Andhra Pradesh: రోజు తాగివచ్చి అమ్మని కొడతాడు.. తండ్రికి బుద్ధిచెప్పమని ఎస్సై‌కు ఓ బుడ్డోడు ఫిర్యాదు..

మా నాన్న తాగొచ్చి రోజు మా అమ్మను కొడుతున్నాడు. మా అమ్మ ఎంత బ్రతిమిలాడినా వినటం లేదు. ప్రతి రోజు ఇదే విధంగా చేస్తున్నాడు. అందుకే పోలీసులకు చెప్పటానికి వచ్చాను.. తన తండ్రిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారిని కోరాడు.

Andhra Pradesh: రోజు తాగివచ్చి అమ్మని కొడతాడు.. తండ్రికి బుద్ధిచెప్పమని ఎస్సై‌కు ఓ బుడ్డోడు ఫిర్యాదు..
bapatla boy complaint on his father
Follow us

|

Updated on: May 05, 2023 | 8:58 AM

తండ్రి తాగొచ్చి తల్లిని కొట్టడాన్ని కొడుకు చూడలేకపోయాడు. ప్రతి రోజు తండ్రి చేస్తున్న న్యూసెన్స్ భరించలేని కొడుకు పోలీసులను ఆశ్రయించాడు. కన్న తల్లి కష్టంపై స్పందించిన ఆ కొడుకు వయస్సెంత అనుకుంటున్నారు. తొమ్మిదేళ్ళు. ఆశ్చర్యం కలిగించే ఈ ఘటనకు వేదికగా మారింది బాపట్ల జిల్లాలోని ఓ పోలీసు స్టేషన్. అవును జిల్లాలోని కర్లపాలెం మండలం ఇస్లాం పేట పోలీసు స్టేషన్ లో వింత ఫిర్యాదు వచ్చింది. గ్రామానికి చెందిన ఓ తొమ్మిదేళ్ళ బాలుడు రహీమ్‌ కర్లపాలెం పిఎస్ కు వెళ్ళాడు. ఎస్సై శివయ్య బాలుడిని పిలిచి ఎందుకొచ్చావని ప్రశ్నించాడు. మా నాన్న తాగొచ్చి రోజు మా అమ్మను కొడుతున్నాడు. మా అమ్మ ఎంత బ్రతిమిలాడినా వినటం లేదు. ప్రతి రోజు ఇదే విధంగా చేస్తున్నాడు. అందుకే పోలీసులకు చెప్పటానికి వచ్చాను.. తన తండ్రిపై చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారిని కోరాడు. ఆ బాలుడి ధైర్యానికి పోలీసులు షాక్ తిన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.

రహీమ్ తండ్రి సుభాని రైస్ మిల్లులో పనిచేస్తూనే.. మిషన్ కుడతాడు. తల్లి సుభాంబీ ఇంట్లోనే ఉంటుంది. మద్యానికి బానిసైన సుభానీ రోజు మద్యం తాగి ఇంటికి వచ్చి భార్య సుభాంబీని వేధించేవాడు. ఇది చూసిన రహీమ్ .. తండ్రికి బుద్ధి చెప్పమంటూ పోలీసులను ఆశ్రయించాడు. బాలుడు ఫిర్యాదుతో స్పందించిన ఎస్సై శివయ్య రహీమ్ తల్లిదండ్రులిద్దరిని పోలీసు స్టేషన్ కు పిలిపించారు. భార్యాభర్తలిద్దరినీ మందలించడంతో పాటు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మళ్ళీ ఇలాంటి ఘటన చోటు చేసుకుంటే.. చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించి పంపించేశారు. ఈ ఘటన బాలుడి సాహసం.. తల్లిపై ప్రేమ స్థానికంగా  చర్చనీయాంశమైంది.

Reporter: T. Nagaraju, TV 9 Telugu

ఇవి కూడా చదవండి