Lucky Zodiacs: శుక్రవారమే బుద్ధపూర్ణిమ, చంద్రగ్రహణం.. ఈ కలయికతో అమితంగా లాభపడనున్న రాశులివే..
Buddha Purnima 2023: బుద్ధుడు జన్మంచిన రోజును బుద్ధ పౌర్ణమిగా ప్రతి ఏటా వైశాఖ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథి రోజున జరుపుకుంటారు. గౌతమ బుద్ధుని 2585వ జయంతి సందర్భంగా ఈ ఏడాది జరుపుకునే పౌర్ణమి మే..
Buddha Purnima 2023: బుద్ధుడు జన్మంచిన రోజును బుద్ధ పౌర్ణమిగా ప్రతి ఏటా వైశాఖ మాసంలోని శుక్ల పక్ష పౌర్ణమి తిథి రోజున జరుపుకుంటారు. గౌతమ బుద్ధుని 2585వ జయంతి సందర్భంగా ఈ ఏడాది జరుపుకునే పౌర్ణమి మే 5న వచ్చింది. అయితే అదే రోజున ఈ ఏడాదిలోని మొదటి చంద్రగ్రహణం కూడా వచ్చింది. ఇక్కడ మరో విశేషం ఏమిటంటే.. బుద్ధ పూర్ణిమ, చంద్ర గ్రహణం రెండూ కూడా లక్షీదేవికి అంకితం చేసిన శుక్రవారం రోజునే వచ్చాయి. దీంతో రాశిచక్రంలోని 4 రాశులవారు అమితంగా లాభపడనున్నాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మరి ఆ అదృష్టవంతమైన రాశులేమిటో ఇప్పుడు చూద్దాం..
మేష రాశి: బుద్ధ పూర్ణిమ కారణంగా మేష రాశి వారు ఎన్నో ప్రయోజనాలను అందుకోనున్నారు. ఈ రాశి వారికి వ్యాపారాభివృద్ధి, కొత్త ఉద్యోగ అవకాశం, ఉద్యోగంలో పదోన్నతి కలగనున్నాయి. ఈ సమయంలో మేషరాశివారు తలపెట్టిన అన్ని పనుల్లోనూ శుభ ప్రయోజనాలను పొందుతారు.
మిథున రాశి: మిథున రాశి వారికి కూడా ఈ బుద్ధ పూర్ణిమ-చంద్రగ్రహణం శుభప్రదమైన ఫలితాలను ఇవ్వబోతున్నాయి. ఈ సమయంలో మిథున రాశివారికి ఏందులోనైనా విజయం సాధించేందుకు అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగ-వ్యాపారాలలో పురోగతి, ఊహించని ఆదాయ మార్గాలు తెరుచుంటాయి.
సింహ రాశి: ఈ బుద్ధ పూర్ణిమ సింహ రాశి వారికి కూడా శుభప్రదంగా ఉండబోతోంది. కోర్టు వివాదాల్లో విజయం, తలపెట్టిన ప్రతిపనిలో సానుకూలమైన ఫలితాలు, వ్యాపారులకు అధిక లాభాలు లభిస్తాయి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Note: (ఇక్కడ ఇచ్చిన సమాచారం నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది.. దీనికి శాస్త్రీయ ఆధారాలు లేవు. మనుషుల ఆసక్తిని నమ్మకాన్ని దృష్టిలో ఉంచుకుని ఇక్కడ అందించాం).