Indrakeeladri: మంత్రులు మారుతున్నప్పుడల్లా మారుతున్న ఇంద్రకీలాద్రి అభివృద్ధి మాస్టర్ ప్లాన్.. రీ డిజైన్ కోసం మళ్ళీ లక్షల్లో ఖర్చు

గత దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి సహాయం లో సిద్ధం చేశారు. కానీ మళ్ళీ మంత్రి కొట్టు సత్యనారాయణ వచ్చాక మళ్లీ మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేశారు.. ప్లాన్ మార్పు రీ డిజైన్ కోసం మళ్ళీ 25 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇలా మంత్రులు మారుతున్నపుడల్ల ప్లాన్ మారడం తో మాస్టర్ ప్లాన్.. ప్లాన్ లానే ఉండిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

Indrakeeladri: మంత్రులు మారుతున్నప్పుడల్లా మారుతున్న ఇంద్రకీలాద్రి అభివృద్ధి మాస్టర్ ప్లాన్.. రీ డిజైన్ కోసం మళ్ళీ లక్షల్లో ఖర్చు
Kanaka Durga Temple
Follow us

|

Updated on: May 05, 2023 | 7:18 AM

బెజవాడ దుర్గమ్మ ఇంద్రకీలాద్రి పై భక్తుల సౌకర్యార్థం మాస్టర్ ప్లాన్.. దీనికోసం 2016 నుండి ఎన్నో మార్పులు, చేర్పులు.. ఉన్న 18 ఏకరలా స్థలం లో భక్తులకు మెరుగైన సౌకర్యాలు.. ఎలివేటెడ్ క్యూ లైన్స్, మల్టీ లెవెల్ మెకనైజడ్ పార్కింగ్ ప్లేస్, అమ్మ సన్నిధానం లోనే ప్రసాదం పోటు, అన్న ప్రసాదం తయారీ కి సెపరేట్ బిల్డింగ్లు ఇలా ఎన్నో సదుపాయాలు.వింటుంటే నే అహ్హ అని అనిపిస్తుంది కదా.. కానీ ఇవన్నీ ఎప్పుడు జరగాలి.. గత 7 సంవత్సారాలుగా పాలకులు, అధికారులు విపరీతమైన కసరత్తులు చేస్తున్న.. ఎందుకు అడుగు కూడా ముందుకు పడటం లేదు..లోపం ఎక్కడ? తప్పిదం ఎవరిది? ఆలస్యానికి కారణం ఏంటి?

అమ్ములు గన్న అమ్మ దుర్గమ్మని దర్శించుకుంటే పాపాలు తొలగి జీవితాలు బాగుపడతాయని అనేక మంది  నమ్మకం. అలా దుర్గమ్మని దర్శించడానికి ఇతర రాష్ట్రాల నుంచి ఇంద్రకీలాద్రి క్యూ కడుతుంటారు. దసరా రోజుల్లో అయితే దుర్గమ్మను రోజు లక్షల్లో భక్తులు దర్శించుకుంటారు. తిరుమలలో నిత్యం సుమారు 60 వేల మంది కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటుండగా, ఇంద్రకీలాద్రిలో వెలసిన ఆదిశక్తి  కనకదుర్గమ్మను దాదాపు 30 వేల మంది వరకు నిత్యం దర్శించుకుంటున్నారు. దీనితో పెరిగిన భక్తులకు రద్దీకి అనుగుణంగా సౌకర్యాలను ఏర్పాటు చేయడంతోపాటు ఆలయ పరిసరాల అభివృద్ధి తప్పనిసరి అయింది. 2020 దసరా రోజున సీఎం పట్టు వస్త్రాలు సమర్పించే సమయానికి ముందు కొండ చర్యలు విరిగిపడడంతో ఆరోజే ఇంద్రకీలాద్రి అభివృద్ధికి 70 కోట్ల నిధులను మంజూరు చేశారు. అందులో ఇప్పటికే మూడు కోట్ల రూపాయలు శివాలయం నిర్మాణానికి ఖర్చు చేశారు.

మొదట హైదరాబాద్‌కు చెందిన క్రియోటా సొల్యూషన్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌, మారుతీ మేనేజ్‌మెంట్‌ కన్సల్టెన్సీ ఈ మాస్టర్‌ప్లాన్‌ తయారు తయారు చేసినా.. కొన్ని కారణాల వల్ల అవి పక్కకు వెళ్లాయి. తరువాత ఢిల్లీకి చెందిన సి.బి.అర్.ఈ సౌత్ ఏషియా ప్రైవేట్ లిమిటెడ్ ఇచ్చిన సర్వే ప్రకారం నమూనా గత దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి సహాయం లో సిద్ధం చేశారు. కానీ మళ్ళీ మంత్రి కొట్టు సత్యనారాయణ వచ్చాక మళ్లీ మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేశారు.. ప్లాన్ మార్పు రీ డిజైన్ కోసం మళ్ళీ 25 లక్షలు ఖర్చు పెడుతున్నారు. ఇలా మంత్రులు మారుతున్నపుడల్ల ప్లాన్ మారడం తో మాస్టర్ ప్లాన్.. ప్లాన్ లానే ఉండిపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

ఇప్పటికీ మాస్టర్ ప్లాన్ లో శివాలయం పనులు తప్ప ఇతర పనులు ఏమి ప్రారంభం కాలేదు. ఇందులో అన్నదాన భవన నిర్మాణానికి 30 కోట్లు ,ప్రసాదం పోటు తయారీ భవనానికి 27 కోట్లు కోసం కొత్తగా టెండర్లు మళ్ళీ పిలవడంతో అదే కాంట్రాక్ట్ దక్కించుకున్న పాత కాంట్రాక్టర్లు తమ పరిస్థితి ఏంటని ప్రశ్నించడంతో మళ్ళీ కథ మొదటికి వచ్చింది. ఏది ఏమైనా వచ్చే దసరాకి మాస్టర్ ప్లాన్ పనులు 90 శాతం కంప్లీట్ చేస్తామని దుర్గ గుడి అభివృధికి సీఎం ప్రత్యేక శ్రద్ద పెట్టారని..వచ్చే 30 ఏళ్లలో ఆలయానికి వచ్చే భక్తుల రద్దీని అంచనా వేస్తూ ప్రస్తుతం వస్తున్న భక్తులకు మరింత మెరుగైన సౌకర్యాలను శాశ్వత ప్రాతిపదికన సమకూర్చేందుకు ఈ ప్లాన్ వర్కౌట్ చేస్తున్నట్లు పాలక మండలి చైర్మన్ కర్నాటి రాంబాబు అంటున్నారు.

ఇప్పటికైనా మాస్టర్ ప్లాన్ ను ఫైనల్ చేసి దానికి ఒక జీ.ఓ ఇచ్చి.. పాలకులు మారినా, అధికారులు మారినా మాస్టర్ ప్లాన్ లో మార్పులకు అవకాశం లేకుండా చేస్తే తప్ప పనులు పరుగులు పెడతాయి లేకుంటే ఎన్ని దసరాలు వెళ్ళినా మాస్టర్ ప్లాన్ ప్లాన్ లానే కాగితాలకే పరిమితం అవుతుంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles