AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: పాలకవర్గం వర్సెస్ ప్రతిపక్షం.. టీటీడీ భగవద్గీత పుస్తకాలపై బిగ్ ఫైట్!

టీటీడీలో ఇప్పుడు మరో వివాదం హాట్ టాపిక్ అయ్యింది. భగవద్గీత పై రాజకీయ దుమారం కొనసాగుతోంది. పాలక పక్షాలు, ప్రతిపక్షాలే కాదు స్వామీజీలు కూడా సవాళ్లు ప్రతి సవాళ్లు, విమర్శలకు దిగడంతో భగవద్గీతపై బిగ్ ఫైట్ నడుస్తోంది.భగవద్గీత 18 అధ్యాయాల పవిత్ర గ్రంథం. నిత్య జీవితంలో ధర్మం, కర్తవ్యం, భక్తి, జ్ఞాన మార్గాలను బోధిస్తూ, మనిషిలోని అజ్ఞానాన్ని తొలగించేదిగా పరిగణించే మహా గ్రంధం. అలాంటి గ్రంధాన్ని సరళ భాషలో చిన్న పుస్తకంగా విద్యార్థులకు అందజేయాలని టిటిడి భావించింది. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా మానవులందరికీ భగవద్గీత పేరుతో 34 పేజీల పుస్తకాన్ని హిందూ ధర్మ ప్రచార పరిషత్ ద్వారా ముద్రించింది.

Tirumala: పాలకవర్గం వర్సెస్ ప్రతిపక్షం.. టీటీడీ భగవద్గీత పుస్తకాలపై బిగ్ ఫైట్!
TTD Bhagavad Gita Controversy
Raju M P R
| Edited By: |

Updated on: Mar 13, 2026 | 7:09 PM

Share

భగవద్గీత గ్రంథంలోని సారాంశాన్ని చిన్న పుస్తకంగా తయారుచేసి పాఠశాల విద్యార్థులకు పంపించాలని టీటీడీ సంకల్పించింది. ఈ మేరకు రూ. 3.71 కోట్లను కేటాయించింది. మొదటి దశలో 52.95 లక్షల పుస్తకాల ముద్రనకు దాదాపు రూ.2 కోట్ల ఖర్చు చేసింది. యువతకు సులభంగా అర్థమయ్యే విధంగా భగవద్గీత సారాన్ని సరళమైన భాషలో పుస్తకంగా ప్రచురించే ప్రయత్నం అప్పటి పాలకమండలి చేసింది. టీటీడీ మాన్యువల్ ప్రకారమే భగవద్గీత పుస్తకాలు స్టూడెంట్స్ కు పంపిణీ చేయాలని ప్రయత్నం చేసినా.. ఇప్పటికీ విద్యార్థులకు చేరకుండా మూలన పడటమే ఇప్పుడు రాజకీయ రచ్చకు కారణం అయ్యింది.

లుగుతో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళ్, కన్నడ భాషల్లో 52.95 లక్షల పుస్తకాలను అప్పటి పాలక మండలి ముద్రించింది. 34 పేజీల భగవద్గీత పుస్తకంలో పబ్లిషర్ గా అప్పటి ఈవో ధర్మారెడ్డి, ముందుమాట రాసిన అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్లు ఉండడం, ఇప్పటికీ 35 లక్షల దాకా పుస్తకాలు అలాగే మిగిలిపోవడంతో ఇప్పుడు భగవద్గీత పై బిగ్ ఫైట్ నడుస్తోంది. భగవద్గీత సారాన్ని చిన్న పుస్తకంగా అందించిన అప్పటి పాలకమండలి తీరును తప్పు పట్టిన ప్రస్తుత టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు.. భగవద్గీతలో ఏముందని కామెంట్ చేయడం చర్చగా మారింది. భగవద్గీత పేరుతో రూ. 50 కోట్లు కొట్టేసారని బిఆర్ నాయుడు భూమన కరుణాకర్ రెడ్డిపై విమర్శలు చేశారు.

