AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: మామిడిని ఇలా తీసుకుంటేనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు.. పైగా క్యాన్సర్, గుండెపోటుకు చెక్..

వేసవిలో ఎక్కువగా లభించే మామిడి కూడా ఆరోగ్యానికి మంచిదేనని వివరిస్తున్నారు. సాధారణంగా మామిడికాయ అనే పేరు వినగానే చాలా మందికి నోరు ఊరిపోతుంది. అయితే చాలా మంది కాయలను కాక పండ్లను తినేందుకే..

Health Tips: మామిడిని ఇలా తీసుకుంటేనే ఎక్కువ ఆరోగ్య ప్రయోజనాలు.. పైగా క్యాన్సర్, గుండెపోటుకు చెక్..
Mangoes
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 04, 2023 | 2:57 PM

Share

మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు చాలా మందిలో తీవ్ర ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. కొందరు తరచూ సీజనల్ వ్యాధుల బారిన పడితే మరికొందరు దీర్ఘకాలిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఈ క్రమంలో ఆరోగ్య సంరక్షణ కోసం సీజనల్‌గా లభించే పండ్లను ఆశ్రయించాలని, వాటిలోని పోషకాలు శరీరానికి అవసరమైనవి కావడంతో పాటు శక్తినిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ క్రమంలో వేసవిలో ఎక్కువగా లభించే మామిడి కూడా ఆరోగ్యానికి మంచిదేనని వివరిస్తున్నారు. సాధారణంగా మామిడికాయ అనే పేరు వినగానే చాలా మందికి నోరు ఊరిపోతుంది. అయితే చాలా మంది కాయలను కాక పండ్లను తినేందుకే ఇష్టపడుతుంటారు.

అయితే నిపుణుల ప్రకారం మామిడిని పండుగా కాకుండా కాయ రూపంలో తింటేనే అధిక ప్రయోజనాలు కలుగుతాయి. మామిడిలోని పోషకాలు పచ్చిగా ఉన్నప్పుడే ఎక్కువగా ఉండడంతో పాటు అనేక రకాల పోషక లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. పచ్చి మామిడికాయలోని పోషకాలతో క్యాన్సర్, డయాబెటీస్, హృదయ సంబంధిత సమస్యలను కూడా నిరోధించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వేసవికాలంలో ఎదురయ్యే వడదెబ్బ, డీహైడ్రేషన్ వంటిని కూడా దూరంగా పెట్టవచ్చంట. ఈ క్రమంలో పచ్చి మామిడికాయలను తినడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు చేకూరుతాయో ఇప్పుడు చూద్దాం..

డయాబెటీస్: మామిడిపండ్ల కంటే మామిడికాయలో చక్కెర శాతం తక్కువగా ఉన్నందున ఇది మధుమేహులకు హానికరం కాదు. ఆదనంగా వారికి కావలసిన పోషకాలను అందించడంతో పాటు షుగర్ లెవెల్స్‌ని నియంత్రిస్తుంది.

ఇవి కూడా చదవండి

గుండె ఆరోగ్యం: మామిడికాయలోని మెగ్నీషియం, పొటాషియం శరీర రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఇంకా గుండె సంబంధిత సమస్యలను నిరోధించి హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి.  ఇంకా శరీరంలోని కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి, చెడు కొలెస్ట్రాల్‌ని శరీరం నుంచి తొలగిస్తాయి. ఫలితంగా గుండెపోటు వంటి సమస్యలు మీ దరి చేరవు.

క్యాన్సర్: పచ్చి మామిడిలో ఉండే కొన్ని రకాల పోషకాలు ప్రొస్టేట్ క్యాన్సర్‌ను నిరోధించగలవని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

వడదెబ్బ: వేసవిలోనే ప్రధానంగా లభించే మామిడికాయ హీట్ స్ట్రోక్ లక్షణాలను తగ్గించడంలో మెరుగ్గా ఉపయోగపడుతుంది. ఇందులో ఉండే పోషక లక్షణాలు, వాటర్ క్వాంటిటీ ఇందుకు గల కారణమని నిపుణులు చెబుతున్నారు.

జీర్ణక్రియ: మామిడి కాయలో పుష్కలంగా ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాక అజీర్తి, మలబద్ధకం, కడుపు మంట వంటి జీర్ణ సంబంధిత సమస్యల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుంది.

రోగనిరోధక శక్తి: మామిడికాయలో యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసే విటమిన్ సి, విటమిన్ ఇ వంటి విటమిన్లు మన తెల్ల రక్త కణాల సామర్థ్యాన్ని పెంచుతాయి. ఫలితంగా రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు సీజనల్ వ్యాధులు మన దరిచేరవు.

ఓరల్ హెల్త్: పచ్చి మామిడి తింటే నోటి దుర్వాసనను తొలగిపోతుంది. ఇంకా చిగుళ్ల నుంచి రక్తస్రావం వంటిది జరగదు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..