. 205 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసేందుకు ఓ రైతు వద్ద నుండి 15వేల రూపాయలు లంచం తీసుకుంటూ సబ్ రిజిస్ట్రార్ శ్రీరామ్ మూర్తి, డాక్యుమెంట్ రైటర్ రాము రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులకు దొరికి పోయారు. ఈ ఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని కంభం రిజిస్టార్ ఆఫీసులో జరిగింది.

కందులాపురం గ్రామానికి చెందిన సాగం కృష్ణ రంగారెడ్డి అనే రైతు ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు. తన భార్య పేరున ఉన్న 205 గజాల స్థలాన్ని రిజిస్ట్రేషన్ కోసం రిజిస్టార్ ను కలిశారు రైతు సాగం కృష్ణారెడ్డి. నిర్మోహమాటంగా 40 వేల రూపాయలు లంచం సబ్ రిజిస్ట్రార్ డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులకు కంప్లైంట్ చేశాడు రైతు. రిజిస్టార్, డాక్యుమెంట్ రైటర్ లంచం డిమాండ్ చేస్తున్నారని 40 వేలు లంచం అడిగారని చివరికి 15 వేల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏసీబీ అధికారులతో రైతు తెలపడంతో.. దాడులు చేసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్లు ఏసీబీ డీఏస్పీ ప్రతాప్ కుమార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
సెల్ఫీలు, అప్యాయ పలకరింపులు.. పాదయాత్రను గుర్తు చేస్తున్న జగన్‌
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
238 సార్లు చిత్తుగా ఓడిన ఎలక్షన్ కింగ్.. అయినా మళ్లీ పోటీ
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
రోహిత్‌తో ప్రత్యేకంగా మాట్లాడిన ఆకాశ్ అంబానీ.. మళ్లీ కెప్టెన్సీ!
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
30 ఏళ్ల కష్టం ఫలించిన వేళ.. భావోద్వేగానికి గురైన భూపతి రాజు..
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
పెరిగిపోతున్న చికెన్ పాక్స్.. ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
మార్కెట్‌కు ఎంఐ ఎలక్ట్రిక్ కిక్..ఆ కారు బుకింగ్స్ ఓపెన్
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
గురూజీ.. ఆ టాప్ హీరోలతో మల్టీస్టారర్ సినిమా చేయబోతున్నారా
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా.. ఆమె చాలా ఫెమస్ గురూ
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
ఉన్నట్టుండి బరువెక్కిన చేపల వల.. తీరా చిక్కింది చూస్తే..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..
రోజుకో స్పూన్ తేనె తీసుకుంటే ఇంత మంచిదా..