భగవద్గీతలో ఏముంటుందో తెలియదా: భూమన 

టీటీడీ చైర్మన్ గా బిఆర్ నాయుడు భగవద్గీతపై చేసిన కామెంట్స్‌కు వైసీపీ కౌంటర్ ఇవ్వడంతో పొలిటికల్ ఇష్యూగా మారి పోయింది. 700 శ్లోకాలతో 1700 పేజీలు పైనేభగవద్గీత ఉందని, 3 నుంచి 10 తరగతి విద్యార్థులు అందరికీ పంపిణీ చేసేందుకు ముగ్గురు పండితుల పర్యవేక్షణలో సులభతరమైన భాషలో భగవద్గీత సారాంశాన్ని తీసుకోవచ్చామన్నారు భూమన కరుణాకర్ రెడ్డి. టిటిడి విడుదల చేసే ఏ పుస్తకమైన ఈవో, చైర్మన్ ముందు మాటగా ప్రచురించడం సంప్రదాయమన్నారు. భగవద్గీతను అవమాన పరిచేలా మాట్లాడుతున్న బిఆర్ నాయుడుకు భగవద్గీత సారాంశమేమి తెలుసంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి.

టీటీడీలో అతిపెద్ద స్కామ్ భగవద్గీత పుస్తకాలదే: కూటమి 

ఇక భగవద్గీత పుస్తకంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న కూటమి నేతలు ఇది టిటిడి చరిత్ర లోనే అతి పెద్ద స్కాం అంటున్నారు. 700శ్లోకాలతో భగవద్గీత ఉంటే 50 గ్రాముల బరువు కూడా లేని భగవద్గీత పుస్తకాన్ని వైసీపీ హయంలో ముద్రించారని ఆరోపిస్తున్నారు. టిటిడి ముద్రించింది కరుణాకర్ రెడ్డి, ధర్మారెడ్డిలు రాసిన భగవద్గీతలా ఉందని, భగవద్గీత ముద్రించి వారి పేర్లు వేసుకోవడం టిటిడి చరిత్రలో ఎప్పుడూ జగరలేదని విమర్శిస్తున్నారు. ఈ ఇద్దరు కవులకు సన్మానం చేయాలన్నారు. భగవద్గీత బాగోతాన్ని బయటపెట్టినందుకే టిటిడి ఛైర్మన్ ను టార్గెట్ చేశారన్నారు జనసేన నేత కిరణ్ రాయల్. భగవద్గీతను సరళమైన భాషలో చిన్న పుస్తకంగా తీసుకురావడం మంచిదైనా భూమన హయాంలో పుస్తక ప్రసాదం పేరుతో రూ. కోట్లలో దుర్వినియోగం చేసిన మాట వాస్తవం కాదా అంటున్నారు టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు ఓవి రమణ. గతంలో ఊపయోగం లేని పుస్తకాలు పంపిణి చేయడం ద్వారా రూ. కోట్లలో అవినీతికి పాల్పడలేదా అని ప్రశ్నిస్తున్నారు. శ్రీవారి సొమ్ముతో ముదిరించిన భగవద్గీత పుస్తకాలను నిరుపయోగంగా ఉంచడానికి తప్పు పడుతున్నారు ఓవి రమణ.

హిందూ ధర్మం పై మాట్లాడితే ఎదురు దాడి చేస్తారా శ్రీనివాసానంద.

ఇలా భగవద్గీత పై రాజకీయ రచ్చ నడుస్తుండగానే ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద స్పందించడంతో మరింత చర్చకు దారి తీసింది. శ్రీనివాస నంద టిడిపి జెండా పట్టుకుని కార్యకర్తల మాట్లాడుతున్నారంటూ భూమన చేసిన కామెంట్స్ తో ఇష్యూ కాస్తా భూమన వర్సెస్ స్వామీజీలుగా మారిపోయింది.భూమన చేసిన కామెంట్స్ పై కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసిన ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డితో సై అంటే సై అన్నట్టుగా హాట్ కామెంట్స్ చేశారు. హిందూ ధర్మం కోసం మాట్లాడుతుంటే రాజకీయాలను ఆపాదిస్తున్నారని ఆరోపించారు. తమకు ఏ పార్టీతో సంబంధం లేదని.. తప్పు ఎవరు చేసినా ఖండిస్తామన్నారు.కరుణాకర్ రెడ్డి లా ఆస్తులపై కోరికలు లేవని సాధు జీవితం గడుపుతున్నా మన్నారు. కరుణాకర్ రెడ్డి హయంలో టీటీడీ భగవద్గీతను ముద్రించి అపహాస్యం చేశారన్నారు. భగవద్గీత ముద్రణలో తప్పు జరిగిందని క్షమాపణ చెప్పాలని కోరితే ఎదురుదాడి చేయడం తగదన్నారు ఏపీ సాధు పరిషత్ అధ్యక్షుడు శ్రీనివాసానంద.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us