AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్..

బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు, గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది.

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఇదిగో 3రోజుల వెదర్ రిపోర్ట్..
Ap Rain Alert
Shaik Madar Saheb
|

Updated on: Jul 16, 2026 | 1:43 PM

Share

వర్షాలపై వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది.. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం.. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉన్న నిన్నటి అల్పపీడనం, ఈ రోజు, జూలై 16, 2026, ఉదయం 0830 గంటలకు (భారత కాలమానము ప్రకారము) అదే ప్రాంతంలో బలమైన అల్పపీడన ప్రాంతంగా మారింది. దీని అనుబంధ ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి, ఎత్తు పెరిగే కొద్దీ నైరుతి దిశగా వంగి ఉంది.ఇది రాబోయే 2 రోజులలో ఉత్తర ఒడిశా, గంగానది పశ్చిమ బెంగాల్ మీదుగా వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉంది. సగటు సముద్ర మట్టం వద్ద ఉన్న రుతుపవన ద్రోణి ఇప్పుడు జమ్మూ, బరేలీ, బస్తీ, డాల్టన్‌గంజ్, వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాల మీదుగా ఉన్న బలమైన అల్పపీడన ప్రాంత కేంద్రం గుండా ప్రయాణించి, అక్కడి నుండి తూర్పు-ఆగ్నేయ దిశగా ఈశాన్య బంగాళాఖాతం వైపు కదులుతుంది.

వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న ఉత్తర ఒడిశా – పశ్చిమ బెంగాల్ తీరాలపై ఏర్పడిన బలమైన అల్పపీడన ప్రాంతంతో సంబంధం ఉన్న ఉపరితల ఆవర్తనం నుండి తూర్పు మధ్య అరేబియా సముద్రం మీదుగా కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర వరకు సగటు సముద్ర మట్టానికి 5.8 నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉంది.

వీటి ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ సూచనలు:-

ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ – యానాం :

గురువారం భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్నిచోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది.

శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రదేశ్ :-

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది.

శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40-50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది.

రాయలసీమ:-

గురువారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వడగాలులు ఒకటి లేదా రెండు చోట్ల వీచే అవకాశముంది.

శుక్రవారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 40 -50 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడే అవకాశముంది.

శనివారం తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. బలమైన గాలులు గంటకు 30-40 కిలోమీటర్ల వేగముతో వీచే అవకాశముంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
శుభ గ్రహాల అనుకూలత..వారికి పెట్టుబడులకు బెస్ట్ టైమ్ ఇదే..!
శుభ గ్రహాల అనుకూలత..వారికి పెట్టుబడులకు బెస్ట్ టైమ్ ఇదే..!
నాకు బిగ్ బాస్ అంటే పిచ్చి..
నాకు బిగ్ బాస్ అంటే పిచ్చి..
కుంభ రాశి జీవితంలో ఊహించని మార్పు.. ఇది దేనికి సంకేతమో తెలుసా?
కుంభ రాశి జీవితంలో ఊహించని మార్పు.. ఇది దేనికి సంకేతమో తెలుసా?
బాబా వంగా జ్యోతిష్యం..శ్రావణ మాసంలో తలరాత మార్చుకునే రాశులివే!
బాబా వంగా జ్యోతిష్యం..శ్రావణ మాసంలో తలరాత మార్చుకునే రాశులివే!
పిల్లలు బాత్రూంలో ఎక్కువసేపు ఉంటున్నారా? తిట్టొద్దు.. ఏం చేయాలంటే
పిల్లలు బాత్రూంలో ఎక్కువసేపు ఉంటున్నారా? తిట్టొద్దు.. ఏం చేయాలంటే
‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..
‘రామాయణ’ కోసం మేకర్స్ కొత్త ప్రమోషనల్ ప్లాన్..
ఆ ఇద్దరే డేంజర్.. 2వ వన్డేలో మా టార్గెట్ వాళ్లే..: హ్యారీ బ్రూక్
ఆ ఇద్దరే డేంజర్.. 2వ వన్డేలో మా టార్గెట్ వాళ్లే..: హ్యారీ బ్రూక్
పవర్ ప్లాంట్‌లో జాబ్ వదిలేసి జబర్దస్త్‌లోకి..ఇప్పుడు బిగ్‌బాస్‌కు
పవర్ ప్లాంట్‌లో జాబ్ వదిలేసి జబర్దస్త్‌లోకి..ఇప్పుడు బిగ్‌బాస్‌కు
ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
ఉల్లిపాయలు కోసేటప్పుడు ఏడవకుండా ఉండాలంటే ఇలా చేయండి..!